Share News

భూముల అక్రమ రిజిస్ర్టేషన్‌లు రద్దుచేయాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:12 PM

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములను కొందరి పేరిట అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేశారని ఆరోపిస్తూ మండలంలోని కోదండరామపురం, మెట్లవారిపాలెం గ్రామాలకు చెందిన బాధితులు వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాచేశారు. వ్యవసాయ కార్మికసంఘం నాయకులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పెదయిర్లపాడు రెవెన్యూలోని 1129/5, 1101/3, 1129/6, 1129/7, 1101/5, 1101/9, 1101/4, 1104/3, 1101/7, 1101/2, 1101/6, 1101/8, 1104/1, 1129/2 తదితర సర్వేనెంబర్లలో 22మంది దళితులకు 1994వ సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్‌ భూమి కొనుగోలు పఽథకం ద్వారా ప్రభుత్వం భూములను ఇచ్చింది.

 భూముల అక్రమ రిజిస్ర్టేషన్‌లు రద్దుచేయాలి
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బాధితులు

పీసీపల్లి,మార్చి1: ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములను కొందరి పేరిట అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేశారని ఆరోపిస్తూ మండలంలోని కోదండరామపురం, మెట్లవారిపాలెం గ్రామాలకు చెందిన బాధితులు వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాచేశారు. వ్యవసాయ కార్మికసంఘం నాయకులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పెదయిర్లపాడు రెవెన్యూలోని 1129/5, 1101/3, 1129/6, 1129/7, 1101/5, 1101/9, 1101/4, 1104/3, 1101/7, 1101/2, 1101/6, 1101/8, 1104/1, 1129/2 తదితర సర్వేనెంబర్లలో 22మంది దళితులకు 1994వ సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్‌ భూమి కొనుగోలు పఽథకం ద్వారా ప్రభుత్వం భూములను ఇచ్చింది. అందులో అప్పట్లో ఆరు బావులను కూడా ప్రభుత్వమే తవ్వించింది. కొన్నేళ్ల తరువాత శింగరాయకొండ ప్రాంతాలకు చెందిన కొంతమంది కౌలుకు రాయించుకుని భూములు సాగుచేశారు. అయితే తమకు రుణాలు ఇప్పిస్తామని పట్టాలు పొందిన మహిళలతో వేలిముద్రలు వేయించుకుని అక్రమంగా వారి పేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు నిరుపేదలకు ఇచ్చిన భూములను ఆక్రమిస్తున్నారని, వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దుచేసి తిరిగి దళితులకు భూమిని అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు .అనంతరం ఆ సమయంలో కార్యాలయంలో తహసీల్దార్‌ లేకపోవడంతో కార్యాలయ ఉద్యోగినికి బాధితులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ ధర్నాలో మహేష్‌, బడుగు వెంకటేశ్వర్లు, పెదబాలయ్య, చినబాలయ్య, మార్కండేయులు, రాగి మాల్యాద్రి, లక్ష్మమ్మ, మాలకొండయ్య తదితరులు ఉన్నారు.

తహసీల్దార్‌ వివరణ

ఈ భూముల విషయమై పీసీపల్లి తహసీల్దార్‌ పద్మావతిని వివరణ కోరగా బాధితులు ఇచ్చిన వినతిపత్రంపై విచారించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు.

Updated Date - Mar 01 , 2024 | 11:12 PM