Share News

వేటపాలెం పీహెచ్‌సీలో అధికారుల విచారణ

ABN , Publish Date - Jul 30 , 2024 | 10:32 PM

పీహెచ్‌సీలో డాక్టర్‌ బాలరాజు, ఫార్మసిస్టు వెంకట ప్రసాద్‌ మధ్య వివాదం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ విజయమ్మ ఆదేశాల మేరకు విచారణ బృందం వేటపాలెం పీహెచ్‌సీని సంద ర్శించారు. డీపీఎం డాక్టరు రోహిణి, డీఐవో వెంకటేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్‌ ప్రేమపావని విచారణ నిర్వహించారు. డాక్టరు బాలరాజు, ఫార్మసిస్టు వెంకట ప్రసాద్‌ను వేర్వేరుగా విచారణ చేశారు.

వేటపాలెం పీహెచ్‌సీలో అధికారుల విచారణ
డాక్టర్‌ బాలరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సిబ్బంది

నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామన్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయమ్మ

వేటపాలెం(చీరాల), జూలై 30 : పీహెచ్‌సీలో డాక్టర్‌ బాలరాజు, ఫార్మసిస్టు వెంకట ప్రసాద్‌ మధ్య వివాదం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ విజయమ్మ ఆదేశాల మేరకు విచారణ బృందం వేటపాలెం పీహెచ్‌సీని సంద ర్శించారు. డీపీఎం డాక్టరు రోహిణి, డీఐవో వెంకటేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్‌ ప్రేమపావని విచారణ నిర్వహించారు. డాక్టరు బాలరాజు, ఫార్మసిస్టు వెంకట ప్రసాద్‌ను వేర్వేరుగా విచారణ చేశారు. వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విచారణ నివేదికను డీఎం అండ్‌ హెచ్‌వోకు అందజేస్తామన్నారు. ఈ క్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయమ్మను వివరణ అడగ్గా విచారణ బృందం అందజేసే నిదేదిక ఆధారంగా చర్యలు చేపడతామన్నారు. ఇదిలావుంటే డాక్టర్‌ బాలరాజు వేధింపుల నుంచి తమకు విముక్తి కల్పించాలని విచారణ అధికారులు ఉన్నప్పుడే సిబ్బంది డాక్టర్‌ బాలరాజుకు వ్యతిరేకంగా నిరసన తెలపడం విశేషం.

రోగులకు మెరుగైన సేవలందించాలి : ఎమ్మెల్యే కొండయ్య

వేటపాలెం(చీరాల), జూలై 30 : రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య వైద్యులు, సిబ్బందికి సూచించారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు, సిబ్బంది మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే కొండయ్య వేటపాలెం పీహెచ్‌సీని అకస్మికంగా సందర్శించారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. వ్యక్తిగత కలహాల కారణంగా రోగులకు ఇబ్బందులు కల్పించడం సరికాదన్నారు. మరోసారి వివాదాలకు తావివ్వకుండా నడుచుకోవాలన్నారు. లేదంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ఉన్న రోగులతో ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడారు. వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గడువు తీరిన మందుల విషయం, వైద్యునిపై దాడి ఆరోపణ తదితర అంశాలకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. అంకిత భావంతో పనిచేయాలని చెప్పారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2024 | 10:32 PM