Share News

పింఛన్‌ సొమ్ము ఎగవేతకు జగన్‌రెడ్డి కుట్ర

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:03 PM

రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్‌ ఎగవేతకు పన్నాగం పన్నిన జగన్‌రెడ్డి ఆ నెపాన్ని టీడీపీపై వేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్‌లు నిలిపేసేందుకు టీడీపీయే కారణమని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం పింఛన్‌లను సచివాలయ సిబ్బందిచే పంపిణీ చేయాలని కోరుతూ కమిషనర్‌ రంగారావుకు వినతిపత్రం అందచేశారు.

పింఛన్‌ సొమ్ము ఎగవేతకు జగన్‌రెడ్డి కుట్ర
కనిగిరిలో వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఉగ్ర,

టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఉగ్ర

మున్సిపల్‌ కమిషనర్‌కు విజ్ఞప్తి

అన్ని మండలాల్లో ఎంపీడీవోలకు టీడీపీ నేతల వినతులు

కనిగిరి, ఏప్రిల్‌ 2 : రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్‌ ఎగవేతకు పన్నాగం పన్నిన జగన్‌రెడ్డి ఆ నెపాన్ని టీడీపీపై వేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్‌లు నిలిపేసేందుకు టీడీపీయే కారణమని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం పింఛన్‌లను సచివాలయ సిబ్బందిచే పంపిణీ చేయాలని కోరుతూ కమిషనర్‌ రంగారావుకు వినతిపత్రం అందచేశారు. అనంతరం డాక్టర్‌ ఉగ్ర విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నేతల నుంచి ప్రజలకు తాయిలాల పేరుతో పంపిణీ చేసేందుకు కోట్లాది రూపాయల పింఛన్‌ నగదును వారి అనుయాయులకు మళ్ళించిన కపటి జగన్‌రెడ్డి అని దుయ్యబట్టారు. స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం జగన్‌ చేస్తున్న, చేసిన కుట్రలకు అమాయక ప్రజల్ని బలి చేస్తున్న జగన్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. జగన్‌ మోసపూరిత వైఖరికి పెన్షన్‌దారులు, వలంటీర్లు తీవ్రంగా నష్టపోయారని డాక్టర్‌ ఉగ్ర అన్నారు. పెన్షన్‌ దారులపై జగన్‌కు ఏమాత్రం దయా, చిత్తశుద్ధి ఉన్నా వారికి చెందిన ఖజానాలోని నగదును బినామీ కాంట్రాక్టర్‌లకు దోచి పెట్టేవాడు కాదని మండిపడ్డారు. వలంటీర్ల వ్యవస్థను తప్పుడు కార్యక్రమాలకు వినియోగించి ఉద్యోగ వ్యవస్థకే మచ్చ తెచ్చిన వ్యక్తి జగన్‌రెడ్డి అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లను కొనసాగించడంతోపాటు సమాజంలో ఎంతో గౌరవ ప్రధమైన స్థానాన్ని కల్పిస్తామన్నారు. వారితోనే రూ.4వేలు పింఛన్‌ను ఇళ్లకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకుంటారన్నారు. పింఛన్‌ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయకుండా సచివాలయ సిబ్బందిని వినియోగించాలని కోరారు. ఓట్ల కోసం వైసీపీ ఎంత నీచ రాజకీయానికైనా దిగజారుతుందని పెన్షన్‌ల పంపిణీని అడ్డుకొని విపక్షాలపై వేస్తున్న నిందలే రుజువు చేస్తున్నాయని అసహనం వ్యక్తిం చేశారు. కార్యక్రమంలో తమ్మినేని శ్రీనివాసులురెడ్డి, వీవీఆర్‌.మనోహరరావు, తమ్మినేని వెంకటరెడ్డి, షరీప్‌, ఫిరోజ్‌, తెలుగు మహిళలు షేక్‌ వాజిదాబేగం, దొరసాని, తులసి, స్వప్న, కే నీరజ, అమ్ములమ్మ, దనలక్ష్మి, వెంకటలక్షమ్మ పాల్గొన్నారు.

దొనకొండ : వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల ఇంటికి వెళ్లి పింఛన్‌లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని టీడీపీ మండలాధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వసంతరావునాయక్‌కు మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న దృష్టా వృద్ధులను సచివాలయాలకు రప్పించకుండా సిబ్బందితో వారికి పింఛన్‌లు అందించాలని కోరారు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు చర్యలు చేపడతామన్నారు. నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు మోడి వెంకటేశ్వ ర్లు, నాయకులు యగ్గోని యల్లారెడ్డి, యరగొర్ల బసవయ్య, కొమ్మతోటి సుబ్బారావు, కమ్మా వెంక టనారాయణ, షేక్‌ తోహీద్‌, పరుచూరి రమేష్‌, బత్తుల బ్రహ్మయ్య పాల్గొన్నారు.

తాళ్లూరు : ఖజానా ఖాళీగా ఉన్న విషయాన్ని బయటకు పొక్క కుండా కప్పిపుచ్చేందుకు పింఛన్‌ల పంపిణీపై వైసీపీ నేతలు టీడీపీపై అసత్య ప్రచా రం చేస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు బీ.ఓబుల్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమే్‌షబాబులు విమర్శించా రు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్‌లు పంపిణీ చేయాలని ఎంపీడీవో కే యుగకీర్తికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. నాయ కులు రాచకొండ వెంకట్రావు, ఐ.శ్రీనివాసరెడ్డి, సూరిబాబు, పి.అంజిరెడ్డి, కైపు నాగార్జునరెడ్డి, వంగపల్లి నాగేశ్వరరావు, నరిశిరెడ్డి, హనుమ య్య, చాట్ల ఢానియేల్‌, నేరెళ్ల కిషోర్‌బాబు, శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, శ్రీను పాల్గొన్నారు.

ముండ్లమూరు : ప్రతి నెలా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇచ్చే పింఛన్‌లను సచివాలయాల సిబ్బందితో పంపిణీ చేయాలని టీడీపీ నాయకులు మంగళవారం ఎంపీడీవో బీ శంకరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, జడ్పీటీసీ మాజీ సభ్యులు కొక్కెర నాగరాజు, వరగాని పౌలు, శంకరాపురం సర్పంచ్‌ కూ రపాటి నారాయణ స్వామి, మాజీ సర్పంచ్‌లు ఇందూరి పిచ్చిరెడ్డి, జిల్లెలమూడి చౌదరి, నిడమానూరి శ్రీనివాసరావు, చావా బ్రహ్మయ్య, చిననారాయణరెడ్డి, కొండలరావు, గంగినేని శేషగిరిరావు, మేదరమెట్ల రాంబాబు, కాటూరి గురవయ్య, మీనగ నందయ్య, జనసేన నేత తోట రామారావు పాల్గొన్నారు.

పీసీపల్లి : ఇళ్లవద్దకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్‌లను అందజేయాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎంపీడీవో వెంకటసుబ్బారావును కలిసి వినతిపత్రం అందజేశారు. వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు రావాలంటే ఇబ్బందులు పడతారని అన్నారు. ఎన్నికల కమిషన్‌ వలంటీర్లను పక్కనపెట్టమని ఆదేశిస్తే ప్రతిపక్షాలపై ఆరోపణలు చేసేందుకే వైసీపీ వృద్ధులు, దివ్యాంగులపై కక్షగట్టి సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేట్టేందుకు ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వం ఆదేశించాలని కోరుతూ వినతిపత్రాన్ని ఎంపీడీవోకు అందజేశారు. కార్యక్రమం లో బద్దిపూడి ఎబినేజరు, కసిరెడ్డి ఓబుల్‌రెడ్డి, వెంకట్‌, హనుమారెడ్డి, మాల్యా ద్రి, జోసెఫ్‌, పిచ్చిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వీరయ్య, క్రిష్ణారెడ్డి ఉన్నారు.

పామూరు : ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదాఉలకు పింఛన్‌లు ఇవ్వాలని కోరుతూ ఎంపీడీవో పుట్టారెడ్డికి టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ డీవీ మనోహర్‌, ఎంపీటీసీ సభ్యుడు ఆకుపాటి వెంకటేష్‌, షేక్‌ ఖాజారహంతుల్లా, హుసేన్‌రావు, సయ్యద్‌ అమీర్‌బాబు, వై ప్రసాద్‌రెడ్డి, ఆర్‌ఆర్‌ రఫి, మాల్యాద్రి, షేక్‌ గౌస్‌బాషా, పందిటి హరీష్‌ పాల్గొన్నారు.

వెలిగండ్ల : సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పం పణీ చేయాలని కోరుతూ మంగళవారం టీడీపీ నాయకులు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, నియోజకవర్గ రై తు అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్‌ రె డ్డి, ఎంపీటీసీ సభ్యుడు చిలకల వెంకటేశ్వర్లు, కర్నాటి భాస్కర్‌ రెడ్డి, భాస్క ర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు ఎస్సీసెల్‌ జిల్లా అధికార ప్రతినిధి సలోమన్‌రాజు, పం డు, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 11:03 PM