Share News

రాక్షసపాలనకు చరమగీతం పాడాలి

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:35 PM

రాష్ట్రంలో రాక్షసపాలనకు చరమగీతం పాడాలని కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలో పలుగ్రామాలకు చెందిన 500 కాపు సామాజిక కుటుంబాలు వైసీపీని వీడి జనసేనలో చేరారు.

రాక్షసపాలనకు చరమగీతం పాడాలి
వైసీపీ వీడి జనసేలో చేరుతున్న వారితో కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, జనసేన రాష్ట్ర అధికారప్రతినిధి రాయపాటి అరుణ, మాజీ ఎమ్మెల్యే పాపారావు

కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

500 కుటుంబాలు జనసేనలో చేరిక

తాళ్లూరు, ఏప్రిల్‌ 18: రాష్ట్రంలో రాక్షసపాలనకు చరమగీతం పాడాలని కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలో పలుగ్రామాలకు చెందిన 500 కాపు సామాజిక కుటుంబాలు వైసీపీని వీడి జనసేనలో చేరారు. జనసేన అధికార ప్రతినిధి రాయపాటిఅరుణ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మిల సమక్షంలో గురువారం సాయంత్రం గుంటిగంగలోని కాపు సత్రంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

మండలంలోని వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం పెద్దలు రోజుల క్రితం గుంటిగంగ వద్ద సమావేశమ య్యారు. ఈపర్యాయం కాపులమంతా ఐకమత్యంగా ముందుకు సాగాలని తీర్మానించారు. ఈమేరకు మండలంలోని పలుగ్రామాలకు చెందిన 500 కాపు సామాజిక కుటుంబాలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తమ మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా అభ్య ర్థి డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనన ు సాగనంపేందుకు కాపు సామాజికవర్గ శ్రేణులు వైసీపీని వీడి జనసేనలో చేరి కూటమ అభ్యర్థులకు మద్దతు తెలపడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్ల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నగరపంచాయతీ చైర్మన్‌ పిచ్చయ్య, మండల కాపునేతలు మారిశెట్టి హనుమంతరావు, గాజుల కోటేశ్వరరావు, చిరంజీవి, కూటాల ప్రసాద్‌, వీరమహిళ మారాబత్తుల సుజాత, తదితరులు పాల్గొన్నారు.

కురిచేడు అభివృద్ధికి పాటుపడతా!

కురిచేడు, ఏప్రిల్‌ 18: కురిచేడు అభివృద్ధికి కృషిచేస్తానని కూటమి అభ్య ర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గు రువారం కురిచేడు గ్రామంలో ఆమె ఎ న్నికల ప్రచారం ప్రారంభించారు. ముం దుగా దర్శి రోడ్డులోని బ్రహ్మంగారి దే వాలయం, అయ్యప్పస్వామి దేవాలయా ల్లో పూజలు నిర్వహించారు. నుసుం బ జారులో మాజీ సొసైటీ అధ్యక్షుడు క మతం నాగిరెడ్డి భార్య రమాదేవి గుమ్మడికాయతో దిష్టితీసి ప్రచారాన్ని ప్రారంభింపచేశారు. అ క్కడినుంచి వాసవి ఆలయం వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం వాస వి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన కూడలిలో ప్రజలతో మాట్లాడారు.

కురిచేడు మండలానికి శాశ్వత మంచినీటి పథకం తెచ్చే బా ధ్యత తనదేనని లక్ష్మి చెప్పారు. మీ ఇంటి ఆడపడచుగా ఆదరిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. దర్శిని వీడివెళ్ళేది లేదని, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం వినుకొండ రోడ్డులో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాలకు దగ్గరగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ మండల అధ్యక్షుడు నెమిలయ్య, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన 20 కుటుంబాలు.. కురిచేడు, ఏప్రిల్‌ 18: కురిచేడు మండలం ఆవులమంద పంచాయతీ ప్రతిజ్ఞాపురి కాలనీకి చెందిన 20 కుటుంబాలు గురువారం కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త లలిత్‌ సాగర్‌ సమక్షంలో వైసీపీని వీడీ టీడీపీలో చేరారు. కార్యక్రమంలో కిలారి కొండయ్య, పిడతల నెమిలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:35 PM