Share News

చరిత్రలో నిలిచేలా ఇంకొల్లులో ‘రా కదిలిరా’

ABN , Publish Date - Feb 15 , 2024 | 10:48 PM

అధికార వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా సభను నిర్వహించి తీరుతామని ఆపార్జీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి ఽధీమా వ్యక్తం చేశారు. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో ఈనెల 17న నిర్వహించనున్న రా కదిలిరా సభ చరిత్రలో నిలిచేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఎమ్మెల్యే ఏలూరి సభా ప్రాంగణాన్ని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవితోపాటు పార్టీ శ్రేణులతో కలసి ఏలూరి పరిశీలించారు.

చరిత్రలో నిలిచేలా ఇంకొల్లులో ‘రా కదిలిరా’
సభ ఏర్పాట్లను అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌తో కలసి పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

సభా స్ధలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యేలు ఏలూరి, గొట్టిపాటి

ఎన్ని కుట్రలు చేసినా సభ నిర్వహించి తీరుతాం

టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి

పర్చూరు, ఫిబ్రవరి 15: అధికార వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా సభను నిర్వహించి తీరుతామని ఆపార్జీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి ఽధీమా వ్యక్తం చేశారు. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో ఈనెల 17న నిర్వహించనున్న రా కదిలిరా సభ చరిత్రలో నిలిచేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఎమ్మెల్యే ఏలూరి సభా ప్రాంగణాన్ని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవితోపాటు పార్టీ శ్రేణులతో కలసి ఏలూరి పరిశీలించారు. వైసీపీ సర్కార్‌ అవినీతి, దౌర్జన్యాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇంకొల్లులోని తారక రామా విజయభేరీ ప్రాంగణ వేదికగా శంఖారావం పూరించనున్నారు. తెలుగుదేశం మేనిఫేస్టోలో ప్రకటించిన సంక్షేమ పఽథకాలను ప్రజలకు వివరించనున్నారు. 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈవేదిక ద్వారా శంఖం పూరిస్తారన్నారు. బాపట్ల పార్లమెంట్‌ చరిత్రలో నిలిచిపోయేలా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. 20 ఎకరాల్లో బహిరంగ సభను తీర్చిదిద్దుతున్నారు. ఈసభకు దాదాపు లక్షమందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని నాయకులు భావిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఆరుగురు ఇన్‌చార్జిలను కూడా నియమించారు.

సభ నిర్వహించి తీరుతాం..

ఎమ్మెల్యే ఏలూరి

ఈనెల 17న ఇంకొల్లులో తలపెట్టిన రా కదిలిరా సభను నిర్వహించి తీరుతామని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. కావాలని రాజకీయంగా సభను అడ్డుకునే ప్రయత్నం చేయటం సరికాదన్నారు. సభను అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అన్నీ అనుమతులతో దరఖాస్తు చేసినా అధినేత చంద్రబాబు పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. గతంలో నారా లోకేష్‌ యువగళం పాదయాత్రను కూడా అడ్డుకున్నారని గుర్తుచేశారు. చట్ట ప్రకారం ప్రతిపక్ష నేత సభకు అనుమతి ఇవ్వాల్సిన ప్రభుత్వం అడ్డంకులు సృష్టించటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తుందని, దీన్ని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 10:48 PM