Share News

కట్టిందొకరు.. కటింగ్‌ ఒకరు!

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:39 PM

వైసీపీ నేతలు చేయని పనులకు కూడా ఆర్భాటం చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. 2003లో టీడీపీ ప్రభుత్వంలో పునాదులు వేయగా, 2019 మార్చి 6న మొదటి అంతస్తుకు ఎమ్మెల్యే హోదాలో దామచర్ల జనార్దన్‌ ప్రారంభోత్సవం చేశారు. అప్పటికే మునిసిపల్‌ శాఖమంత్రిగా ఉన్న నారాయణ షాదీఖానాకు రూ.కోటి నిధులు కేటాయించగా చకచకా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులకు దామచర్ల రూ.1.5కోట్లతో టెండర్లు పిలిచి సిద్ధం చేయగా ఎన్నికల కోడ్‌ రావడంతో ఆగిపోయాయి. అయితే స్థలం కేటాయింపు, పునాదులు నుంచి ప్రారంభోత్సవం వరకు టీడీపీ హయాంలోనే జరగ్గా, షాదీఖానా నిర్మాణం అంతా తామే చేశామని వైసీపీ నేతల గొప్పల పోవడంపై ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా నేడు ప్రారంభోత్సవం చేయడం కోసం అధికారులు కూడా హడావుడి చేయడం గమనార్హం.

కట్టిందొకరు.. కటింగ్‌ ఒకరు!
ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన షాదీఖానా

ఇరవై ఏళ్ల నాటి కల.. ముస్లిం షాదీఖానా టీడీపీ హయాంలోనే పునాదులు, ప్రారంభోత్సవం

ఫండ్స్‌ ఇచ్చిన ఎంపీ మాగుంటకు పిలుపులేదు

నేడు 2వ అంతస్తు ప్రారంభం

అంతా తామే పూర్తిచేశామని వైసీపీ గొప్పలు

నిధులు ఇచ్చింది, పూర్తిచేసింది గత ప్రభుత్వమే

వైసీపీ నేతలు చేయని పనులకు కూడా ఆర్భాటం చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. 2003లో టీడీపీ ప్రభుత్వంలో పునాదులు వేయగా, 2019 మార్చి 6న మొదటి అంతస్తుకు ఎమ్మెల్యే హోదాలో దామచర్ల జనార్దన్‌ ప్రారంభోత్సవం చేశారు. అప్పటికే మునిసిపల్‌ శాఖమంత్రిగా ఉన్న నారాయణ షాదీఖానాకు రూ.కోటి నిధులు కేటాయించగా చకచకా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులకు దామచర్ల రూ.1.5కోట్లతో టెండర్లు పిలిచి సిద్ధం చేయగా ఎన్నికల కోడ్‌ రావడంతో ఆగిపోయాయి. అయితే స్థలం కేటాయింపు, పునాదులు నుంచి ప్రారంభోత్సవం వరకు టీడీపీ హయాంలోనే జరగ్గా, షాదీఖానా నిర్మాణం అంతా తామే చేశామని వైసీపీ నేతల గొప్పల పోవడంపై ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా నేడు ప్రారంభోత్సవం చేయడం కోసం అధికారులు కూడా హడావుడి చేయడం గమనార్హం.

ఒంగోలు (కార్పొరేషన్‌), మార్చి4: జిల్లాకేంద్రమైన ఒంగోలులో ముస్లింల చిరకాల కల షాదీఖానా. నాడు తెలుగుదేశం పార్టీ హయాంలో పునాదులు వేసుకుని, మొదటి అంతస్తు ప్రారంభంతో మొదలైన సంతోషం నేడు పూర్తిస్థాయిలో నెరవేరుతోంది. అదీ కూడా పనులు మొదలైన ఐదేళ్ల తర్వాత. స్థానిక ఒంగోలు నగరంలోని ఊరచెరువులో సుమారు ఎకరా స్థలంలో నిర్మించిన షాదీఖానా ముస్లిం కుటుంబాల శుభకార్యాలకు వేదికగా మారనుంది. అయితే2003లో అప్పటి గుంటూరు ఎంపీ లాల్‌జాన్‌ బాషా శంకుస్థాపన చేసి రూ.5లక్షలతో మొదలుపెట్టారు. ప్రస్తుతం రూ.4కోట్లు వ్యయంతో పూర్తిచేసుకుని మంగళవారం ప్రారంభానికి ముస్తాబైంది. ఇదిలా ఉంచితేగడిచిన ఇరవై ఏళ్లు అనేక ఒడుదుడుకులు, అడ్డంకులు మధ్య ఆగి.. సాగింది. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో శంకుస్థాపనకు అప్పటి ఎంపీగా కరణం బలరామకృష్ణమూర్తి, మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా దివంగత దామచర్ల ఆంజనేయులు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. యక్కల తులసీరావు మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నపుడు ఈ షాదీఖానాకు కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేసి ఎకరా స్థలాన్ని కేటాయించారు. దాంతో టీడీపీ హయాంలో పునాదులు వేయగా, ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పిల్లర్ల దశలో ఉన్న భవనానికి 2వసారి శంకుస్థాపన మాత్రమే చేశారు. కానీ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు.

టీడీపీ హయంలో పూర్తి

ఇదిలా ఉండగా రాజశేఖర్‌రెడ్డి మరణించిన తర్వాత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా కందుకూరు శాసనసభ్యులుగా ఉన్న మానుగుంట మహీధర్‌రెడ్డి మునిసిపల్‌ శాఖ మంత్రిగా రూ.కోటి రూపాయలు మంజూరు చేయించారు. భవన నిర్మాణం పంచాయతీరాజ్‌ఆధ్వర్యంలో చేపట్టగా, మునిసిపల్‌ శాఖ అధికారులు పర్యవేక్షణ చేశారు. ఆ తర్వాత దామచర్ల జనార్దన్‌ ఎమ్మెల్యేగా గెలిచాక మొదటి అంతస్తు భవన నిర్మాణం పూర్తి కోసం రూ.కోటినిధులను మునిసిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కేటాయించారు. అదేసమయంలో మొదటి అంతస్తు ప్రారంభించిన నేతలు రెండవ అంతస్తుకు మరో రూ.1.5కోట్ల నిధులు కేటాయించి. టెండర్లు కూడా పిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు నిలిచిపోయాయి. తదనంతరం ఎంపీ హోదాలో మాగుంట శ్రీనివాసరెడ్డి తన ల్యాడ్స్‌ నుంచి మొదటగా రూ.25లక్షలు, ఆ తర్వాత రూ.50లక్షలు మంజూరు చేయించారు. దీంతో మొత్తంగా సుమారు రూ.4కోట్లు మొదటి, రెండవ అంతస్తు భవన నిర్మాణంగా కాగా, నేడు వైసీపీ నేతలు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో కేటాయంచిన ఎకరాస్థలం, భవన నిర్మాణం అంతా తామే చేసినట్లు వైసీపీ నేతలు గొప్పలు పోతున్నారు. దీనిపై వాస్తవాలు తెలిపిన పలువురు ముస్లింలు వైసీపీ తీరుపై పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంచితే నేడు ప్రారంభోత్సవం వైసీపీ ఆర్భాటపు ప్రచారం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు షాదీఖానా నిర్మాణానికి ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వని ఆ పార్టీ నేడు ప్రారంభోత్సవం చేయడం విడ్డూరంగా ఉందని పలువురు వెల్లడిస్తున్నారు.

ఎంపీ మాగుంటకు లేని ఆహ్వానం

షాదీఖానా నిర్మాణం కోసం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనవంతు సహకారం అందించారు. ఎంపీ నిధుల నుంచి మొదటగా రూ.25 లక్షలు కేటాయించిన ఆయన పనుల్లో జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేసేందకు ఎంపీ ల్యాడ్స్‌ నుంచి మరో రూ.50 లక్షలు కేటాయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, షాదీఖానా నిర్మాణంలో తనవంతు బాధ్యత నెరవేర్చిన మాగుంటకు మాత్రం ప్రారంభోత్సవం సందర్భంగా కనీస ఆహ్వానం లభించలేదు. మంగళవారం ఊరచెరువులో నిర్మించిన షాధీఖానా ప్రారంభోత్సవానికి మాగుంటకు ఆహ్వానం లేకపోవడంపై ఆయన అనుచరుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వైసీపీలో కొనసాగిన మాగుంట ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే నేటికి ఎంపీ పదవిలో ఉన్నప్పటికీ ప్రోటోకాల్‌ కోసం కూడా ఆయనకు ఆహ్వానం లేదు. అయితే ఈ కార్యక్రమానికి మాగుంటను ఆహ్వానించడానికి వీల్లేదంటూ వైసీపీ నేతలు నుంచి అధికారులపై ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. దీనిపై మాగుంట అభిమానులు, పలువురు ముస్లింలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

Updated Date - Mar 04 , 2024 | 11:39 PM