Share News

టీడీపీలోకి వలసల జోష్‌

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:28 PM

కనిగిరి నియోజకవర్గంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వలసల ప్రవాహం సాగుతోంది. గ్రామాలకు గ్రామాలు వైసీపీని వీడి టీడీపీలో చేరుతుంటే ఆ సెగతో వైసీపీ నాయకత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. నియోజకవర్గంలో రెండు నెలలుగా ఆరుమండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన వైసీపీ కుటుంబాలు, నాయకులు, కార్యకర్తలతో సహా ఆయా పార్టీని వీడి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి సమక్షంలో వేలాదిమంది టీడీపీ కండువాలు కప్పుకున్నారు

టీడీపీలోకి వలసల జోష్‌
డాక్టర్‌ ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

ఉక్కిరిబిక్కిరవుతున్న అధికార పార్టీ

సీఎ్‌సపురం, హనుమంతునిపాడు మండలాల్లో భారీ చేరికలు

డాక్టర్‌ ఉగ్ర సమక్షంలో వైసీపీ ముఖ్యనేతలు చేరిక

కనిగిరి, మార్చి 18 : కనిగిరి నియోజకవర్గంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వలసల ప్రవాహం సాగుతోంది. గ్రామాలకు గ్రామాలు వైసీపీని వీడి టీడీపీలో చేరుతుంటే ఆ సెగతో వైసీపీ నాయకత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. నియోజకవర్గంలో రెండు నెలలుగా ఆరుమండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన వైసీపీ కుటుంబాలు, నాయకులు, కార్యకర్తలతో సహా ఆయా పార్టీని వీడి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి సమక్షంలో వేలాదిమంది టీడీపీ కండువాలు కప్పుకున్నారు. సోమవారం సీఎ్‌సపురం, హనుమంతునిపాడు మండలాల్లో వైసీపీ ముఖ్యనేతలు డాక్టర్‌ ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు. సీఎ్‌సపురంలో మండలంలోని వైసీపీ జిల్లా జాయింట్‌ సెక్రటరీ, వైసీపీ మండల మాజీ కన్వీనర్‌ పాలకొల్లు వెంకటేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్‌ మన్నేపల్లి రమణయ్యలతో పాటు 100మందికి పైగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా హనుమంతునిపాడు మండలంలోని కోటతిప్పల గ్రామంలో వైసీపీకి చెందిన 9కుటుంబాలు, రసీదుపురం గ్రామంలో 4కుటుంబాలు, తిమ్మారెడ్డిపల్లిలో 7కుటుంబాలు, మహ్మదాపురం గ్రామంలో 2 కుటుంబాలు, ముప్పాళ్ళపాడు గ్రామంలో 5కుటుంబాలు, కిష్ఠంపల్లి గ్రామానికి చెందిన 5 కుటుంబాలు వైసీపీని వీడి డాక్టర్‌ ఉగ్ర సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు టీడీపీ మినీ మేనిఫెస్టోతో పాటు కనిగిరి ప్రాంతాభివృద్ధికి తాను సంకల్పించిన 5 అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు.

Updated Date - Mar 18 , 2024 | 11:28 PM