Share News

వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నాశనం

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:23 AM

స్థానిక సంస్థలను వైసీపీ చేసిందని టీడీపీ కూటమి ఎ మ్మె ల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఆదివారం అద్దంకి పట్టణంలో 9వ వార్డులో గొట్టిపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్‌సిక్స్‌ పథకాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ ఇంటింటి ప్రచారం చేశారు. వా ర్డులలోని సమస్యలను స్థానికులు రవికుమార్‌ దృష్టికి తీసుకొచ్చారు.

వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నాశనం
9వ వార్డులో ప్రచారం చేస్తున్న గొట్టిపాటి

మంచి నీటినీ ఇవ్వలేని దుస్థితి

అధికారంలోకి రాగానే మున్సిపాలిటీలో వసతులు

కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి

అద్దంకిటౌన్‌, ఏప్రిల్‌ 21 : స్థానిక సంస్థలను వైసీపీ చేసిందని టీడీపీ కూటమి ఎ మ్మె ల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఆదివారం అద్దంకి పట్టణంలో 9వ వార్డులో గొట్టిపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్‌సిక్స్‌ పథకాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ ఇంటింటి ప్రచారం చేశారు. వా ర్డులలోని సమస్యలను స్థానికులు రవికుమార్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ వార్డులలో మహిళలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తానన్నారు. జగన్‌రెడ్డి పంచాయతీ, మున్సిపల్‌ నిధు లు వేల కోట్లను లాక్కొన్నారని, కనీసం తాగునీటిని సక్రమంగా ఇవ్వలేకపోయారన్నారు. టీ డీపీ హయాంలో చంద్రబాబు శాశ్వత మంచినీటి పథకాన్ని రూ.90కోట్ల మంజూరు చేశారని గుర్తు చేశారు. దానిని అరకొర పనులతో నిర్లక్ష్యంగా వదిలేసి పట్టణ ప్రజలను తాగునీటికి ఇ బ్బందులు పడేలా చేశారన్నారు. కేవలం బటన్‌ నొక్కి పథకాలను అరకొరగా వర్తింపచేసి ని జమైన పేదలకు జగన్‌రెడ్డి అన్యాయం చేశారని గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. కూట మి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ పథకాలు వర్తింపచేస్తామన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి వసతులు కల్పిస్తామన్నారు. మున్పిపాలిటీ ని వాసులను ఫైన్‌లు వేసి ట్యాక్స్‌ కట్టాలని వేధిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పలకాలన్నారు. ఓటుతో జగన్‌రెడ్డిని శాశ్వతంగా ఇంటికి పంపాలని గొట్టిపాటి కోరా రు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నా యకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 12:23 AM