Share News

టీడీపీలోకి ఉప్పెనలా చేరికలు !

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:54 AM

అధికార వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఉప్పెనలా కొనసాగుతు న్నాయి. నాగులుప్పలపాడు మండలంలోని పోతవరం, టి. అగ్రహారం, ఓబన్నపాలెం గ్రామాలకు చెందిన వైసీపీ నా యకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు నియో జకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బీఎన్‌.విజయ్‌ కుమార్‌ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు.

టీడీపీలోకి ఉప్పెనలా చేరికలు !

ఓబన్నపాలెంలో వైసీపీ ఖాళీ

తెలుగుదేశంలో చేరిన పలు గ్రామాల శ్రేణులు

సాదర స్వాగతం పలికిన ఎస్‌ఎన్‌పాడు టీడీపీ కూటమి అభ్యర్థి విజయ్‌కుమార్‌

నాగులుప్పలపాడు, ఏప్రిల్‌ 18 : అధికార వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఉప్పెనలా కొనసాగుతు న్నాయి. నాగులుప్పలపాడు మండలంలోని పోతవరం, టి. అగ్రహారం, ఓబన్నపాలెం గ్రామాలకు చెందిన వైసీపీ నా యకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు నియో జకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బీఎన్‌.విజయ్‌ కుమార్‌ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు.

ప్రధానంగా పోతవరం గ్రామానికి చెందిన సీనియర్‌ వైసీపీ నేత, పార్టీ మండల మాజీ అధ్యక్షులు దివి పున్నా రావు, మాజీ ఎంపీపీ దివి రంగవల్లి, దివి హనుమం తరావు, పెద్దిపోగు కిరణ్‌ , అంకమ్మరావు, అంజయ్యతో పా టు మరో 100 మంది బీఎన్‌, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్యచౌదరి సమక్షంలో సైకిలెక్కారు.

ఇక టి.అగ్రహారం గ్రామానికి చెందిన వైసీపీ మాజీ ఎంపీటీసీ పొద శ్రీధర్‌, గోరంట్ల రామారావు, పొద సింగ య్య, బెల్లం రామకృష్ణ, పిన్నక అనుదీప్‌తో పాటు ఎస్సీ కాలనీవాసులు 100 మంది, గ్రామానికి చెందిన మరో 50 మంది తెలుగుదేశంపార్టీలో చేరారు.

ఓబన్నపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ వక్కంటి శ్రీనివాసరావు, యూత్‌ నాయకులు పోలినేని సిం గారావు, మాజీ సొసైటీ అధ్యక్షులు మండవ ప్రసాద్‌, పోలినేని రంగయ్య మరో 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరారు. దాంతో ఆ గ్రామంలో దాదాపు అధికా ర పార్టీ ఖాళీ అయ్యింది. పార్టీలో చేరిన వారికి బీఎన్‌ తెలు గుదేశం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

వైసీపీతో అందరికీ అన్యాయం : బీఎన్‌

ఈ సందర్భంగా బీఎన్‌ మాట్లాడుతూ అధికార వైసీపీ తో ఏ ఒక్కరికి న్యాయం జరుగలేదన్నది ఇంత పెద్ద ఎతు ్తన జరుగుతున్న చేరికలతోనే అర్ధమవుతుందన్నారు. ఆ పార్టీతో విసుగు చెందిన శ్రేణులు తెలుగుదేశం పార్టీ గూ టికి చేరడం శుభపరిణామమన్నారు. గత 15 ఏళ్ళ నుంచి సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రజలతో మమే కమైన తనకు రాజకీయ పరిస్థితులు పూర్తిగా తెలుస న్నారు. తల్లిలాంటి తెలుగుదేశం పార్టీలోకి మరిన్ని చేరి కలు కొనసాగుతాయన్నారు. సమష్టి కృషి తో పనిచేసి రా నున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పొద వరప్రసాద్‌, సురే ష్‌, టీడీపీ మండల అధ్యక్షులు తేళ్ళ మనోజ్‌ కుమార్‌, మం డల కార్యదర్శి కాకర్ల లక్ష్మీవరప్రసాద్‌, గుమ్మడి సాయి బాబా, అడకా స్వాములు, గ్రామ అధ్యక్షులు శరత్‌, చిన్నా, కట్టా అంజయ్య, చెరుకూరి వెంకి, నార్నె అంజయ్య, చెంచ య్య, పొనుగుపాటి సుబ్బరావమ్మ, షేక్‌ ఖాజావలి, చుం డూరి నాగేశ్వరరావు, బి.సెల్వం, జాగర్లమూడి హరిబాబు, ఉప్పుటూరి హరినాథ్‌, పెనుబోతు సునీల్‌, గూడూరు ఝా న్సీ, పోలినేని చలపతి, తెలగతోటి జాన్సన్‌, జనసేన నాయ కులు సాయి, కొంజేటి ధనుష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:54 AM