Share News

కూనం కుటుంబమంతా వైసీపీ సభ్యులే

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:48 AM

విశాఖలో పట్టుబడిన కొకైన్‌ వ్యహారంలో కీలకమైన కూనం పూర్ణ చంద్రరావు వైసీపీ సీనీయర్‌ నాయుకుడిగా ఉండగా, ఆయన కుటుంబమంతా వైసీపీ వ్యవస్థాపక సభ్యులే అని సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి బీఎన్‌. విజయ్‌ కుమార్‌ అన్నారు. సోమారం సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ మొదటి స్థానంలో ఉంటే జగన్‌ రెడ్డి హయాంలో డ్రగ్స్‌ రవాణాలో నెం.1 స్థానానికి చేర్చాడని విమర్శించారు.

కూనం కుటుంబమంతా వైసీపీ సభ్యులే
సమావేశంలో మాట్లాడుతున్న బీఎన్‌ విజయ్‌కుమార్‌, నేతలు

ఒంగోలు (కార్పొరేషన్‌), మార్చి 25 : విశాఖలో పట్టుబడిన కొకైన్‌ వ్యహారంలో కీలకమైన కూనం పూర్ణ చంద్రరావు వైసీపీ సీనీయర్‌ నాయుకుడిగా ఉండగా, ఆయన కుటుంబమంతా వైసీపీ వ్యవస్థాపక సభ్యులే అని సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి బీఎన్‌. విజయ్‌ కుమార్‌ అన్నారు. సోమారం సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ మొదటి స్థానంలో ఉంటే జగన్‌ రెడ్డి హయాంలో డ్రగ్స్‌ రవాణాలో నెం.1 స్థానానికి చేర్చాడని విమర్శించారు. వీరభద్రరావు సోదరుడు కూనం పూర్ణచంద్రరావు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వైసీపీ సీనియర్‌ నేత అని, ఇతనికి విజయసాయి రెడ్డితో సంబంధాలు ఉన్నాయని అన్నారు. విశాఖలో పట్టుబడిన కంటైనర్‌లో వివిధ రకాల మత్తు పదార్థాలు ఉన్నాయని సీబీఐ తన నివేదికలో పేర్కొందన్నారు. గతంలో విజయవాడలోని ఆశీ ట్రేడర్స్‌ పేరుతో ముంద్రా పోర్టులో రూ. 21 వేల కోట్లు విలువైన హెరాయిన్‌ దిగుమతిలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇపుడు ఏకంగా డ్రై ఈస్ట్‌తో కలిపి రూ. 50 వేల కోట్ల విలువైన 25వేల కిలోల మార్సిన్‌, కొకైన్‌, హెరాయిన్‌, యాంపట్‌ మిన్‌ వంటి మత్తు పదార్థాలు దొరికాయన్నారు. బ్రెజిల్‌ నుంచి మత్తు పదార్థాలు దిగుమతి చేస్తున్నారని తెలిసే జగన్‌ రెడ్డి తన అధికారులను పంపారా ? అని ప్రశ్నించారు. కల్తీ మద్యం, మాఫియాతో ఇన్నాళ్ళు ప్రజల ఇళ్లూ, ఒళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని ఆయన విమర్శించారు. వైసీపీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై నిందలు వేయడం దుర్మార్గమన్నారు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర సెక్రటరీ అడక స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని, గొల్లపూడి సుబ్బారావు, సెక్రటరీ కాకర్ల లక్ష్మి ప్రసాద్‌, రావుల సుబ్బారావు, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు కంకణాల గోపి, అట్లూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:48 AM