Share News

అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నా..

ABN , Publish Date - May 12 , 2024 | 01:11 AM

‘ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మూడేళ్లగా పల్లె,పల్లెకు వెళ్లా ప్రజల సమస్యలను గుర్తించా, ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధం అయ్యారు.’

అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నా..

ఎర్రగొండపాలెం, మే 11 : ‘ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మూడేళ్లగా పల్లె,పల్లెకు వెళ్లా ప్రజల సమస్యలను గుర్తించా, ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధం అయ్యారు.’ ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు. నియోజకవర్గంలో గత నెలరోజులుగా ఎన్ని కల ప్రచారం పూర్తి అయిన సందర్భంగా శనివారం పలు విషయాలు వెల్లడించారు. ఐదేళ్లగా వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులకు గురైన ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ది చేసే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. నియోజకవర్గం ఐదు మండలాలల్లో తాగునీటి సమస్య, గ్రామాల్లో రోడ్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. టీడీపీతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో 20 వేల మెజార్టీతో విజయం సాధిస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు. ఎర్రగొండపాలెం మండలం లో టీడీపీకి 6500 మెజార్టీ, పుల్లలచెరువు మండలంలో 4500, త్రిపురాంతకం మండలంలో 6000 ఆరువేలు, దోర్నాల మండలం 1500, పెద్దారవీడు మండలంలో 1500, ఐదు మండలాలలో 20 వేల మెజారిటీ సాధిస్తామన్నారు. సమావేశంలో ఎర్రగొండపాలెం మండల టీడీపీ అధ్యక్షు లు చేకూరి సుబ్బారావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మంత్రునాయక్‌, టీడీపీ రాష్ట్ర తెలుగుయువత సభ్యులు పోట్ల గోవింద్‌, మండల టీడీపీ కొత్తమాసు సుబ్రహ్మణ్యం, తోట మహేష్‌, గుమ్మా గంగరాజు, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

త్రిపురాంతకం : టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుమార్తె చెల్సియా అన్నారు. మండలంలోని సంఘం తండా గ్రామంలో శనివారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికీ తిరుగుతూ సైకిల్‌ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా ఎరిక్షన్‌బాబును, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. టీడీపీతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి జరుగుతుందని, గిరిజనులు అభివృద్ది చెందుతారని తెలిపారు. ఈకార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 01:11 AM