Share News

దుర్మార్గపు పాలనను అంతంచేద్దాం

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:27 AM

వైసీపీ ప్రభుత్వ దర్మార్గపు పాలనను అంతంచేద్దాం అని మార్కాపురం మాజీ శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు.

దుర్మార్గపు పాలనను అంతంచేద్దాం

పొదిలి, డిసెంబరు 31 : వైసీపీ ప్రభుత్వ దర్మార్గపు పాలనను అంతంచేద్దాం అని మార్కాపురం మాజీ శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్నది అభివృద్ధి పాలనకాదని రాక్షస పాలనని విమర్శించారు. జగన్‌రెడ్డి దుర్మార్గపు పాలన నుంచి ప్రజలను కాపడుకోవాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలపై ఉందన్నారు. నాలుగు సంవత్సరాల 9 నెలల పాలనలో జగన్‌రెడ్డి చేసిన అభివృద్దిని భూతద్దంలో పెట్టి వెతికినా కనపడని పరిస్థితి ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం చేతకాక వాయిదాల పర్వం నడిపిస్తున్నాడ న్నారు. ఆరు నెలల క్రితం మార్కాపురం వచ్చిన అబద్దాల ముఖ్యమంత్రి వెలుగొండను అక్టోబర్‌లో పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తానని చెప్పాడన్నారు. డిసెంబరు దాటినా ఆ ఊసే ఎత్తడం లేదని ఎద్దేవ చేశారు. నాడు పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే వైన్‌షాపులు ఎత్తివేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు సొంత కంపెనీలతో సొంత బ్రాండ్లు తయారుచేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలను నిలువున తీస్తున్నాడన్నారు. మార్కాపురం చెరువును ట్యాంక్‌బండ్‌ చేస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారాన్నారు. పొదిలి పెద్దచెరువు ద్వారా తాగునీటిని అందిస్తానన్న హామీ ఏమైౖందన్నారు. రాష్ట్రభివృద్ధిని దృష్టిలో ఉంచు కొని అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసి చంద్రబాబు అభివృద్ధి చేస్తే ఇప్పుడు కక్షసాధింపుతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని చేసిన ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుంద న్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని చూపిస్తూ నూరుశాతం అభివృద్ధి చేసినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. వైసీపీ పాలనలో జరిగినన్ని భూదందాలు గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. టీడీపీకి ప్రజలు ఓటుతో మద్దతుగా నిలిచే సమయం అసన్నం అయ్యిందన్నారు. ముందుగా నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాంకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పొదిలి, కొనకనమిట్ల మండలాల టీడీపీ అధ్యక్షులు మీగడ ఓబులరెడ్డి, మోరబోయిన బాబురావు, పట్టణాధ్యక్షులు ముల్లా ఖుద్దూస్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌, మజీ జడ్పీటీసీ సభ్యుడు కాటూరి పెదబాబు, మాజీ సర్పంచ్‌ కాటూరి చినబాబు, జిల్లా కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ గౌస్‌, మాజీ ఎంపీటీసీ డాక్టర్‌ ఇమాంమ్‌సా, లాయర్‌ షబ్బీర్‌, నాయకులు కాటూరి శ్రీను, యాసిన్‌, తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, బొడ్డు సుబ్బయ్య టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పొదిలి : దళితులకు జగన్‌ తీరని అన్యాయం చేశారని వచ్చే ఎన్నికల్లో వైసీపీని పాతాళంలో తొక్కె య్యాలని మార్కాపురం మాజీ శాససభ్యుడు కందుల నారాయణరెడ్డి అన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు మోరబోయిన బాబురావు ఆధ్వర్యంలో కొనకనమిట్ల మండలంలోని నాగంపల్లి, బోడపాడు, గుర్రాలమడుగు ఎస్సీకాలనీల్లో దళితవాడల సందర్శన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్ల్లో జగన్మోహన్‌రెడ్డి ‘ఒక్కసారి అవకాశం’ నినాదంతో మాయమాటలు చెప్పారన్నారు. 2024లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 12:27 AM