Share News

మెప్మా సభ్యుల పెట్టుబడితో మహిళా మార్ట్‌

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:03 PM

స్వయం సహాయక సంఘాల సభ్యుల పెట్టుబడితో మెప్మా ఆధ్వర్యంలో నడిపిన జగనన్న మహిళా మార్ట్‌ జమాఖర్చులు ఇంకా చూపకపోవడం పట్ల సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏటా జమాఖర్చుల లెక్కలు చూసి వచ్చే లభాలను సభ్యులకు పంచుతామని చెప్పి ఇంతవరకూ కనీసం లెక్కల విషయం చెప్పకపోవడం పట్ల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం పేదల ప్రజల ఆకలి తీర్చేందుకు ఏర్పా టు చేసిన అన్న క్యాంటీన్‌లను వైసీపీ అధికారంలోకి వచ్చీరావడంతోనే మూసి వేయించారు.

మెప్మా సభ్యుల పెట్టుబడితో మహిళా మార్ట్‌
కుందుర్రులో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి పాదయాత్రగా బయలుదేరిన మహిళలు

రెండేళ్లు దాటినా చూపని జమాఖర్చులు

రూ.10లక్షల సభ్యుల వాటా ధనం ఇక అంతేనా

చెల్లించాలని సంఘాల డిమాండ్‌

అద్దంకి, జూన్‌ 9 : స్వయం సహాయక సంఘాల సభ్యుల పెట్టుబడితో మెప్మా ఆధ్వర్యంలో నడిపిన జగనన్న మహిళా మార్ట్‌ జమాఖర్చులు ఇంకా చూపకపోవడం పట్ల సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏటా జమాఖర్చుల లెక్కలు చూసి వచ్చే లభాలను సభ్యులకు పంచుతామని చెప్పి ఇంతవరకూ కనీసం లెక్కల విషయం చెప్పకపోవడం పట్ల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం పేదల ప్రజల ఆకలి తీర్చేందుకు ఏర్పా టు చేసిన అన్న క్యాంటీన్‌లను వైసీపీ అధికారంలోకి వచ్చీరావడంతోనే మూసి వేయించారు. ఇంతటితో ఆగకుండా అద్దంకి పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్‌లో మెప్మా ఆధ్వర్యంలో 2022 ఫిబ్రవరి 3వ తేదీన జగనన్న మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు. అద్దంకి పట్టణంలోని స్వయం సహాయక సభ్యులు సుమారు 8000 మంది ఉండగా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.150 చొప్పున సుమారు 10.20 లక్షల రూపాయలు పెట్టుబడి నిధిని వసూలు చేశారు. ఆ డబ్బులతో సరుకులు కొనుగోలు చేసి అమ్మకాలను ప్రారంభించారు. బయట మార్కెట్‌లో ఉన్న సరుకుల ధర కంటే మహిళా మార్ట్‌లో ఒకింత ఎక్కువ ధరలు ఉండడంతో సభ్యులు కొనుగోళ్లపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో మెప్మా అధికారుల ఒత్తిడితో ఆర్‌పీల ద్వారా నెలవారీ టార్గెట్‌లు విధించి సభ్యులతో సరుకులు కొనుగోలు చేయించారు. సభ్యులే పెట్టుబడి పెట్టి వాళ్లే ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మార్ట్‌ ప్రారంభించే సమయంలో ఏటా జమా ఖర్చులు లెక్కలు చూసి వచ్చిన ఆదాయాన్ని సభ్యులకు పంచుతామని చెప్పారు. అయితే ఇప్పటికి రెండు సంవత్సరాలు దాటినా ఇంతవరకు సభ్యులకు జమాఖర్చులు లెక్కలు చెప్పలేదు. ఒక వేళ ఆదాయం వచ్చి ఉంటే ఇంతవరకు ఏ ఒక్క సభ్యురాలికి కూడా పంపిణీ చేయలేదు. ఎన్నికలలో వైసీపీ ఓటమిపాలై టీడీపీ అధికారంలోకి రావడంతో పలువురు టీడీపీ శ్రేణులు మహిళా మార్ట్‌ జగనన్న మహిళా మార్ట్‌గా ఉండడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో సభ్యులపై ఒత్తిడి చేసి సరుకులు కొనుగోలు చేయిస్తున్నారని ఫిర్యాదులు అందడం, మరలా అన్న క్యాంటీన్‌లు తెరిచే అవకాశం ఉండడంతో మున్సిపల్‌ అధికారులు రెండు రోజుల కిందట మహిళా మార్ట్‌పై ఉన్న బోర్డును తొలగిండంతో పాటు మార్ట్‌ను మూసి వే యించారు. ఈ నేపథ్యంలో మార్ట్‌లో ఉన్న సరుకుల నిల్వలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా మార్ట్‌ను నిర్వహిస్తున్న వ్యక్తులు అందులో ఉన్న సరుకులను ఎటో దాటవేశారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. సభ్యుల పెట్టుబడితో నిర్వహిస్తున్నందున వారు కట్టిన వాటా ధనాన్ని తిరిగి ఇచ్చి వేయడంతో పాటు ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని లావాదేవి లు, జమాఖర్చులు లెక్కలను వెంటనే చెప్పాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సభ్యుల పెట్టుబడి నిధిని వెనక్కి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - Jun 09 , 2024 | 11:03 PM