Share News

తెలుగు హాస్యానికి చిరునామా జంధ్యాల

ABN , Publish Date - Jun 29 , 2024 | 10:44 PM

చక్కని హాస్యానికి చిరునామా జంధ్యాల అని సాహితీ స్రవంతి అధ్యక్షుడు చందలూరి నారాయణరావు అన్నారు. ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక చిన్ని శాంతయ్య, పిచ్చమ్మల సేవాసదన్‌లో ప్రతిభామూర్తులు - మధుర స్మృతులు 33వ సభ జరిగింది. ఈ సందర్భంగా రామోజీరావు, సీనీ నటి జమున, దర్శకులు జంధ్యాల, అద్దంకి హేమలత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తెలుగు హాస్యానికి చిరునామా జంధ్యాల
రామోజీ, జమున, హేమలత చిత్రపటాకు నివాళులర్పిస్తున్న సాహితీ ప్రతినిధులు

అద్దంకి, జూన్‌ 29 : చక్కని హాస్యానికి చిరునామా జంధ్యాల అని సాహితీ స్రవంతి అధ్యక్షుడు చందలూరి నారాయణరావు అన్నారు. ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక చిన్ని శాంతయ్య, పిచ్చమ్మల సేవాసదన్‌లో ప్రతిభామూర్తులు - మధుర స్మృతులు 33వ సభ జరిగింది. ఈ సందర్భంగా రామోజీరావు, సీనీ నటి జమున, దర్శకులు జంధ్యాల, అద్దంకి హేమలత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సాహితీ సంస్థల ప్రతినిధులు చందలూరి నారాయణరావు, దాసరి లక్ష్మీరాజ్యం, మంగమూరి చిరంజీవి, అన్నమనేని వెంకటరావు, పీసీహెచ్‌ కోటయ్య, ఆర్‌వీ రాఘవరావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, లేవి ప్రసాద్‌, బాలు, మక్కెన చిన్నా, వీవీ బ్రహ్మం, చెన్నుపాటి రామాంజనేయులు, వై. వెంకటేశ్వర్లు, రఘురామశర్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 10:44 PM