టీడీపీలోకి వలసల జోరు
ABN , Publish Date - Mar 03 , 2024 | 11:56 PM
: టీడీపీలోకి చేరేందుకు వైసీపీ నాయకులు వరసలు కడుతున్నారు. మండలం లోని మురారిపల్లె వైసీపీ నాయకుడు బాశం లక్ష్మిరెడ్డి ఆదివారం తన అనుచరులతో టీడీపీలో చేరారు.
ఎర్రగొండపాలెం, మార్చి 3 : టీడీపీలోకి చేరేందుకు వైసీపీ నాయకులు వరసలు కడుతున్నారు. మండలం లోని మురారిపల్లె వైసీపీ నాయకుడు బాశం లక్ష్మిరెడ్డి ఆదివారం తన అనుచరులతో టీడీపీలో చేరారు. ఆ పార్టీ ఎర్రగొండపాలెం అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నట్లు తెలిపారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రామంలో ఒక్కరోడ్డు వేయలేకపోవడంతో మనస్థాపం చెందినట్లు తెలిపారు. 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ, గ్రామంలో కీలకంగానే ఉన్నట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో పేదప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని, చంద్రబాబు విధానాలకు ఆకర్షితుడనై టీడీపీలో చేరినట్లు తెలిపారు. మురారిపల్లె గ్రామంలో త్వరలో వేదిక ఏర్పాటు చేసి తమ అనుచరవర్గ కుటుంబాలను టీడీపీలో చేరతాయన్నారు. ఎరిక్షన్‌బాబు విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ రైతు అధ్యక్షుడు చిట్యాల వెంగలరెడ్డి, ఇటీవల టీడీపీలో చేరారు. టీడీపీ నాయకుడు ఒంగోలు ఆదిరెడ్డి, మురారిపల్లె టీడీపీ నాయకులు మారం నారాయణరెడ్డి, బొడ్డు చిన్న అంజిరెడ్డి, కైపు వెంకటరెడ్డి, పేరం రమణారెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు.
పెద్ద దోర్నాల : వైసీపీ మునిగిపోయే పడవ అని టీడీపీ ఎర్రగొండపాలెం అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. దాని నుంచి కేడర్ బయటకు రావాలన్నారు. టీడీపీతో కలిసి అభివృద్ధి వైపు పయనిద్దామని పిలుపునిచ్చారు. మండలంలోని యడవల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు 2వ వార్డు సభ్యులు కొత్తపల్లి ప్రకాశం ఆధ్వర్యంలో పది కుటుంబాలు గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో ఆదివారం టీడీపీలో చేరాయి. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ విధా నాలు నచ్చక, టీడీపీతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని భావించి పార్టీలో చేరామన్నారు. అనంతరం గూడూరి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాకముందు చెప్పిన హామీలు అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందన్నారు. ప్రజల తలపై అప్పుల భారం మోపారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినవెంటనే మహిళలకు ఆర్‌టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితం మూడు సిలెండర్ల అందజేత, కుటుంబంలో ఎంతమంది ఆడబిడ్డలున్నా ప్రతి ఒక్కరికి నెలకు రూ.1,500లు, ఏటా రూ.15,000లు మంజూరు చేసి ఆర్ధిక తోడ్పాటు నివ్వనున్నట్లు తెలిపారు. వెలుగొండ పూర్తి చేసి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామన్నారు. మర్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు. తాను నియోజకవర్గం అభివృద్ధికి శక్తివంచన లేకుండా శ్రమిస్తానని ఆదరించాలని అన్నారు. సైకిలు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఏర్వ మల్లికార్జునరెడ్డి, నాయకులు షేక్ మంజూర్ భాష, చల్లా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
బేస్తవారపేట : రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని బేస్తవారపేట మాజీ సర్పంచ్ గాజుల విఽశ్వనాధం అన్నారు. బాబు ష్యూరిటి భవిష్యత్‌కు గ్యారెంటి కార్యక్రమంలో భాగంగా బేస్తవారపేటలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు కలసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.వైసీపీ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలకు మం చి జరగాలంటే టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో గాజుల విశ్వనాథం దూదెకుల సైదులు, ముప్పూరి రాము, దూదెకుల ఆదాం, సందు రమేష్ పాల్గొన్నారు.
తర్లుపాడు : బడుగు, బలహీన వర్గాలకు అండగా టీడీపీ ఉంటుందని టీడీపీ యువనాయకులు కందుల రోహిత్‌రెడ్డి అన్నారు. మండలంలోని పోతలపాడులో ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. వైసీపీ అరాచకలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కందుల రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడితోనే సాధ్య మన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తారని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, అవినీతిని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతిఒక్కరూ శాయా శక్తుల కృషిచేయాలని కోరారు. మార్కాపురం నియోజక వర్గ టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఉడుముల చిన్నపురెడ్డి, మాజీ ఎంపీపీ పులివేముల ఏసుదాసు, నాయకులు రామిరెడ్డి, నంబుల లక్ష్మయ్య, గోపినాథ్ చౌదరి, కాశీం, పలువురు నాయకులు పాల్గొన్నారు.
టీడీపీలో మైనారిటీ కుటుంబాలు చేరిక
గిద్దలూరు టౌన్ : కంభం పట్టణంలోని అర్బన్‌కాలనీకి చెందిన 20 మైనారిటీ కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. వీరికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్తు ముల అశోక్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని పార్టీలో చేరిన షేక్ ఖాజామొహిద్దీన్, షేక్ మున్నా, షేక్ బాబు, షేక్ షంషీర్, షేక్ ఖాదర్‌భాషా, షేక్ కరీముల్లా, షేక్ ముస్తఫా, షేక్ ఖాజాపీరా, షేక్ నాయబ్‌రసూల్, షేక్ బాబు, షేక్ అబ్దుల్ సత్తార్, షేక్ ఫయాజ్ ఉండగా కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షులు తోట శ్రీనివాసులు, ప్రధానకార్యదర్శి ఆరేపల్లి మల్లికార్జున, నూరుల్లాఖాద్రి, జిలాని, గుర్రం రాజు, మురళి, శేఖర్ ఉన్నారు.