Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

దొంగ పట్టాలని నిరూపిస్తే..పోటీ నుంచి తప్పుకుంటా..

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:23 AM

ఒంగోలులో పేదలకు దొంగ పట్టాలు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించు కుంటానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స వాల్‌ విసిరారు. అర్హులైన పేదలకు ఒంగోలు న గర పాలక సంస్థ పరిధిలోనే భూములు కొను గోలు చేసి పట్టాలు ఇచ్చామన్నారు.

 దొంగ పట్టాలని నిరూపిస్తే..పోటీ నుంచి తప్పుకుంటా..

నేటి నుంచి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు

ఇచ్చిన మాటకు కట్టుబడి చీరలు, ఫ్యాంటు, షర్టులు ఇస్తా

ఎమ్మెల్యే బాలినేని

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 3: ఒంగోలులో పేదలకు దొంగ పట్టాలు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించు కుంటానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స వాల్‌ విసిరారు. అర్హులైన పేదలకు ఒంగోలు న గర పాలక సంస్థ పరిధిలోనే భూములు కొను గోలు చేసి పట్టాలు ఇచ్చామన్నారు. స్థానిక ఎ1 కన్వెన్షన్‌ హాలులో ఆదివారం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వలంటీర్లకు వందనం కార్యక్రమం లో బాలినేని మాట్లాడారు. నగరంలోని పేదలకు పూరిగుడిసెలు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభు త్వంపై వత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయిం చి భూములు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ని న్నటి వరకు పేదలకు పట్టాలు ఇవ్వలేదని మా ట్లాడిన టీడీపీ నాయకులు ఇప్పుడు దొంగ పట్టా లు అని మాట్లాడటం దుర్మార్గంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేదలకు పంపిణీ చేసిన పట్టాలు దొంగపట్టాలు అవుతాయా అని ఆయన ప్రశ్నించారు. అర్హులైన పేదలను సచి వాలయ అఽధికారులే ఎంపిక చేశారని, ఇందులో పార్టీలను కూడా చూడలేదని, ఎవరి ప్రమేయం లేకుండానే పట్టాలు మంజూరు చేసినట్లు తెలి పారు. మాట తప్పి వెనుకడుగు వేసే రాజకీయా లను ఎప్పుడు చేయనన్నారు. మీ ఇష్టం వచ్చిన ట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోనేది లేదని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వ హయంలో టి డ్కో ఇళ్ళు కొత్తపట్నం మండలం ఆల్లూరులో క ట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గతంలో తాను ఇచ్చిన మాట మేరకు సోమవారం పట్టా లు పొందిన లబ్ధిదారులకు ఇంటి పట్టా రిజి స్ట్రేషన్‌తో పాటు చీరలు, ప్యాంటు, చొక్కాను ప్ర తి ఇంటికి వెళ్ళి అందిస్తామని తెలిపారు. వలం టీర్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు దారుణం గా ఉన్నాయన్నారు. అనంతరం వలంటీర్లను స త్కరించారు. కార్యక్రమంలో మేయర్‌ గంగాడ సు జాత, డిప్యూటీ మేయర్లు వేమూరి బుజ్జి, వెలనా టి మాధవరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌, ఎంపీపీ మల్లికార్జునరెడ్డి, వైసీపీ నాయకులుకఠారి శంకర్‌, గంటా రామానాయు డు, గోలి తిరుపతిరావు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:23 AM