Share News

ఘనంగా పవన్‌కల్యాణ్‌ జన్మదినం

ABN , Publish Date - Sep 03 , 2024 | 12:46 AM

ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్‌ జన్మదిన వేడుకలు మార్కాపురం పట్టణంలో సోమవారం అట్టహాసంగా నిర్వహించారు.

ఘనంగా పవన్‌కల్యాణ్‌ జన్మదినం

మార్కాపురం వన్‌టౌన్‌, సెప్టెంబరు 2: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్‌ జన్మదిన వేడుకలు మార్కాపురం పట్టణంలో సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఇమ్మడి కాశీనాథ్‌ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పవన్‌కల్యాణ్‌ ఇమ్మడి కాశీనాథ్‌ల జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక పాత బస్టాండ్‌లో జనసేన రాష్ట్ర మైనార్టీ నాయకులు మిర్జా ఆబిద్‌ అలిబేగ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ సాదిక్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీపార్క్‌ వద్ద పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సావిత్రి సమక్షంలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు.

కొమరోలు : కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తుందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక బస్టాండు సమీపంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజును పురస్కరించుకొని ఎన్‌డీఏ కూటమి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు రాష్ర్టాభివృద్ధికి అహర్నీశలు శ్రమిస్తున్నారన్నారు. యువత ప్రజలకు చేస్తున్న రక్తాదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, వైద్యశిబిరాలు ఇంకా పలు సేవా కార్యక్రమాలు చేస్తు పవన్‌కల్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని చాటుతున్నాయ న్నారు. గిద్దలూరు జనసేన ఇన్‌చార్జ్‌ బెల్లంకొండ సాయిబాబు మాట్లాడుతూ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం లో పవన్‌కల్యాణ్‌ యువతకు విద్య, ఉపాది అవకాశాలు కల్పించేందుకు కృషిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు.

త్రిపురాంతకం : జనసేన మండల అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున ఆధ్వర్యంలో సోమవారం పవన్‌కల్యాణ్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంచి పెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మహేష్‌, చిన్న అంజి, పి.సుబ్బారావు, గురునాథం, శ్రీను, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల : స్థానిక నటరాజ్‌ కూడలిలో పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా కేకును కత్తిరించి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అటవీ శాఖాధికారుల సమన్వయంతో ప్రభుత్వ సామాజిక ఆరోగ్యకేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రేంజి అధికారి విశ్వేశ్వరరావు, జనసేన అధ్యక్షుడు కేతి మురళి, టీడీపీ నాయకులు దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, షేక్‌ మంజూర్‌భాష, కే సుబ్బారెడ్డి, బట్టు సుధాకర్‌రెడ్డి, ఏర్వ మల్లికార్జునరెడ్డి అంబటి వీరారెడ్డి, జనసేన నాయకులు వేమా దాసయ్య, కేతి రామాంజనేయులు, గుర్రాల ప్రసాద్‌, పండు, బీజేపీ సీనియర్‌ నాయకులు టీ.సీతయ్య పాల్గొన్నారు.

తర్లుపాడు : జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్‌ ఇమ్మడి కాశీనాథ్‌ జన్మదిన వేడుకలు తర్లుపాడులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు వెలుగు కాశీరావు ఆధ్వర్యంలో తర్లుపాడు పురవీధుల్లో జనసేన నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తర్లుపాడు బస్టాండ్‌ కూడలిలో ఇమ్మడి కాశీనాథ్‌ కేక్‌కట్‌ చేసి పంపిణీ చేశారు. అనంతరం వేణు గోపాలస్వామి ఆలయం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షు లు శ్రీనివాసులు, నాయకులు సూరె సువర్ణ, గుంటు రత్నకుమార్‌, టీడీపీ నాయ కులు సుబ్బయ్య, కె.శ్రీనివా సులు, ఈ.వెంకటయ్య, వి.రాజారామిరెడ్డి, వి.వెంక టరెడ్డి, ఎం.వెంకట్‌, ఖైరూన్‌, గోసు వెంకటే శ్వర్లు, కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

పొదిలి : డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకల సోమవారం పట్టణంలో ఘనంగా నిర్వ హించారు. పట్టణంలో జూనియర్‌ కళాశాల రోడ్డు పెద్దబస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో భారీ కేకులు కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు. కార్యక్రమానికి మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి తనయుడు విగ్నేష్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం కూటమి అభిమానుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

ఘనంగా పవన్‌కల్యాణ్‌ జన్మదినం

గిద్దలూరు టౌన్‌ : డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పుట్టిన రోజు వేడుకలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదురు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, జనసేన ఇన్‌చార్జ్‌ బెల్లంకొండ సాయిబాబా పాల్గొని కట్‌ చేసి కూటమి శ్రేణులకు పంచిపెట్టారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాల అభివృద్దికి, ప్రజాసంక్షేమా నికి కృషి చేస్తున్న పవన్‌కళ్యాణ్‌కు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, శానేషావలి, బీజేపీ నాయకులు జేవీ.నారాయణ, పిడతల రమేష్‌రెడ్డి, జనసేన నాయకులు లంకా.నరసింహారావు, ఉదయగిరి మల్లి కార్జునరావు, కౌన్సిలర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా థియేటర్‌ సమీపంలో పవన్‌కళ్యాణ్‌ అభిమానులు ఘనంగా పవన్‌కళ్యాణ్‌ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. టీడీపీ నాయకులు, పవన్‌కళ్యాణ్‌ అభిమాని చక్రియాదవ్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి పంచిపెట్టారు. అలాగే యువకు లు ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. డీజే ఏర్పాటు చేసి నృత్యాలు చేస్తూ పట్టణంలో పవన్‌కళ్యాణ్‌ అభిమానులు ర్యాలీ నిర్వహించారు.

నిత్యావసర సరుకుల పంపిణీ

కంభం : శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవాసంఘం ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ జన్మ దినాన్ని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం సంఘ కార్యాలయం దగ్గర 25మంది ధివ్యాంగులకు నిత్యవసర వస్తువులు, దుప్పట్లు, అల్పాహారాన్ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పంపిణీ చేశారు. అలాగే కంభం కళశాల వసతి గృహానికి 2 ఫ్యాన్లు, ఇన్వర్టర్‌, బల్బులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు తోట కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు సూరె ప్రసాద్‌, కార్యదర్శి రఘువీర్‌, కోశాధికారి రాజశేఖర్‌, మాజీ అధ్యక్షులు పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పవన్‌కళ్యాణ్‌ పుట్టిన రోజును పురష్కరించుకుని కంభం స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో జనసేన ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లంకొండ సాయిబాబు పాల్గొన్నారు.

బేస్తవారపేట : మండలంలోని చెట్టిచెర్ల గ్రామంలో పవన్‌కల్యాణ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, జనసేన ఇన్‌చార్జ్‌ బెల్లంకొండ సాయిబాబు ముఖ్యఅతిధిగా పాల్గొని కెక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో లంకా నరశింహరావు, మాజీ సర్పంచ్‌ తిగిరెడ్డి భూపాల్‌రెడ్డి, జనసేన నాయకులు బండ్లమూడి బాలేశ్వరరావు, మాచర్ల విశ్వనాధరెడ్డి, తిగిరెడ్డి అశోక్‌రెడ్డి, సర్వేశ్వరరెడ్డి మధుసుధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 12:46 AM