Share News

వైసీపీని వీడి టీడీపీలోకి

ABN , Publish Date - Apr 25 , 2024 | 10:45 PM

రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా పర్చూరు ని యోజకరవ్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరికి మద్దతు తెలుపుతున్నారు. ప్రతిరోజూ వైసీపీకి గుడ్‌బై చెప్పి సైకిల్‌ ఎక్కుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. గత రెండు నెలల నుంచి పార్టీలోకి వలసల జోరుగా సాగుతున్నాయి.

వైసీపీని వీడి టీడీపీలోకి
ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరిన ఉప్పుటూరు వైసీపీ నాయకులు

ఏలూరికి మద్దతు తెలుపుతున్న నేతలు

అందరం కలిసి అభివృద్ధిని పునఃప్రారంభిద్దాం

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సాంబశివరావు

పర్చూరు, ఏప్రిల్‌ 25: రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా పర్చూరు ని యోజకరవ్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరికి మద్దతు తెలుపుతున్నారు. ప్రతిరోజూ వైసీపీకి గుడ్‌బై చెప్పి సైకిల్‌ ఎక్కుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. గత రెండు నెలల నుంచి పార్టీలోకి వలసల జోరుగా సాగుతున్నాయి. పార్టీలకు అతీతంగా ఏలూరి చేస్తున్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, అందరికీ అందుబాటులో ఉంటున్న తీరుకు ప్రజా మద్దతు పెరుగుతోంది. గురువారం మార్టూరు మండలం ఇసుకదర్శి ఏలూరి క్యాంప్‌ కార్యాలయంలో మార్టూరు, పెద్దగంజాం, ఉప్పుటూరు, గర్నెపూడి, కోనంకి గ్రామాల నుంచి వందలాది మంది తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి ఏలూరి కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రపుఃనిర్మాణం, భావితరాల భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరూ టీడీపీలో కలసి రావాలని కోరారు. వైసీపీ అరాచక విధ్వంస పాలనను సాగనంపేందుకు ప్రజా కూటమి ఏర్పాటు అయ్యిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం తథ్యమన్నారు.

పెదగంజాంలో..

పెద్దగంజాంకు చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు పలువురు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారిలో భీమవరపు సుందరంకొండ, ఆముదాలపల్లి శివ, భీమవరపు రాములు, ఆముదాలపల్లి గోపి, భీమవరపు శ్రీను, మార్టూరి రామచంద్ర, ఆముదాలపల్లి అంకమ్మరావు, శ్రీనివాసరావు, మురళీ, కోటయ్య, వెంకటేష్‌, నూటక్కి కోటేశ్వరరావు ఉన్నారు.

ఉప్పుటూరులో..

పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి ఏలూరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పాలేటి శివనాగేశ్వరావు, షేక్‌.కరిముల్లా, ఉరుమ కుమార వీరభద్రరావు, కొమ్మనబోయిన కోటయ్య, షేక్‌ ఖాశీంబుడే ఉన్నారు.

మార్టూరులో..

మార్టూరుకు చెందిన పాలపర్తి వెంకటేశ్వర్లు, ఉయ్యాల ఆంజనేయులు, పాలపర్తి రత్తయ్య, పాలపర్తి నాగరాజు, కోటేశ్వరరావు, అలపర్తి వీరబ్రహ్మం, ఉయ్యాల నరేంద్ర, పేరం అనిల్‌ పార్టీలో చేరారు. తూర్పు బజార్‌కు చెందిన దగ్గుబాటి సుధాకర్‌, సురేష్‌, మక్కెన రమణ, కోటి శ్రీనివాసరావు, దాశి రక్షణ పార్టీలో చేరారు. కోనంకికి చెందిన పఠాన్‌ నాగూర్‌ వలి పార్టీలోకి చేరారు.

గర్నెపూడిలో..

పర్చూరు మండలం గర్నెపూడి గ్రామానికి చెందిన షేక్‌ ఖాదర్‌వలి, షేక్‌ ఖాశీంబుడే, పఠాన్‌ నాగూర్‌ మీర్సా, షేక్‌ నాగూర్‌ వలి, పఠాన్‌ సుభానీ, కొరిటాల ఈశ్వర్‌చంద్ర, పార్టీలోకి చేరారు.

పర్చూరులో దూసుకుపోతున్న టీడీపీ ప్రచారం

వాడవాడలా టీడీపీకి బ్రహ్మరథం

సార్వత్రికల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ప్రజా కూటమి చేపడుతున్న ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతూ అడుగడునా స్వాగతం తెలపుతున్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు విజయం కోసం పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు, వృద్ధులు సైతం తరలివచ్చి మద్దతు తె లుపుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీకి చెందిన శ్రేణులు టీడీపీలో చేరుతున్నారు. గురువారం మండలంలోని చెరుకూరు గ్రామంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి ఉషారాణి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించి చంద్రన్న సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు.

కారంచేడులో..

కారంచేడు గ్రామ పార్టీ అధ్వర్యంలో గురువారం ఎన్నిలక ప్రచారం నిర్వహించారు. ఈప్రచారానికి పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, యువకలు తరలివచ్చారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరిని సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇంకొల్లులో కూటమి శ్రేణుల ప్రచారం

ఇంకొల్లు : టీడీపీ కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావును అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రిని చే యాలని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు విస్తృత ప్రచారాన్ని చేశారు. గు రువారం ఇంకొల్లు స్టాలిన్‌పేటలో జరిగిన ప్రచారంలో టీడీపీ టౌన్‌ అధ్యక్షుడు వలేరు మార్క్‌, యడ్లూరి ప్రసాద్‌, కొల్లూరి రాంబాబు, శివాజీ, మండల మహి ళా నాయకురాలు బిందుమాధవి, మండల ప్రచార కార్యదర్శి అనంతలక్ష్మి, శివయ్య, రాజే్‌ష, సాంబయ్య, మీరావలి, భాస్కర్‌, నాని పాల్గొన్నారు.

వైసీపీ పాలన అంతం

చినగంజాం : వైసీపీ పాలన అంతమై.. టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన రాబోతుందని చినగంజాం గ్రామ సర్పంచ్‌ రాయని ఆత్మారావు, టీడీపీ సీనియర్‌ నాయకులు టీ.జయరావులు అన్నారు. చినగంజాం గ్రామ పంచాయతీ పరిధిలోని సుందరయ్యకాలని, రామకోటేశ్వర, మహాలక్ష్మికాలనీల్లో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి, ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్‌ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. బాబు ష్యూరిటీ .. భవిష్యత్‌కు గ్యారెంటీ కరపత్రా లను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబ్దుల్‌కలాం అజాద్‌, సందు శ్రీనివాసరావు మోటుమర్రి రామసుభ్బారావు, నరహరి శ్రీనివాసరావు, బెల్లంకొండ రమే్‌షబాబు, ఎం.పద్మావతి, చేవూరి రవణమ్మ, గంటా చెన్నయ్య, పీ.శ్రీనివాసరావు, సుభాని, మహబూబ్‌ఖాన్‌, జి.వెంకటనారాయణ, అమీర్జాన్‌, ఎస్‌.సూరిబాబు, మహేష్‌, మురళి పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 10:45 PM