Share News

లైసెన్స్‌ ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:48 AM

జిల్లాలో ఎన్ని కల కోడ్‌ అమలులో ఉన్నందున లైసెన్సులు కలిగి న ఆయుధాలను తిరిగి డిపాజిట్‌ చేయించాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. కొత్తగా ఎ లాంటి లైసెన్సులు మంజూరు చేయరాదని స్పష్టం చేశారు.

లైసెన్స్‌ ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలి

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశం

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 28: జిల్లాలో ఎన్ని కల కోడ్‌ అమలులో ఉన్నందున లైసెన్సులు కలిగి న ఆయుధాలను తిరిగి డిపాజిట్‌ చేయించాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. కొత్తగా ఎ లాంటి లైసెన్సులు మంజూరు చేయరాదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లైసె న్సుడ్‌ ఆయుధాల డిపాజిట్‌, లైసెన్సు లేని ఆ యుధాలు, ఇతర పేలుడు పదార్థాల స్వాధీనం, వా టి రవాణాను అడ్డుకోవడం తదితర అంశాలపై ఎ స్పీ పరమేశ్వరరెడ్డితో కలిసి గురువారం స్థానిక కలెక్టర్‌ చాంబర్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. వ్యక్తిగత లైసెన్స్‌ ఆయుధాలను అం దరూ తిరిగి డిపాజిట్‌ చేసేలా చూడాలన్నారు. లైసెన్సుల జారీ, ఆయుధాల రకాలకు సంబంధించి వివరాలతో కూడిన రిజిస్టర్‌లను పక్కాగా అమలు చేయాలని చెప్పారు. పోలీస్‌, రెవెన్యూ అధికారుల మధ్య కామన్‌డేటా ఉండాలన్నారు. లైసెన్స్‌దారుడు చనిపోతే వారి వద్ద ఉన్న ఆయుధాల స్థితిగతులు, రాజకీయ నేపథ్యం ఉన్న ఖైదీలు జైలులో నుంచి ప్రతివారం కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న కా ల్‌డేటా వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. శాంతియుత ఎన్నికల నిర్వహణపై ఇలాంటి ఖైదీలు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండా గట్టి నిఘా పెట్టాలని చెప్పారు. అ నంతరం ఎస్పీ మాట్లాడుతూ లైసెన్స్‌దారులు త మ ఆయుధాలను డిపాజిట్‌ చేసేలా ఎన్నికల కోడ్‌ అమలులోకి రాగానే చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి లైసెన్స్‌ ఆయుధంపైన ప్రత్యేక దృష్టి పెట్టి నట్లు తెలిపారు. గుర్తింపు లేని ఆయుధాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఇలాంటివి రవాణా జరగకుండా నిఘా పెట్టినట్లు తెలిపారు. సమావే శంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఆర్వో శ్రీలత, జిల్లా జైలు సూపరింటెండెంట్‌ వరుణారెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:48 AM