Share News

మాదిగల ద్రోహి జగన్‌..!

ABN , Publish Date - Mar 29 , 2024 | 01:33 AM

ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని మాదిగలను నమ్మించి వంచించిన ద్రోహి జగన్‌రెడ్డి అని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ అన్నారు. అమరావతి గ్రౌండ్స్‌లో గురువారం కూటమి సంఘీబావ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తన తండ్రి చివరి కోరిక అని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మా ట తప్పిన మాదిగ ద్రోహి జగన్‌ అని దుయ్యబట్టారు. వైసీపీ వచ్చాక దళితులపై దాడులు పెచ్చురిల్లాయన్నారు. పైకి మాత్రమే నా ఎస్సీలు అంటూనే లోలోపల ఎస్సీలను అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

మాదిగల ద్రోహి జగన్‌..!
డాక్టర్‌ ఉగ్రను పూలమాలవేసి ఘనంగా సన్మానిస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు నాగరాజు

వైసీపీ పాలనలో దళితులపై దాడులు

టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, మార్చి 28: ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని మాదిగలను నమ్మించి వంచించిన ద్రోహి జగన్‌రెడ్డి అని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ అన్నారు. అమరావతి గ్రౌండ్స్‌లో గురువారం కూటమి సంఘీబావ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తన తండ్రి చివరి కోరిక అని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మా ట తప్పిన మాదిగ ద్రోహి జగన్‌ అని దుయ్యబట్టారు. వైసీపీ వచ్చాక దళితులపై దాడులు పెచ్చురిల్లాయన్నారు. పైకి మాత్రమే నా ఎస్సీలు అంటూనే లోలోపల ఎస్సీలను అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మళ్లీ జగన్‌కు అధికారాన్ని కట్టపెడితే ఇక బడుగు, బలహీన వర్గాల మనుగడ కష్టమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి గెలుపుకోసం మాదిగలంతా ఐ క్యంగా కదిలి రావాలని పిలుపునిచ్చారు. మాదిగల తలరాతలు మారాలంటే రాష్ట్రంలో టీడీపీ, కనిగిరిలో డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డికి అత్యధిక మెజార్టీతో మాదిగలు గెలిపించాలని కోరారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో దళితులపై దాష్టీకాలు, దాడులు చేస్తూ మారణకాండను సృష్టించారని డాక్టర్‌ ఉగ్ర ఆగ్రహం వ్యక్తిం చేశారు. ఓవైపు దళితుల పక్షపాతి అని బైబిల్‌తో ప్రచారాలు చేసే జగన్‌కు ఆయన కుటుంబానికి చిన్నచూపుగా ఉంటారని ఆరోపించారు. మాదిగల సంక్షేమ పాలన రావాలంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎంగా చేసుకోవాలని కోరారు. వైసీపీ పాలనలో జగన్‌ ఎస్సీ కార్పొరేషన్‌ను నీరుగార్చి, వారి అనుయాయులకు ముట్టచెప్పి కమీషన్‌లను తాడేపల్లి ప్యాలె్‌సకు మళ్లించారన్నారు. మాదిగలంతా తనను ఆదిరించి గెలిపిస్తే రుణపడి ఉంటానని, అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చే స్తానని డాక్టర్‌ ఉగ్ర హామీ ఇచ్చారు. అనంతరం డాక్టర్‌ ఉగ్రను ఎమ్మార్పీఎస్‌ నాయకులు పూలదండలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు జలదంకి నరసింగరావు, రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ఆదిమూలపు ప్రకాశం, జిల్లా అధ్యక్షుడు నేలపాటి రాజు, ఎంఎ్‌సపీ జిల్లా అధ్యక్షుడు తోరేటి ఆనంద్‌మాదిగ, రావినూతల కొండ య్య, బీజేపీ నాయకులు శ్రీనివాసులరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 01:33 AM