Share News

‘భవనాసి’ రైతులకు సాగునీటి కష్టాలు

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:11 PM

భవనాసి ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తప్పటం లేదు. భవనాసి చెరువు పరిధిలోని ఆయకట్టులో సుమారు వెయ్యి ఎకరాలు ఉంది. పాత తూము, లోలెవల్‌, హైలెవల్‌ కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల జరుగుతుంది. సాధారణంగా సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల జరిగితే భవనాసి చెరువు నిండా నీరు ఉం టాయి. అయితే, ఈ ఏడాది సాగర్‌ ఆయకట్టులో సాగుకు నీటి విడుదల జరగలేదు.

‘భవనాసి’ రైతులకు సాగునీటి కష్టాలు
భవనాసి లోలెవల్‌ కాలువ నుంచి హైలెవల్‌ కాలువకు ట్రాక్టర్‌ల పంప్‌సెట్‌ల ద్వారా పంపింగ్‌ చేస్తున్న నీరు

చెరువులో పూర్తిస్థాయిలోలేని నీరు

లోలెవల్‌ కాలువ నుంచి హైలెవల్‌కు పంపింగ్‌

తప్పని అదనపు భారం

అద్దంకి, ఫిబ్రవరి 26: భవనాసి ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తప్పటం లేదు. భవనాసి చెరువు పరిధిలోని ఆయకట్టులో సుమారు వెయ్యి ఎకరాలు ఉంది. పాత తూము, లోలెవల్‌, హైలెవల్‌ కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల జరుగుతుంది. సాధారణంగా సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల జరిగితే భవనాసి చెరువు నిండా నీరు ఉం టాయి. అయితే, ఈ ఏడాది సాగర్‌ ఆయకట్టులో సాగుకు నీటి విడుదల జరగలేదు. దీంతో భవనాసి చెరువులో నీరు కూడా రోజురోజుకు తగ్గిపో తుంది. దీంతో హైలెవల్‌ కాలువకు నీరు పారుదలకు నిలిచిపోయింది. భవనాసి నీటిని నమ్ముకొని రైతులు హైలెవల్‌ కాలువ ఆయకట్టులో సుమారు 300 ఎకరాలలో మొక్కజొన్న, శనగ సాగు చేశారు.

మొక్కజొన్న పంటకు నీటి తడులు అవసరం కావటంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పటం లేదు. లోలెవల్‌ కాలువకు విడుదలవుతున్న నీటిని గోపాలపురం వద్ద హైలెవల్‌ కాలువకు ట్రాక్టర్‌లకు పంప్‌సెట్‌లు ఏర్పాటుచేసి పంపింగ్‌ చేస్తున్నారు. దీంతో రైతులకు అదనపు వ్యయం అవుతుంది. ఒక్కో ఎకరాకు నీటి తడుల కోసం సరాసరిన 5 వేల రూపాయల వరకు అదనపు భారం పడుతుంది. పంట చివర దశలో నీటి తడులు లేకపోవటంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉండటంతో అదనపు వ్యయాన్ని సైతం రైతులు లెక్కచేయకుండా నీటి తడులు పె డుతున్నారు.

Updated Date - Feb 26 , 2024 | 11:11 PM