Share News

అక్కడ ప్రమాదం జరిగితే అంతే సంగతులు..!

ABN , Publish Date - May 20 , 2024 | 10:23 PM

నామ్‌ రోడ్డులో పలు చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలలో ప్రమాదాలు జరిగితే ప్రాణాలు గాలిలో కలిసినట్లే అనే భావన వాహనచోదకులలో నెలకొంది. ప్రధానంగా అద్దంకి మండలం చక్రాయపాలెం - శాంతినగర్‌ మధ్య ప్రమాదకర మలుపు ఉంది. భవనాసి చెరువు నిర్మాణం జరగకముందు (సుమారు 1916కి ముందు) నర్సారావుపేట రోడ్డు (ప్రస్తుతం నామ్‌ రోడ్డు) అద్దంకి నుంచి శింగరకొండ సమీపంలో గుండా భవనాసి చెరువు మధ్యలో గుండా ఉండేది. భవనాసి చెరువు నిర్మాణంతో గతంలో ఉన్న రోడ్డు పూర్తిగా ముంపునకు గురై చెరువు మధ్యలో గుండా ఏర్పడింది.

అక్కడ ప్రమాదం జరిగితే అంతే సంగతులు..!
నామ్‌ రోడ్డులో చక్రాయపాలెం వద్ద మలుపులో బోల్తా పడిన కారు

తరచూ ఘటనలు

ప్రాణాలతో బయటపడ్డ వారు తక్కువ మందే

అద్దంకి, మే 20 : నామ్‌ రోడ్డులో పలు చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలలో ప్రమాదాలు జరిగితే ప్రాణాలు గాలిలో కలిసినట్లే అనే భావన వాహనచోదకులలో నెలకొంది. ప్రధానంగా అద్దంకి మండలం చక్రాయపాలెం - శాంతినగర్‌ మధ్య ప్రమాదకర మలుపు ఉంది. భవనాసి చెరువు నిర్మాణం జరగకముందు (సుమారు 1916కి ముందు) నర్సారావుపేట రోడ్డు (ప్రస్తుతం నామ్‌ రోడ్డు) అద్దంకి నుంచి శింగరకొండ సమీపంలో గుండా భవనాసి చెరువు మధ్యలో గుండా ఉండేది. భవనాసి చెరువు నిర్మాణంతో గతంలో ఉన్న రోడ్డు పూర్తిగా ముంపునకు గురై చెరువు మధ్యలో గుండా ఏర్పడింది. దీంతో కొండచుట్టూ తిప్పి గోపాలపురం మీదుగా భవనాసి కట్ట కిందగా చక్రాయపాలెం మీదుగా శ్మశానం వద్ద పాత రోడ్డులో కలిసే విధంగా ఏర్పాటు చేశారు. అనంతరం నామ్‌ రోడ్డు నిర్మాణ సమయం లో కూడా కొంత మేర అలైన్‌మెంట్‌ మార్పు చేసి అభివృద్ధి చేశారు. దీంతో చక్రాయపాలెం శ్మశానం సమీపంలో ఉన్న మలుపు మాత్రం అదే విధంగా ఉంచి రోడ్డు నిర్మాణం చేశారు. నామ్‌ రోడ్డు నిర్మాణం చేయక ముందు నుంచే చక్రాయపాలెం సమీపంలోని మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో దశాబ్దన్నర కిందట జరిగిన ఆటో ప్రమాదంలో గోవాడకు చెందిన 8 మంది మృతి చెందారు. అనంతరం మరోసారి జరిగిన ప్రమాదంలో అద్దంకి పట్టణానికి చెందిన 4గురు మృత్యుఒడికి చేరారు. ఇలా తరచూ ప్రమాదాలు జరగడం వాహనచోదకులు మృతి చెందడం జరుగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం మలుపు ప్రమాదకరంగా ఉండడంతో వేగంగా వచ్చే వాహనాలు అదుపు కాక రోడ్డు మార్జిన్‌లో గుండా పొలాలకు దూసుకు పోయి ప్రమాదాలకు గురవుతున్నాయి. నామ్‌ రోడ్డులో ప్రయాణించే వాహనచోదకులు ఇతర ప్రాంతాలకు చెందిన కొత్తవారు ఉండడంతో ప్రమాదకర మలుపును గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. దీనికి తోడు ప్రమాదకర మలుపునకు ముందు వాహనచోదకులు గుర్తించే విధంగా హెచ్చరిక బోర్డులు నామమాత్రంగా ఉండడంతో గుర్తించలేకపోతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగితే వాహనచోదకులతో పాటు అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడం కష్టమేనన్న అభిప్రాయం నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదకర మలుపును ముందే వాహనచోదకులు గుర్తించే విధంగా హెచ్చరిక బోర్డులు ఎక్కువగా ఏర్పాటు చేయాలని పలువురు వాహన చోదకులు కోరుతున్నారు.

Updated Date - May 20 , 2024 | 10:23 PM