Share News

భక్తుల కొంగుబంగారం శింగరకొండ

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:45 PM

శింగరకొండ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా ఖ్యాతికెక్కింది. ఒకప్పుడు ఇక్కడ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేవాల యాలతో పాటు భక్తాంజనేయస్వామి దేవాలయం, శ్రీవెం కటేశ్వరస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, అయ్యప్పస్వామి దేవా లయం, శ్రీకృష్ణుని దేవాలయం, 99 అడుగుల అభయాం జనేయస్వామి ఆలయాలు, ఇంకా పలు చిన్న దేవాలయా లు ఉన్నాయి.

భక్తుల కొంగుబంగారం శింగరకొండ
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహిస్తున్న పూజారులు

నేడు ప్రధాన తిరునాళ్ల

అద్దంకి, మార్చి 24: శింగరకొండ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా ఖ్యాతికెక్కింది. ఒకప్పుడు ఇక్కడ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేవాల యాలతో పాటు భక్తాంజనేయస్వామి దేవాలయం, శ్రీవెం కటేశ్వరస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, అయ్యప్పస్వామి దేవా లయం, శ్రీకృష్ణుని దేవాలయం, 99 అడుగుల అభయాం జనేయస్వామి ఆలయాలు, ఇంకా పలు చిన్న దేవాలయా లు ఉన్నాయి. కొండపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి దే వాలయానికి మెట్ల మార్గం ఉంది. మూడు దశాబ్దాల క్రితం కొండపైకి ఘాట్‌ రోడ్డు నిర్మాణం చేశారు.

రెండు తెలుగు రాష్ర్టాలలో దక్షిణ ముఖంగా ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం శింగరకొండలో మాత్రమే ఉంది. 1916లో భవనాసి చెరువు నిర్మాణం పనులు ప్రా రంభించి రెండు సంవత్సరాలలో పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో ఆంజనేయస్వామి దేవాలయం కొద్దిమే ర అభివృద్ధి చేశారు. తొలుత మంగళ, శని వారాలలో మాత్రమే భక్తులు శింగరకొండకు వచ్చేవారు. 1960 నుచి దేవాలయం దేవదాయశాఖ పరిధిలోకి చేరింది. అనం తరం భక్తులు, దాతల సహకారంతో దేవాలయం అభివృ ద్ధి చెందింది. 1984లో ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరిగింది. దక్షిణ రాజగోపురాన్ని దేవాలయం నిధులతో నిర్మించగా, మిగిలిన మూడు రాజగోపురాలను దాతల సహకారంతో నిర్మించారు. దేవస్థానం ముఖ మండపం పునర్నిర్మాణా నికి టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 కోట్లు మం జూరయ్యాయి. మరో రూ.3 కోట్లు దాతల నుంచి సేకరి స్తూ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో పక్కనే బాలాలయంలో ప్రత్యేకంగా మొద్దుతో స్వామి వారి విగ్ర హం తయారు చేయించి ప్రతిష్ఠించారు. ప్రస్తుతం కూడా అక్కడే స్వామి వారి దర్శనం కొనసాగుతుంది. ప్రధాన ఆలయం పనులు పూర్తయ్యేందుకు మరి కొంత సమ యం పట్టే అవకాశం ఉంది.

దాతల సహకారంతో మారిన రూపురేఖలు

శింగరకొండలో ఇటీవల కాలంలో దా తల సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరగటంతో రూపురేఖలు మారి పోయాయి. శింగరకొండలో టీటీడీ, రా ష్ట్ర ప్రభుత్వం, దాతల సహకారంతో సుమారు రూ.7 కోట్లతో రాతి ముఖ మండపం ని ర్మాణ పనులు జరుగుతున్నాయి. దాతల సహకారంతో పొంగలిశాల, భక్తుల వి శ్రాంతిశాల, నిత్యాన్నదాన భవనం, షా పింగ్‌ కాంప్లెక్స్‌, పరిపాలన భవనం, కేశ ఖండన శాల, పోలవరపు యాగశాల, గో శాల నిర్మాణం చేశారు. దామచర్ల అతిథి గృహం ఆధునికీకరణ పనులు చేపట్టారు.

మూడు రోజుల పాటు ఉత్సవాలు

ప్రతి ఏటా పాల్గుణ శుద్ధ త్రయోదశి నుండి పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు తిరునాళ్ల ఉత్సవాలు జరుగుతాయి. మూడోరోజు ప్రధాన తిరునాళ్ల జరుగుతుంది. ఈఏడాది మార్చి 23 నుంచి 25 వరకు 69వ వార్షిక తిరునాళ్ల ఉత్సవాలు జ రుగుతునున్నాయి. ప్రధాన తిరుణాళ్ల సోమవారం జరగనుంది.

తొలిసారి ఒకేఒక్క విద్యుత్‌ ప్రభ

తిరునాళ్ల ఉత్సవాలు ప్రారంభమై 69 సంవత్సరాలు కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఒకే ఒక్క విద్యుత్‌ ప్రభ ఏర్పాటు జరుగుతుంది. రాజకీయ పార్టీ ల నేతల ఆధ్వర్యంలో విద్యుత్‌ ప్రభల ఏర్పాటు జరుగుతుంటుంది. ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రాజకీయ పార్టీల జెండాలు ఏర్పాటు కు అనుమతి లేక పోవటం, డ్యాన్స్‌లకు పోలీస్‌ అధికారులు అనుమతులు ఇవ్వకపోవటంతో విద్యుత్‌ ప్రభల ఏర్పాటుకు వెనకడుగు పడింది.

అద్దంకి మున్సిపాలిటీ లోని వైసీపీ కౌన్సిలర్‌ ల ఆ ధ్వర్యంలో మా త్రమే ఒకే ఒక్క విద్యుత్‌ ప్రభ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో భక్తులు ఒకింత నిరుత్సాహం కు గురవుతున్నారు. అదే సమయంలో ప్రధాన ఆలయం రాతి మండపం నిర్మాణ పనులు జరుగుతుండగా బాలా లయం లో ఆంజనేయస్వామి దర్శనం చేసుకోవాల్సి రావ టం కూడా భక్తులలో నిరాసక్తతను మరింత పెంచింది. దీంతో గతంలో ఎన్నడూ లే ని పరిస్థితులు ఈ ఏడాది శింగరకొండ వార్షిక తిరునాళ్లకు ఏర్పడ్డాయని భక్తులు అభి ప్రాయపడుతున్నారు.

వైభవంగా అభిషేకాలు

అద్దంకి, మార్చి 24: శింగరకొండ లక్ష్మీనర సింహస్వామి, ప్రసన్నాంజనేయస్వామి వార్ల 69వ వార్షి కోత్సవ తిరునాళ్లు ఉత్సవాలు రెండోరోజు ఆదివారం వైభ వంగా సాగాయి. ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ఉదయం సుప్రభాత సేవ, బిందె తీర్తం నిర్వహించారు. అనంతరం విశేష అభిషేకం నిర్వహించారు. రుత్వికులచే మహన్యాస పూర్వక ఏకాదశ మన్యుసూక్త వారాభిషేకం, సందరాకాండ పారాయణ, సూర్య నమస్కారాలు, సప్త శతి పారాయణ, పంచామృతాలు, దశ ద్రవ్యాలచే విశేష అభిషేకం నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన భజ న, రశ్రీసాయి నాట్య కళాసమితి ఆధ్వర్యంలో ప్రదర్శించిన దేవనర్తకి పూర్తి నాటకం, కోలాట ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి. స్వామి వారికి ఉష్ట్ర వాహన సేవ నిర్వహించారు.

ప్రధాన తిరునాళ్ల సందర్భగా సోమవారం ఉదయం సుప్రభాత సేవ, బిందె తీర్ధం, ప్రాతఃకాలార్చన నిర్వ హించనున్నారు. ఉదయం 5.30 నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్విరామంగా స్వామి వారి దివ్య దర్శనం ఉంటుంది. సోమవారం ఉదయం 10 గంటలకు భజన, రాత్రి 7 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శన, సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. రాత్రి 7 గంటలకు రథోత్సవం కన్నుల పండు గగా సాగనుంది.

లక్ష్మీనరసింహస్వామి దేవాలయం లో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. రెండు దేవాలయాల వద్ద విద్యుత్‌ దీపాల వెలుగులతో దేదీప్యమానంగా మారింది. సోమవారం కొండపైకి దాతల సహకారంతో ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. తిరునాళ్ల సందర్భంగా అద్దంకి డిపో నుంచి 30 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డీఎం రామ్మోహనరావు తెలిపారు. ఒంగోలు, పొదిలి, వినుకొం డ, నర్సరావుపేట డిపోల నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. సుమారు ఆరువందల మంది పోలీస్‌లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నామ్‌ రోడ్డులో ట్రాఫిక్‌ను మేదరమెట్ల, సంతమాగులూరు అడ్డ రోడ్డుల వద్ద నుంచి చిలకలూరిపేట, నర్సరావుపేట ల మీదుగా మరల్చనున్నారు.

Updated Date - Mar 24 , 2024 | 11:45 PM