Share News

అంబేడ్కర్‌ విదేశీ విద్యను రద్దు చేసిన జగన్‌రెడ్డి

ABN , Publish Date - Feb 15 , 2024 | 01:56 AM

ఎస్సీల సంక్షే మం కోసం నాటి టీడీపీ హయాంలో ప్రవేశ పెట్టిన అంబేడ్కర్‌ విదేశీవిద్య పథకాన్ని నేడు జగన్‌రెడ్డి రద్దు చేయడం శోచనీయమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాజీ ఎమ్మెల్యే ముత్తు ముల అశోక్‌రెడ్డి అన్నారు.

అంబేడ్కర్‌ విదేశీ విద్యను రద్దు చేసిన జగన్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, ఫిబ్రవరి 14 : ఎస్సీల సంక్షే మం కోసం నాటి టీడీపీ హయాంలో ప్రవేశ పెట్టిన అంబేడ్కర్‌ విదేశీవిద్య పథకాన్ని నేడు జగన్‌రెడ్డి రద్దు చేయడం శోచనీయమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాజీ ఎమ్మెల్యే ముత్తు ముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలం లోని ముండ్లపాడు మేజర్‌ పంచాయుయతీలోని ఎస్సీపాలెంలో ‘బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలుజేయనున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఆయన వివరించారు. టీడీపీ, జనసేనల ఉమ్మడి మేని ఫెస్టోలోని సూపర్‌సిక్స్‌ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన గ్రామసభలో మాట్లాడుతూ అబద్దపు హామీతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఎస్సీలకు వెన్ను పోటు పొడిచాడ న్నారు. దళితులకు ఎస్సీ కార్పోరేషన్‌ ద్వా రా ఒక్క రూపా యి కూడా రాయితీపై రుణం ఇప్పించారా..? అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా రాయితీ రుణాలు ముఖ్యమంత్రి సహా యనిధి ద్వారా అనారోగ్యంతో బాదపడు తున్న వారికి నగదు సాయం అందించానన్నారు. పక్కాగృహాలు, సిమెంట్‌ రోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. తాను స్థానికుడినని, ఎల్లవేళలా అందు బాటులో ఉంటానన్నారు. నీ ఇంటి బిడ్డగా తన ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్ని కలలో టీడీపీ, జనసేనల అభ్యర్థిగా ఉంటానని, సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌, టీడీపీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, నాయకులు కడియం శేషగిరి, దుత్తా బాలీశ్వరయ్య, నంది శ్రీను, దూదేకుల నరసింహులు, వాడకట్టు శివప్రసాద్‌, గుర్రం డానియేలు, బొమ్మినేని వెంకటేశ్వర్లు, బిల్లా రమేష్‌, షహన్షావలి, బైనగారి ప్రభాకర్‌, గుర్రం శేఖర్‌, కొమ్మునూరు ఓబయ్య, శీలం కిష్ణ్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 01:56 AM