Share News

ఇంకొల్లులో టీడీపీలోకి పెరిగిన వలసలు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:04 AM

ఇంకొల్లు మండలంలో టీడీపీలోకి వలసలు పెరిగాయి. ఇప్పటివరకు వైసీపీలో ఉన్న ప్రముఖ నేతలు ఆ పార్టీని వీడి పసుపు కండువాను కప్పుకున్నారు. పార్టీ మం డలాధ్యక్షుడు నాయుడు హనుమంతరా వు, మరికొందరు నేతలు మండలంలోని ఇడుపులపాడులో 40 మంది బీసీలు సైకిల్‌ ఎక్కారు.

ఇంకొల్లులో టీడీపీలోకి పెరిగిన వలసలు
వైసీపీ సర్పంచ్‌ సీతామహాలక్ష్మిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

సైకిలెక్కిన వైసీపీకి చెందిన

ప్రముఖ నేతలు

ఆహ్వానించిన ఎమ్మెల్యే ఏలూరి

ఇంకొల్లు, ఏప్రిల్‌ 17 : ఇంకొల్లు మండలంలో టీడీపీలోకి వలసలు పెరిగాయి. ఇప్పటివరకు వైసీపీలో ఉన్న ప్రముఖ నేతలు ఆ పార్టీని వీడి పసుపు కండువాను కప్పుకున్నారు. పార్టీ మం డలాధ్యక్షుడు నాయుడు హనుమంతరా వు, మరికొందరు నేతలు మండలంలోని ఇడుపులపాడులో 40 మంది బీసీలు సైకిల్‌ ఎక్కారు. పూసపాడు గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఇం కొల్లు వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు ఆయోషాబుడేతోసహా 15 కుటుంబాలు మంగళవారం చేర గా, కృష్ణనగర్‌కు చెందిన కొం తమంది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఏలూరి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణనగర్‌కు చెందిన 17 కుటుంబాలు నిడగంటి నాగేశ్వరరావు, పసుపులేటి బాలకృష్ణ, పసుపులేటి ప్రసాద్‌, పసుపులేటి మాధవరావు, పసుపులేటి మల్లేశ్వరరావు, నీడగంటి వెంకటనారాయణ, దత్తాత్రేయ, రవీంద్రబాబు బుధవారం చేరగా ఏలూరి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఏలూరి వెంట కారంచేడు యువత

పర్చూరు : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో హాట్రిక్‌ విజయానికి మేము సైతం అటూ యువత ముందుకు సాగుతోంది. ఎమ్మె ల్యే చేపడుతున్న ఎన్నికల ప్రచారంలో పెద్దఎత్తున తరలి వచ్చి ఏలూరికి మద్దతుగా నిలుస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏలూరి మండలంలోని ఉప్పుటూరు గ్రామంలో పర్యటిస్తున్న నేపథ్యంలో కారంచేడు గ్రామానికి చెం దిన యువకులు మూకుమ్మడిగా తరలివచ్చి మేము సైతం మీకు తోడుగా అం టూ ఏలూరి వెంట నడిచారు. యువత రాకతో టీడీపీలో జోష్‌ పెరిగింది.

మార్టూరులో టీడీపీ శ్రేణుల ప్రచారం

మార్టూరు : అంబేడ్కర్‌నగర్‌లో బుధవారం టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావును మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ సందర్భంగా సూపర్‌సిక్స్‌ పథకాలు, మహిళా శక్తి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీడీపీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో 25వేల మంది పేదలకు ఏలూరి ఇంటి స్థలాలు ఇస్తారన్నారు. అంబేడ్కర్‌ నగర్‌లో జరిగిన అభివృద్ధిని మర్చిపోకుండా ఏలూరికి మద్దతు పలకాలన్నారు. కార్యక్రమంలో జంపని శ్రీను, కన్నె గంటి శ్రీను, కామినేని జనార్దన్‌, షేక్‌ రజాక్‌ తాటి నాగేశ్వరరావు, పుట్టా శ్రీను, కాకోలు వెంకటేశ్వర్లు, గన్నవరం బుడే, రావినేని శ్రీను, గొట్టిపాటి వెంకట్రావు, భూలక్ష్మి, రుక్మిణి, శేషమ్మ, శివమ్మ పా ల్గొన్నారు.

వైసీపీని వీడిన నాయుడువారిపాలెం సర్పంచ్‌

వందలాదిమంది టీడీపీలో చేరిక

నాయుడువారిపాలెం (పర్చూరు) : కారంచేడు మండలం నాయుడువారిపాలెం గ్రామ వైసీపీ సర్పంచ్‌ గుమ్మడి సీతామహాలక్ష్మి ఎమ్మె ల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో బుధవారం పార్టీలోకి చేరారు. ఆమెతోపాటు, గ్రామానికి చెందిన వందలాదిమంది వైసీపీకి గుడ్‌బై చెప్పి సైకిలెక్కారు. వారందరికీ ఏలూరి కండు వాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో గుమ్మడి రామ్మోహన్‌, నాయుడు సు బ్బారావు, జరుగుల జయప్రకాష్‌, రాధా లక్ష్మి ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు కా ర్యకర్తలు మూకుమ్మడిగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ కలసి పనిచేసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపు ని చ్చారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఏలూరి అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం మండలపార్టీ అధ్యక్షుడు తిరుములశెట్టి శ్రీహరి, నాయకులు ఉన్నారు.

ఏలూరి గెలుపు కోసం విస్తృత ప్రచారం

పర్చూరు : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరా వు విజయాన్ని కాంక్షిస్తూ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ఏలూరికి అఖండ మెజార్టీతో హాట్రిక్‌ విజయం చూకూర్చాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ప ర్చూరులోని ప్రధాన వీధుల్లో ప్రచారం సా గింది. జగన్‌రెడ్డి పాలనలలో అన్ని రంగాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం కూటమిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ పా ర్టీ అధ్యక్షు డు అగ్నిగుండాల వెంకటకృష్ణారావు, కొల్లా శివ రాం ప్రసాద్‌, కొండ్రగంటి శివనాగేశ్వరావు, గడ్డిపాటి శ్రీనివాసరావు, మల్లాధి సురేష్‌, అబ్రహం, నాగరాజు, కొల్లా చౌదరి, పఠాన్‌ మీరావలి, కోటగిరి ప్రసాద్‌, మహిళా నాయకులు పూరిమెట్ల జయమ్మ, ఊటుకూరి నిర్మల, కొల్లా సు బ్బమ్మ, జనసేనులు దీర్ఘాల రమేష్‌, తులసి చంటి, అచ్చికోలు సతీష్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:04 AM