ఈనాం భూముల సర్వే పనులు ప్రారంభం
ABN , Publish Date - Sep 12 , 2024 | 11:09 PM
ఎన్నో దశాబ్దాల నుంచి భూములు సాగు చేసుకుంటున్న తమకు హక్కులు లేవని రైతులు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. గురువారం నుంచి చెన్నుపల్లి ఈనాం భూముల ఎంజైమెంట్ సర్వే మెదలైంది.
15రోజుల పాటు కొనసాగనున్న సర్వే
800 సర్వే నెంబర్లు, 4500 ఎకరాల భూములకు సంబంధించి వివరాలు సేకరించనున్న అధికారులు
బల్లికురవ, సెప్టెంబరు 12 : ఎన్నో దశాబ్దాల నుంచి భూములు సాగు చేసుకుంటున్న తమకు హక్కులు లేవని రైతులు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. గురువారం నుంచి చెన్నుపల్లి ఈనాం భూముల ఎంజైమెంట్ సర్వే మెదలైంది. బల్లికురవ మండలం చెన్నుపల్లి గ్రామంలో మెత్తం 800 సర్వే నెంబర్లలో సుమారుగా 4500 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని రైతులు ఎన్నో దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిలో తమకు హక్కు ఉందని ఈనాం దారులు అంటున్నారు. దీంతో రైతుల సాగు చేస్తున్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా అందించలేదు. భూములు సాగు చేసుకుంటున్న హక్కులు మాత్రం సక్రమంగా అభించడం లేదని రైతులు తమ బాధను మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకు రాగా అయన ప్రభుత్వం ద్వారా రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని హమీ ఇచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు చెన్నుపల్లి, రెవెన్యూ పరిధిలో ఉన్న ఈనాం భూముల సర్వే చేస్తున్నారు. మండలంలోని అన్ని సచివాలయాల సర్వేయర్లను, గ్రామ రెవెన్యూ అధికారులను, ఎనిమిది టీంలుగా ఏర్పాటు చేసి భూములపై ఎవరు ఉన్నారు. రైతులకు ఎంత భూమి ఉంది. ఖాళీగా భూములు ఎన్ని ఉన్నాయి అన్న వివరాలను పూర్తిగా సేకరిస్తున్నారు. తదుపరి సర్వే వివరాలను 15 రోజుల్లో పూర్తి చేసి జాయింట్ కలెక్టెర్‌కు పంపిస్తామని సర్వే బృందాలు ఈ సందర్భంగా తెలిపారు. చెన్నుపల్లి ఈనాం భూముల సర్వేను ఇన్‌చార్జి తహసీల్దార్ రవికుమార్, మండల సర్వేయర్ కిషోర్ దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు. సర్వే టీంలతో, రైతులతో వారు మాట్లాడుతూ దగ్గర ఉండి రైతులు సర్వే చేయించుకోవాలని ఏవైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకు రావాలని అన్ని సర్వే నెంబర్లను పూర్తి స్థాయిలో కొలతలు వేసి రైతుల వివరాలను సేకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.