ఓటు వేయకపోతే పట్టాలు రద్దు
ABN , Publish Date - May 12 , 2024 | 11:13 PM
ఓటు వేయకపోతే పట్టాలు రద్దు చేస్తామని వైసీపీ నాయకులు ఓటర్లను భయపెడుతున్నారు. మండల పరిధిలోని గంగవరం గ్రామంలో వైసీపీ నాయకులు ఓటర్లను బెదిరిస్తున్నారని టీడీపీ గ్రామ నాయకుడు కెల్లంపల్లి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఎస్సీ కాలనీలో 30 ఎస్టీ కుటుంబాల వారున్నారు.

ఓటర్లను భయపెడుతున్న వైసీపీ నాయకులు
గంగవరం (ఇంకొల్లు), మే 12 : ఓటు వేయకపోతే పట్టాలు రద్దు చేస్తామని వైసీపీ నాయకులు ఓటర్లను భయపెడుతున్నారు. మండల పరిధిలోని గంగవరం గ్రామంలో వైసీపీ నాయకులు ఓటర్లను బెదిరిస్తున్నారని టీడీపీ గ్రామ నాయకుడు కెల్లంపల్లి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఎస్సీ కాలనీలో 30 ఎస్టీ కుటుంబాల వారున్నారు. వీరంతా టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తారనే అనుమానంతో స్థానిక వైసీపీ నాయకులు ఆదివారం రాత్రి పై విధంగా బెదిరింపులకు పాల్పడ్డారని వెంకటేశ్వర్లు ఆరోపించారు. వైసీపీకి ఓటు వేయకపోతే మీ పట్టాలు రద్దు చేయిస్తామని ఓటర్లను బెదిరించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కాలనీకి వెళ్లడంతో వైసీపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.