Share News

నేటి నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు

ABN , Publish Date - May 29 , 2024 | 10:30 PM

హనుమజ్జయంతి ఉత్సవాలకు శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దే వాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం రోజు హనుమజ్జయంతి రావడం విశే షంగా చెప్పుకోవచ్చు. హనుమజ్జయంతి ఉత్సవాలు గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు జరగుతాయని ఈవో, అసిస్టెంట్‌ కమిషనర్‌ సుభద్ర తెలిపారు.

నేటి నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు
శింగరకొండలోని ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం

ముస్తాబైన శింగరకొండ ఆలయం

అద్దంకి, మే 29 : హనుమజ్జయంతి ఉత్సవాలకు శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దే వాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం రోజు హనుమజ్జయంతి రావడం విశే షంగా చెప్పుకోవచ్చు. హనుమజ్జయంతి ఉత్సవాలు గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు జరగుతాయని ఈవో, అసిస్టెంట్‌ కమిషనర్‌ సుభద్ర తెలిపారు. ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా గురువారం ఉద యం 8 గంటలకు ఆలయ ప్రదక్షిణ, పరివార దేవతలకు నారికేళ ఫల సమర్పణ హారతి, 9 గంటలకు గణపతి పూజ, నవ గ్రహ సహిత, మన్యుసూక్త హోమం, వాస్తు మండపారాధన, అగ్ని ప్రతిష్ఠాపన, సహస్ర నామ పూజలు జరుగుతాయి. సాయంత్రం 6-45 గంటలకు సహస్ర కదలీఫల పూజను నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు గణపతి పూజ, మహన్యాస పారాయణం, ఏకాదశ మన్యుసూక్త వారాభిషేకం, వేదస్వస్తి, పంచామృతం, ఏకాదశ ద్రవ్యములతో సంపూర్ణాభిషేకము, సుందరకాండ పారాయణ చండి సప్తశతి సూర్యనమస్కారాలు, 9 గంటలకు మన్యుసూక్త హోమం, సాయంత్రం 6-45 గంటలకు ప్రదోషకాలమందు లక్ష మల్లె పూల పూజ జరుగును. హనుమజ్జయంతి సందర్భంగా శనివారం ఉదయం 4-45 గంటలకు సుప్రభాత సేవ, బిందె తీర్థం, గోపూజ, 5-15 గంటలకు స్వామి వారి నిత్యాభిషేకం, 7గంటలకు ఆలయ ప్రదక్షిణ ఆలయ పరివార దేవతలకు నారికేళ ఫల సమర్పణ, 8 గంటలకు ఆలయ ముఖ మండపం లో గణపతి పూజ, రుత్విగ్వరణం, మూలవిరాట్‌కు లక్షనాగవల్లీ (తమలపాకులు) దళార్చన, 9 గంటలకు యాగశాలలో నిత్య అనుష్టానములు, 10గంటలకు యాగశాలలో మన్యుసూక్త హవనం, పూర్ణాహుతి ద్రవ్యపూజ, మహాపూర్ణాహుతి యాగశాల ప్రదక్షిణ, వేదాశీర్వచనం జరుగును. సాయంత్రం 5 గంటలకు దీపాలంకరణ, ఊంజల్‌సేవ జరుగును. 6-45 గంటలకు సహస్ర చూతఫల ( మామిడిపండ్లు) పూజ నిర్వహిస్తారు. పలువురు దీక్షా భక్తులు హనుమజ్జయంతి సందర్భంగా ఇరుముడి సమర్పణ చేయనున్నారు. హనుమజ్జయంతి ఉత్సవాల పూజలకు భక్తులు పెద్ద సం ఖ్యలో తరలి రావాలని కోరారు.

Updated Date - May 29 , 2024 | 10:41 PM