Share News

గుంటుపల్లి కాలువకు మహర్దశ

ABN , Publish Date - Aug 27 , 2024 | 11:07 PM

ఎన్నో ఎళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోని గుంటుపల్లి మేజర్‌ కాలువకు మహర్దశ పట్టింది. అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి చీలే గుంటుపల్లి మేజర్‌ కాలువ ద్వారా పెద అంబడిపూడి, చిన అంబడిపూడి, గుంటుపల్లి, కొత్తపాలెం, బల్లికురవ గ్రామాలలోని మూడు వేల ఎకరాలకు పైబడి పంటలకు సాగు నీరు చేరాల్సి ఉంది. ప్రతి సారీ సాగు కోసం నీటిని విడదల చేసిన సమయంలో దిగువ ఉన్న భూములకు నీరు అందే పరిస్థితి లేదు.

గుంటుపల్లి కాలువకు మహర్దశ
ఎక్స్‌కవేటర్‌తో చేస్తున్న గుంటుపల్లి మేజర్‌ కాలువ పనులు.. అభివృద్ధి అనంతరం అంబడిపూడి వద్ద కాలువ ఇలా

మంత్రి గొట్టిపాటిని కలిసి సమస్యను వివరించిన నాలుగు గ్రామాల రైతులు

తక్షణమే మేజర్‌ అభివృద్ధికి శ్రీకారం

అన్నదాతల హర్షం

బల్లికురవ, ఆగస్టు 27 : ఎన్నో ఎళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోని గుంటుపల్లి మేజర్‌ కాలువకు మహర్దశ పట్టింది. అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి చీలే గుంటుపల్లి మేజర్‌ కాలువ ద్వారా పెద అంబడిపూడి, చిన అంబడిపూడి, గుంటుపల్లి, కొత్తపాలెం, బల్లికురవ గ్రామాలలోని మూడు వేల ఎకరాలకు పైబడి పంటలకు సాగు నీరు చేరాల్సి ఉంది. ప్రతి సారీ సాగు కోసం నీటిని విడదల చేసిన సమయంలో దిగువ ఉన్న భూములకు నీరు అందే పరిస్థితి లేదు. ఈ ఏడాది అన్ని డ్యాంలు నిండి వరి సాగుకు కూడా నీరు విడుదల జరుగుతుండడంతో రైతులు ఎంతో ఉత్సాహంతో పంటల సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో గుంటుపల్లి మేజర్‌ కాలువ దట్టమైన తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. నీరు ముందుకు కదిలే పరిస్థితి లేదు. దీంతో రైతులు పం టల సాగుకు నీరు వచ్చిన ఉపయోగం లేదని, తక్షణ మే మేజర్‌ కాలువను అభివృద్ధి చేయాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ దృష్టికి సమస్యను తీసుకు వెళ్లారు. అయన స్పందించి ఎన్‌ఎస్పీ అధికారులతో మాట్లాడారు. వెంటనే గుంటుపల్లి మేజర్‌ కాలువను అభివృద్ధి చేయించాలని ఆదేశాలు ఇచ్చారు. గత రెండు రోజుల నుంచి అంబడిపూడికి చెందిన నీటి సంఘం మాజీ అధ్యక్షుడు దద్దాల అంజయ్య పర్యవేక్షణలో మేజర్‌ కాలువ పరిధిలో ఉన్న ఏడు కిలోమీటర్లను పూర్తి స్థాయిలో రెండు ఎక్స్‌కవేటర్లతో అభివృద్ధి పనులను చేస్తున్నారు. అంబడిపూడి గ్రామం వద్ద కాలువలో పూడిక తీయడంతో కాలువలో నీటి ప్రవాహం చూసి రైతులు ఆనందపడుతున్నారు. మేజ ర్‌ కాలువలో ఉన్న పూడికతో పాటు తుమ్మ చెట్లను తొలగించి బయట పడవేయడంతో నీరు దిగువ భూములకు కూడా సకాలంలో చేరుతుందని రైతులు అంటున్నారు. ఏబీసీ కాలువ తూము నుంచి తక్కువ నీరు వచ్చిన వృథా కాకుండా పంటలకు చేరుతుందని రైతులు తెలిపారు. సకాలంలో మేజర్‌ కాలువ అభివృద్ధి పరచడం పట్ల నాలుగు గ్రామాలకు చెందిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేజర్‌ కాలువ బాగు చేయడంతో రైతులు సొంతంగా చందాలు వేసుకొని మైనర్‌ కాలువలను అభివృద్ధి పరుస్తున్నారు. ఈ ఏడాది పంటలకు సాగు నీరు సకాలంలో అందేలా ముందస్తుగా మైనర్‌ కాలువలను బాగు చేసేందుకు రైతులు సన్నాహాలలో నిమగ్నమై ఉన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 11:07 PM