Share News

ఆర్యవైశ్యులకు జే టాక్స్‌ దెబ్బ

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:31 PM

చిరు వ్యాపారులకు, దినసరి కూలీలకు టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం అద్దంకి పట్టణంలోని 15వ వార్డు, రాత్రి మండలంలోని కొటికలపూడిలో ఎమ్మెల్యే పర్యటించారు.

ఆర్యవైశ్యులకు జే టాక్స్‌ దెబ్బ
15వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

వైసీపీ పాలనలో వ్యాపారాలు, పరిశ్రమలు నాశనం

అందరికీ అండగా ఉంటాం

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి

అద్దంకి, ఏప్రిల్‌ 26 : చిరు వ్యాపారులకు, దినసరి కూలీలకు టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం అద్దంకి పట్టణంలోని 15వ వార్డు, రాత్రి మండలంలోని కొటికలపూడిలో ఎమ్మెల్యే పర్యటించారు. ఇంటింటికీ తిరిగి సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. ఈ సం దర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ వైసీ పీ అధికారం చేపట్టిన తరువాత అద్దంకి పట్ట ణం, బల్లికురవ, మేదరమెట్లలో రోడ్లకు ఇరువైపులా చిరు వ్యాపారుల భవనాలు ఇష్టారీతిన ఖాళీ చేయించి వా రి పొట్టకొట్టారన్నారు. ఇలాం టి చర్యలను తీవ్రంగా ఖం డించామన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ నుంచి ఈ ఐదేళ్లలో ఒక్క రూపాయి లబ్ధి చేకూరలేదన్నారు. కేంద్రం తె చ్చిన ఈబీసీ చట్టంలో ఆర్యవైశ్యులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు కషిచే స్తానన్నారు. పేద ఆర్యవైశ్యులకు టీడీపీ పాలనలో కేటాయించిన టిడ్కో ఇళ్లు, రేషన్‌ కార్డులు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ర ద్దు చేసిందన్నారు. పే ద ఆర్యవైశ్యుల విద్యార్థుల విదేశీ విద్య అం దించడానికి కార్పొరేషన్‌ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించేలా టీడీపీ చర్యలు తీసుకుంటుందన్నారు. జగన్‌ అండ్‌ కో జే ట్యాక్స్‌ విధానాల కారణంగా ఆర్యవైశ్యులు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొన్నారన్నారు. రకరకాల పన్నులతో వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువా త ఆర్యవైశ్యులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకు నే అవకాశం కల్పిస్తామన్నారు. ఆర్యవైశ్యులలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ పాలన ఉంటుందన్నారు. పేదలు, మహిళలకు ప్రత్యేక పథకాల ద్వారా మరింత లబ్ధి చేకూరుస్తామన్నారు. ముందుగా కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొటికలపూడిలో రైతులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో రైతులకు తీరని అన్యాయం జరిగిందని రవికుమార్‌ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి రైతుకు ఏటా రూ.20వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు చిన్ని శ్రీనివాసరావు, కౌన్సిలర్‌ అంకం తేజశ్వని, చుండూరి మురళి, గట్టుపల్లి రామారావు, కొటికలపూడి స ర్పంచ్‌ పూనాటి విక్రమ్‌, మాజీ సర్పంచ్‌ వెంక ట్రావు పాల్గొన్నారు.

యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయం

గొట్టిపాటి హర్షవర్ధన్‌

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే టీడీపీ ధ్యేయమని గొట్టిపాటి రవికుమార్‌ తనయుడు హర్షవర్ధన్‌ అన్నారు. శుక్రవారం రా త్రి అద్దంకి పట్టణంలోని 5వ వార్డులో హర్షవర్ధన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సం దర్భంగా హర్షవర్దన్‌ ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అందించే పథకాలను వివరించారు. పరిశ్ర మలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు గార్లపాటి శ్రీనివాసరావు, వడ్డవల్లి పూర్ణ చంద్రరావు, చిలుకూరి అనిల్‌, కిరణ్‌, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:31 PM