Share News

టీడీపీలోకి జోరుగా చేరికలు

ABN , Publish Date - May 07 , 2024 | 01:40 AM

వైసీపీని వీడి టీడీపీలో చేరే వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణ కార్యకర్త లు ఒరవడి ఓవైపు కొనసాగుతుండగానే వైసీపీలోని జిల్లా స్థాయి నాయకులు సైతం టీడీపీ గూటికి చేరుతున్నారు.

టీడీపీలోకి జోరుగా చేరికలు

మార్కాపురం, మే 6: వైసీపీని వీడి టీడీపీలో చేరే వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణ కార్యకర్త లు ఒరవడి ఓవైపు కొనసాగుతుండగానే వైసీపీలోని జిల్లా స్థాయి నాయకులు సైతం టీడీపీ గూటికి చేరుతున్నారు. వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు తడికమళ్ల బాల సుబ్బారావు(బాలుడు) వైసీపీని వీడి టీడీపీలో చేరాడు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి బాలుడికి సోమవారం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాల సుబ్బారావు మాట్లాడుతూ వైసీపీలో నాయకుల నియంతృ త్వ ధోరణి అధికంగా ఉంటుందన్నారు. ప్రజాసేవకు టీడీపీనే సరైన వేదిక అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు అర్హులైనవారికి అమలు కావాలన్నా టీడీపీతోనే సాధ్యమని నమ్మి టీడీపీలో చేరినట్లు తెలిపారు. స్థానిక జవహర్‌నగర్‌ కాలనీలోని టీడీపీ పోల్‌మేనేజ్‌న్మెంట్‌ ఇన్‌చార్జ్‌ కందుల రామిరెడ్డి ఇంట్లో మండలంలోని నాయుడుపల్లికి చెందిన వైసీపీ నుంచి 20 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారిలో కోట్ల పౌల్‌రాజ్‌, తంగిరాల మరియబాబు, కోట్ల యేసయ్య, పరిసపోగు సుమన్‌, కొమ్మసాని సాయికుమార్‌, తదితరులున్నారు. కార్యక్రమాలలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వక్కలగడ్డ మల్లికార్జున్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలి :బాలాజీ

పొదిలి : జనసేన, బీజేపీ బలపరిచిన ఉమ్మడి టీడీపీ అభ్యర్థులను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారి టీతో గెలిపించాలని నూకసాని బాలాజీ అన్నారు. సోమ వారం స్థానిక సామంతపూడి అడితిలో కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. మార్కాపురంలో టీడీపీ కూట మి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని సూచించారు. వైసీపీ వ్యతిరేక ఓటింగ్‌ చీలకుండా టీడీపీ నాయకులు కృషి చేయాలన్నారు. ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, ప్రతిపక్షాలపై పెడుతున్న అక్రమ కేసులను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దాన్ని అంతమొందించే సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికలకు మరో వారంరోజులు మాత్రమే సమయం ఉందని నాయకులు అందరు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్యకర్తలు అలుపెరగని కృషి చేయాలి : కందుల

కొనకనమిట్ల : టీడీపీ విజయానికి కార్యకర్తలు అలుపెరగని కృషి చేయాలని మార్కాపురం ఉమ్మడి ఎన్‌డీఏ ఎమ్మెల్యే అభ్యర్ధి కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని కాట్రగుంట గ్రామంలో సోమవారం విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘ఇంటింటికి మనకందుల’, ప్రజాగళం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్స రాలకే పింఛన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపారు. రైతుల పెట్టుబడినిధి కింద ఏడాదికి రూ.20 వేలు, మహిళకు నెలకు రూ1500, సంవత్సరానికి మూడు గ్యాస్‌సిలెండర్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ రక్షణ చట్టంలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఉమ్మడి పార్టీ అమలు చేయనున్నట్లు తెలిపారు. కనుక ఉమ్మడి అభ్యర్థులు కందుల నారాయణరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డిలకు రానున్న ఎన్నికలలో సైకిల్‌గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి మోనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాస రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామం లో 25 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. చేరిన వారిలో పెండెం పెదనాగేష్‌, పెండెం శ్రీను, పెండెం ఇంద్ర, అచ్చయ్య, పెండెం వెంకటేష్‌, పెండెం తిరుపతయ్య, కల్లు మహేష్‌, పెండెం బ్రహ్మనాయుడు, పెండెం శ్రీనివాసులు, పెండెం కొండయ్య, పెండెం నవీన్‌, పెండెం వెంకటతేజ, ఒక్కయ్య, పెడెం వెలుగొండయ్య, జలిది వెంకటేష్‌, చినగురువయ్య, జలిది వివేక్‌, జలది ఏసురత్నం, జలిది దానయ్య, జలిది బాబు, జలిది లక్ష్మయ్య, జలిది బాలారావు, పెండెం కొండయ్యలతో పాటు 25 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారికి కందుల నారాయణరెడ్డి టీడపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కొనకనమిట్ల మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయాగ్రామాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

తర్లుపాడు : మండలంలోని తుమ్మలచెరువులో 25 వైసీపీ కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారంరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలన్నారు. వైసీపీ నాయకులు ఇసుక మాఫియా, భూదోపిడి పార్టీకి నూకలు చెల్లాయన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో తనకు, మాగుంట శ్రీనివాసులరెడ్డికి సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు రావి బాసపతిరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు ఉడుముల చిన్నపురెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు తిప్పిరెడ్డి వెలిగొండరెడ్డి, పి.గోపినాథ్‌ చౌదరి, నాగం తిరుపతయ్య, కాశీం, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2024 | 01:40 AM