ముమ్మరంగా వ్యవసాయ పనులు
ABN , Publish Date - Aug 21 , 2024 | 11:23 PM
దోర్నాల మండలంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షం రైతుల్లో సంతోషాన్ని నింపింది. దీంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎపుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లుగా మిరపనాట్ల కోసం రైతులు యత్నాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు వర్షం కోసం ఎదురు చూసి ఆందోళనలో ఉన్న రైతన్నలకు రాత్రి కురిసిన వాన ఊరట నిచ్చింది. ముఖ్యంగా నల్లమల అటవీ ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి కడపరాజుపల్లె చెరువు, బొమ్మలాపురం చెరువుకు సగానికి పైగా నీరు చేరింది. మంచి అదనులో వాన కురిసిందన్న సంతోషంతో విస్తారంగా మిరప నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
పెద్ద దోర్నాల, ఆగస్టు 21:దోర్నాల మండలంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షం రైతుల్లో సంతోషాన్ని నింపింది. దీంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎపుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లుగా మిరపనాట్ల కోసం రైతులు యత్నాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు వర్షం కోసం ఎదురు చూసి ఆందోళనలో ఉన్న రైతన్నలకు రాత్రి కురిసిన వాన ఊరట నిచ్చింది. ముఖ్యంగా నల్లమల అటవీ ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి కడపరాజుపల్లె చెరువు, బొమ్మలాపురం చెరువుకు సగానికి పైగా నీరు చేరింది. మంచి అదనులో వాన కురిసిందన్న సంతోషంతో విస్తారంగా మిరప నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. షెడ్లలో పెంచిన నారు, సొంత భూముల్లో పెంపకం చేపట్టిన నారు ఏతకు వచ్చింది. కూలీలు కూడా వర్షంతో పనులు ప్రారంభం కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయపనులు ఊపందుకుంటాయని రైతులు చెబుతున్నారు. మండలంలో సుమారు 5,000 ఎకరాల్లో మిరప సాగు చేసే అవకాశం ఉంది. అలాగే కంది, పొగాకు, మినుము, తదితర పైర్ల సాగుతో బీళ్లన్నీ పంట పొలాలుగా మారనున్నాయి. ఖరీ్‌ఫలో కేవలం పత్తి మాత్రమే వెయ్యి ఎకరాల్లో సాగయింది. అది కూడా పూత పిందె దశలో బెట్టకు వచ్చి దిగుబడులు రాలేదు. ఈ వానకు తిరిగి కొంతవరకు పైర్లు జీవం పోసుకుని దిగుబడులు ఇచ్చే అవకాశం లేకపోలేదని పత్తి రైతులు తెలిపారు. రబీ సీజన్‌కు వాతావరణం అనుకూలంగా మారే పరిస్థితులు నెలకొనాలంటే వర్షాలు ఇంకా కురియాల్సి ఉంది.
ఎర్రగొండపాలెం మండలంలో..
ఎర్రగొండపాలెం : మండలంలోని పలు గ్రామాల్లో మిరపనాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలో గతమూడు రోజులుగా కురిసిన వర్షానికి అన్ని గ్రామాల్లో ఒంటి మొక్క మిరపనాట్లు రైతులు వేయిస్తున్నారు. గత రెండు నెలలుగా వర్షాలు పూర్తిస్థాయిలో కురవక పోవడంతో మిరపతోటలు సాగుచేసే రైతులు వర్షం కోసం ఎదురు చూశారు. ప్రస్తుతం మిరపనాట్లు వేసేందుకు సరిపోయే వర్షాలు కురవడంతో మండలంలోని అన్ని గ్రామాల రైతులు మిరపనాట్లు వేయిస్తున్నారు.ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో మండలంలో 2,942 హెక్టార్ల విస్తీర్ణంలో మిరప సాగు చేయాల్సి ఉండగా ఇప్పటికి మండలంలో 30 హెక్టార్ల విస్తీర్ణంల మాత్రమే సాగుచేశారు. గత మూడు రోజులుగా వర్షం కురిసి భూమిలో పదును ఉండడంతో మిరప నారు కోనుగోలు చేసి నాట్లు వేయిస్తున్నారు. ఒంటిమొక్క మిరపనారు ఒక్కో మొక్క 75పైసల నుంచి రూపాయి వరకు రేటు పలుకుతోంది. మండలంలోని వైకొత్తపల్లి, గురిజేపల్లి, బోయలపల్లి, గోళ్ళవిడపి, వీరభద్రాపురం, గుర్రపుసాల, గంజివారిపల్లె, కొలుకుల గ్రామాల్లో మిరప నాట్లు నాటే పనులు జరుగుతున్నాయి.