Share News

రసవత్తరంగా క్రికెట్‌ పోటీలు

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:06 PM

మండలంలోని కొండమంజులూరులో జరుగుతున్న టీ20 ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు గురువారం రసవ త్తవరంగా సాగాయి. గురువారం ఉదయం జార్ఖాండ్‌, బెంగులూరు జట్ల మధ్య జరిగిన పోటీలో టాస్‌ గెలిచిన బెంగుళూరు జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకొంది. మందుగా బ్యాటింగ్‌ చేపట్టిన జార్ఖాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్‌ అయింది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన బెంగుళూరు జట్టు 12.5 ఓవర్లలో 126 ప రుగులకు ఆలౌట్‌ అయి ఓటమి పాలయింది.

రసవత్తరంగా క్రికెట్‌ పోటీలు
కొండమంజులూరులో జరుగుతున్న టి-20 క్రికెట్‌ పోటీలలో తలపడుతున్న బళ్ళారి, ఒంగోల్‌బుల్స్‌ జట్లు.

రసవత్తరంగా క్రికెట్‌ పోటీలు

పంగులూరు, జనవరి 11: మండలంలోని కొండమంజులూరులో జరుగుతున్న టీ20 ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు గురువారం రసవ త్తవరంగా సాగాయి. గురువారం ఉదయం జార్ఖాండ్‌, బెంగులూరు జట్ల మధ్య జరిగిన పోటీలో టాస్‌ గెలిచిన బెంగుళూరు జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకొంది. మందుగా బ్యాటింగ్‌ చేపట్టిన జార్ఖాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్‌ అయింది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన బెంగుళూరు జట్టు 12.5 ఓవర్లలో 126 ప రుగులకు ఆలౌట్‌ అయి ఓటమి పాలయింది. జార్ఖాండ్‌ జట్టు క్రీడాకా రుడు హరీష్‌రెడ్డి 3 ఓవర్లకు 26 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకుని మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సాయంత్రం జరిగిన పోటీ లో బుల్స్‌ ఒంగోలు, బళ్ళారి జట్లు తలపడగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బళ్ళారి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన బుల్స్‌ ఒం గోలు జట్టు 134 పరుగులకే ఆలౌట్‌ అయి ఓటమిపాలయింది. బళ్ళా రి జట్టు క్రీడాకారుడు తహ 47 బంతులలో 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 104 పరుగులు సాధించి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. శుక్రవారం ఉదయం కేరళ, గుజరాత్‌ జట్టు, సాయంత్రం ఆంధ్రప్ర దేశ్‌, తెలంగాణ జట్టు తలపడనున్నాయని పోటీల నిర్వాహకులు కరణం స్వామి తెలిపారు.

Updated Date - Jan 11 , 2024 | 10:06 PM