Share News

బిందు సేద్యంతో అధిక దిగుబడులు

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:21 AM

ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో దిగుబడులు తీసేందుకు బిందు సేద్యం ఎంతగానో ఉపకరిస్తోంది.

బిందు సేద్యంతో అధిక దిగుబడులు

పెద్దదోర్నాల, ఆగస్టు 20: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో దిగుబడులు తీసేందుకు బిందు సేద్యం ఎంతగానో ఉపకరిస్తోంది. ఈ పద్ధతి వల్ల నీటిని ఆదా చేయడంతో పాటు ఆధిక ప్రయోజనాలు పొందవచ్చు. బిందు సేద్యం అనుసరిస్తున్న రైతులు మరి కొందరికి మార్గదర్శకులుగా మారారు. దీంతో పలువురు డ్రిప్‌ వినియోగంకోసం ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాయితీని రద్దు చేయడంతో రైతులు ఐదేళ్లు మిన్నుకుండిపోయారు. ప్రస్తుత నూతన ప్రభుత్వం మళ్లీ డ్రిప్‌ వినియోగానికి రాయితీకి అవకాశం ఇవ్వడంతో రైతులు ఆసక్తిగా దరఖాస్తు చస్తున్నారు. రైతులు ఇప్పటి వరకు ఉద్యాన పంటల్లో ఎక్కువగా డ్రిప్‌ను వినియోగిస్తున్నారు. అయితే బోరుబావుల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో కొద్ది పాటి నీటితో పైర్లను బతికించుకునేందుకు డ్రిప్‌ పద్ధతి అనువుగా ఉంటండడంతో రైతులు డ్రిప్‌ వినియోగం వైపు మళ్లారు. మోటారుపంపు సెట్ల నుంచి నీరు నేరుగా గొట్టాల ద్వారా పంపించి చిన్న చిన్న పైపుల ద్వారా ప్రతి మొక్కదగ్గర నీటిని పడేటట్లు అమర్చాలి. ఈ డ్రిప్‌ ద్వారా గంటకు 2నుం 8లీటర్ల నీటిని మొక్కలకు అందిస్తారు.ఈ పద్ధతిలో ఎక్కువగా నేలపై పరికరాలు అమర్చే విధానాన్ని అవలంభిస్తున్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు అధికం. బోర్లలో కొద్దిపాటి నీరొచ్చినా పంటలు పండించవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యాన పంటలు బొప్పాయి, అరటి, జామ, దానిమ్మతో పాటు పత్తి, మిరప, కూరగాయలు, మల్బరీ, తదితర తోటల్లోడ్రిప్‌ను వినియోగిస్తున్నారు.

ప్రయోజనాలు అధికం

డ్రిప్‌పద్ధతి వల్ల సాగు చేసే పంటలకు ప్రత్యేకంగానీటి తడులు ఇవ్వాలసిన అవసరం ఉండదు. నీరు ఎక్కువ, తక్కువ లేకుండా ప్రతి డ్రిపర్‌ దగ్గర సమానంగా మొక్కలకు నీరు అందుతుంది. కొలత ప్రకారం అందించవచ్చు. వినియోగించిన ప్రతి లీటరు నీటికి ఎక్కువ ఫలసాయం లభిస్తుంది. మామూలుగా ఎకరం సాగు చేసే నీటితో ఈ పద్ధతి ద్వారా హెక్టారుకు నీటిని అందించవచ్చు. ప్రధానంగా కలుపు మొక్కలను అదుపుచేయొచ్చు. విద్యుత్తు ఆదా కూడా అవుతుంది. రసాయనిక ఎరువులు డ్రిప్‌ ద్వారానే నీటితో పాటు అందించవచ్చు. తద్వారా ఎరువు ఖర్చు, తగ్గుతుంది. కూలీల శ్రమ కూడా ఆదా అవుతుంది. సాధారణంగా 100 కిలోలు ఎరువు అవసరమూతే డ్రిప్‌ ద్వారా 50 కిలోలు ఎరువు సరిపోతుంది.

మెళకువలు పాటించాలి

డ్రిప్‌ పద్ధతి అవలంభించే రైతులు కొద్దిపాటి మెళకువలు పాటిస్తే. ఎక్కువ కాలం పని చేస్తాయి. కాలువలు, చెరువుల్లో నుంచి వచ్చే నీటిలో సన్నని మట్టి, ఇసుక, రేణువులుంటాయి. కొన్ని ప్రాంతాల్లో నీటిలో లవణాలు అధికంగాఉంటాయి. ఇవన్నీ డ్రిప్‌ పరికరాల్లో పేరుకుపోయి నీటి సరఫరాకు అవరోధం కలిగిస్తాయి. అందువల్ల ఫిల్టర్లను రైతులు శుభ్రం చేస్తుండాలి. నీటి ఎద్దడి రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో బిందు సేద్యం రైతులకు ఎంతగానో ఉపయోగిస్తుంది.

Updated Date - Aug 21 , 2024 | 12:21 AM