హైవే నిర్మాణానికి అక్రమంగా గ్రావెల్
ABN , Publish Date - Dec 16 , 2024 | 11:24 PM
విజయవాడ - బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం కొండను తవ్వి గ్రావెల్ తరలించడాన్ని తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం గ్రామస్థులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. అద్దంకి మండలంలోని మోదేపల్లి రెవెన్యూ పరిధిలో కొండ ఉంది. తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెంకు సమీపంలో ఈ కొండ ఉంది. కొండ పరిసర ప్రాంతంలో కొ ర్రపాటివారిపాలెం రైతులకు భూములు ఉన్నాయి. గ్రామస్థులు పశువులు, గొర్రెలు, మేకలను ఈ కొండ వద్దకే మేతకు తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో విజయవాడ - బెంగళూరు రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థ రోడ్డు నిర్మాణం కోసం కొండ మట్టిని తరలిస్తున్నారు.
తరలింపును అడ్డుకున్న కొర్రపాటిపాలెంవాసులు
గ్రామస్థలకు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధుల మధ్య వాగ్వివాదం
అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తూ పోలీ్‌సలకు ఫిర్యాదు
పోలీసుల తీరుపై ఆగ్రహం
అద్దంకి/తాళ్లూరు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ - బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం కొండను తవ్వి గ్రావెల్ తరలించడాన్ని తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం గ్రామస్థులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. అద్దంకి మండలంలోని మోదేపల్లి రెవెన్యూ పరిధిలో కొండ ఉంది. తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెంకు సమీపంలో ఈ కొండ ఉంది. కొండ పరిసర ప్రాంతంలో కొ ర్రపాటివారిపాలెం రైతులకు భూములు ఉన్నాయి. గ్రామస్థులు పశువులు, గొర్రెలు, మేకలను ఈ కొండ వద్దకే మేతకు తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో విజయవాడ - బెంగళూరు రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థ రోడ్డు నిర్మాణం కోసం కొండ మట్టిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 21వ తేదీన కొర్రపాటివారిపాలెం రైతులు గ్రావెల్ తరలింపును అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో గ్రావెల్ తరలింపును నిలిపి వేసి రెండు రోజుల నుంచి మరలా గ్రావెల్ తరలింపును ప్రారంభించడంతో సోమవారం ఉదయం కొర్రపాటివారిపాలెం గ్రామస్థులు రాజకీయపార్టీలను పక్కన పెట్టి అందరు మూకుమ్మడిగా వచ్చి గ్రావెల్ తరలింపును అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు, గ్రామస్థుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. అనుమతులు చూపించాలని గ్రామస్థులు కోరగా.. ఎలాంటి సమాధానం చెప్పకుండా దాట వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రావెల్ తరలింపును ఒప్పుకునేది లేదని, పశువులకు గ్రాసం ఇబ్బంది కలుగుతుందని గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో తాత్కాలికంగా గ్రావెల్ తరలింపును నిలిపి వేశారు. రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధులు తాళ్లూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కొర్రపాటివారిపాలెం గ్రామంలోకి వెళ్లి గ్రావెల్ తరలింపు అడ్డుకోరాదని చెప్పడంపట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి మండల పరిధిలో ఉన్న కొండ నుంచి గ్రావెల్ తరలింపును అడ్డుకోగా తాళ్లూరు పోలీసులు జోక్యం చేసుకోవడం పట్ల గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వానికి చెందిన కొండ నుంచి గ్రావెల్ తరలింపును అడ్డుకోవాల్సిన పోలీసులు, కాంట్రాక్టర్‌లకు వత్తాసుగా రైతులను హెచ్చరించడం ఏమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొండ నుంచి గ్రావెల్ తరలింపును నిలిపి వేయాలని కొ ర్రపాటివారిపాలెం రైతులు కోరుతున్నారు.