కనిగిరి పట్టణాభివృద్ధికి సహకరించాలి
ABN , Publish Date - Jul 20 , 2024 | 10:21 PM
కనిగిరి పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహ కారం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాల యంలో శనివారం మున్సిపల్ చైర్మన్ గఫార్ అధ్యక్షత న జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎక్స్‌అఫిషి యో మెంబర్ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి పాల్గొన్నారు. గత సమావేశం కోరం లేక వాయిదా పడటంతో శనివారం నిర్వహించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, జూలై 20: కనిగిరి పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహ కారం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాల యంలో శనివారం మున్సిపల్ చైర్మన్ గఫార్ అధ్యక్షత న జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎక్స్‌అఫిషి యో మెంబర్ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి పాల్గొన్నారు. గత సమావేశం కోరం లేక వాయిదా పడటంతో శనివారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ గపార్ మాట్లాడుతూ పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు రూ.82 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి నట్టు చెప్పారు. పట్టణంలో వీధి లైట్లు, డ్రైనేజీలు, వి ద్యుత్ స్తంభాలు, కూరగాయల మార్కెట్, చేపలు, మాంసం మార్కెట్ ఏర్పాటుచేయాలని కౌన్సిలర్లు కోరా రు. మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి అంచ నాలు వేసినట్లు చైర్మన్ వివరించారు. పట్టణంలో పారి శుధ్య సిబ్బంది అవసరం ఉందని చెప్పారు. ఇందుకో సం తగిన అంచనాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఏ ఐఐబీ నిధులు కింద కుళాయిల ద్వారా ఇంటింటికి మంచినీటిని సరఫరా చేయాలని కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర సానుకూలంగా స్పం దించి కనిగిరి పట్టణాభివృద్ధికి అవసరమైన నిధులు, అభివృద్ధి పనులు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిం చటంతో పాటు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళి నిధులు సమీకరిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు, మేనేజర్ ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.