చీమకుర్తిలో టీడీపీకి 7,640 ఓట్ల భారీ మెజార్టీ
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:26 AM
సంతనూతలపాడు నియోజకవర్గంలో టీడీపీ విజ యదుందుభి మోగించింది. కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన బీఎన్.వి జయ్‌కుమార్ ఘనవిజయం సాధించారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న చీమకుర్తి మున్సిపాలిటీ, మండలంలోని గ్రామాల్లో టీడీపీకి భారీ మెజార్టీ రావడం విశేషం.

వైసీపీ కంచుకోటలు బద్దలు
అంచనాలు తారుమారు
మున్సిపాలిటీలో 3,986.. రూరల్‌లో 3,654 ఓట్లు టీడీపీకి ఆధిక్యం
చీమకుర్తి, జూన్ 6: సంతనూతలపాడు నియోజకవర్గంలో టీడీపీ విజ యదుందుభి మోగించింది. కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన బీఎన్.వి జయ్‌కుమార్ ఘనవిజయం సాధించారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న చీమకుర్తి మున్సిపాలిటీ, మండలంలోని గ్రామాల్లో టీడీపీకి భారీ మెజార్టీ రావడం విశేషం. మున్సిపాలిటీ పరిధిలోని 24 పోలింగ్ కేంద్రాల్లో 3,986 ఓట్ల మెజార్టీ లభించింది. అలాగే మండలంలోని 25పంచాయతీల పరిధిలో 3,654ఓట్ల మెజార్టీతో మొత్తం చీమకుర్తి మండలంలో 7,640 ఓట్ల ఆధిక్యం దక్కింది. కాగా బాపట్ల లోక్‌సభ టీడీపీ అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్‌కు చీ మకుర్తి మండలంలో 7,519 ఓట్ల మెజార్టీలభించింది. వైసీపీకి కంచుకోట లాంటి చీమకుర్తిలో ఆ పార్టీ నాయకుల అంచనాలను టీడీపీ తలకిందులు చేసింది. కాగా 2019లో చీమకుర్తి మండలంలో వైసీపీకి 5612ఓట్ల మెజార్టీ రాగా, నేడు ఈ ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయి. చీమకుర్తి పట్టణం తోపాటు 20 పంచాయతీల్లో టీడీపీకి మెజార్టీ రాగా కేవలం చండ్రపా డులో(122), దేవరపాలెంలో(81), ఇలపావులూరులో(32), నేకునంబాదు లో(27)మాత్రమే వైసీపీకి మెజార్టీ లభించింది. గత ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజార్టీ వచ్చిన బండ్లమూడి, పల్లామల్లి, మంచికలపాడు, నాయు డుపాలెం, ఆర్‌ఎల్.పురం, చినరావిపాడు గ్రామాల్లో ఈసారి టీడీపీకి భారీ మెజార్టీ లభించటం విశేషం.
అసెంబ్లీకి గ్రామాల వారీగా టీడీపీకి లభించిన
ఆధిక్యత వివరాలు ..
చీమకుర్తిటౌన్- 3986, నిప్పట్లపాడు-167, పల్లామల్లి-178, బూదవాడ- 418, నాయుడుపాలెం-167, గాడిపర్తివారిపాలెం-73, తొర్రగుడిపాడు-34, బండ్లమూడి-161, ఎర్రగుడిపాడు-21, మంచికలపాడు-253, చీమలమర్రి -129, మైలవరం-114, పులికొండ-134, ఆర్‌ఎల్‌పురం-216, చినరావిపాడు -122, బూసరపల్లి-250, మువ్వావారిపాలెం-176, మర్రిపాలెం-43, కేవీపా లెం-353, ఏలూరివారిపాలెం-212, గోనుగుంట-358, గుడిపూడివారిపా లెం-140, జీఎల్‌పురం-193, పిడతలపూడి-93, రామచంద్రాపురం-9 ఓట్లు టీడీపీకి మెజార్టీ వచ్చాయి.