టూరిజం ప్రాంతంగా కనిగిరికి గుర్తింపు తీసుకొస్తాం!
ABN , Publish Date - Aug 29 , 2024 | 11:10 PM
ఎంతో పురాతన చరిత్ర వైభవం కల్గిన కనిగిరి దుర్గం టూరిజం ప్రాంతంగా గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం గ్రామ పరిధిలోని ఎకో టూరిజం ఆఫ్ ఇండియా చేపట్టిన పార్క్‌ను గురువారం ఆయన పరిశీలించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి ఆగస్టు 29: ఎంతో పురాతన చరిత్ర వైభవం కల్గిన కనిగిరి దుర్గం టూరిజం ప్రాంతంగా గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం గ్రామ పరిధిలోని ఎకో టూరిజం ఆఫ్ ఇండియా చేపట్టిన పార్క్‌ను గురువారం ఆయన పరిశీలించారు. ఈప్రాంతంలో ఆహ్లాదకరమైన ప్రాంతంలో టూరిజం ఏర్పాటుచేయటం శుభపరిణామమన్నారు. పార్క్‌లో జరిగే ఏర్పాట్లపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె.రామిరెడ్డితో చర్చించారు. పార్క్ ఏర్పాటుపై విస్తృత ప్రచారం జరగాలని సూచించారు. పార్క్‌లో ఏర్పాటుచేసిన క్రీడా వస్తువులను పరిశీలించారు. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు తమ కుటుంబసభ్యులతో సేద తీరితే ఎంతో ఆటవిడుపుగా ఉంటుందన్నారు. పార్క్ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఫారెస్ట్ డీఆర్‌వో తులసీరావు, బీట్ ఆఫీసర్ నరసింహం, టీడీపీ మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి (ఎస్‌టీఆర్ ), గాయం తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.