Share News

హామీలు.. కౌంటర్లు..!

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:54 PM

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండపి బరిలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ తన ప్రచారంలో ప్లీజ్‌ ఒక్క అవకాశం ఇవ్వండి.. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్‌ వన్‌ చేసి చూపిస్తానని ఊరూవాడా తిరిగి పదేపదే అభ్యర్థనలు చేస్తున్నారు. సింగరాయకొండలో వైసీపీ నేతలతో నిర్వహించిన సమావేశాలలో, ప్రచారాలలో మేజర్‌ పంచాయతీగా ఉన్న సింగరాయకొండను మున్సిపాలిటీగా అభివృద్ధి చేసి సుందరనగరంగా తీర్చిదిద్దుతానని హామీలు గుప్పిస్తున్నారు.

హామీలు.. కౌంటర్లు..!

మంత్రి సురేష్‌ వాగ్దానాలపై ఎమ్మెల్యే స్వామి ప్రతిస్పందన

కొండపి నియోజకవర్గ ప్రజల్లో ఆసక్తికర చర్చ

ఇరువురునీ బేరీజు వేసుకుంటున్న ఓటర్లు

సింగరాయకొండ, ఏప్రిల్‌ 24 : వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండపి బరిలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ తన ప్రచారంలో ప్లీజ్‌ ఒక్క అవకాశం ఇవ్వండి.. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్‌ వన్‌ చేసి చూపిస్తానని ఊరూవాడా తిరిగి పదేపదే అభ్యర్థనలు చేస్తున్నారు. సింగరాయకొండలో వైసీపీ నేతలతో నిర్వహించిన సమావేశాలలో, ప్రచారాలలో మేజర్‌ పంచాయతీగా ఉన్న సింగరాయకొండను మున్సిపాలిటీగా అభివృద్ధి చేసి సుందరనగరంగా తీర్చిదిద్దుతానని హామీలు గుప్పిస్తున్నారు.

మంత్రి సురేష్‌ హామీలపై ఎమ్మెల్యే స్వామి కౌంటర్లు

పోటీ చేసే ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చే మంత్రి ఆదిమూలపు సురేష్‌ హామీలపై ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కౌంటర్లు వేస్తున్నారు.

మంత్రిగా ఐదేళ్లు పని చేసి వైపాలేన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు?

యర్రగొండపాలేన్ని సుందరనగరంగా అభివృద్ధి చేస్తానని మురికి కూపంగా ఎందుకు మార్చారు? మున్సిపాలిటీగా ఎందుకు మార్చలేకపోయారు?

నియోజకవర్గ కేంద్రం నుంచి మండల కేంద్రాలకు డబుల్‌ రోడ్లు వేస్తానని హామీ ఇచ్చి ఎందుకు నేరవేర్చలేక పోయారు?

ప్రతి కాంట్రాక్ట్‌ను బినామీలకు అప్పనంగా కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటి..? ప్రతి పనికీ రేటుకట్టి నగదు ఎందుకు దండుకున్నారు..?

గెలిపించిన నాయకులు, కార్యకర్తలను ఎందుకు గాలికి వదిలేశారు?

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఎందుకు సాధించలేకపోయారు?

వెలిగొండను ఎందుకు పూర్తి చేయించలేకపోయారు?

పదునైన ప్రశ్నలతో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే స్వామి

ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తన ప్రచారంలో ప్రజల ముందు సూటిగా సురే్‌షపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

వైపాలెం ప్రజలు రెండు దఫాలు గెలిపించి మంత్రిని చేస్తే ఐదేళ్లు అందుబాటులో లేకుండా హైదరాబాద్‌ చుట్టూ తిరిగారని ఓటర్లకు వివరిస్తున్నారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సురేష్‌ అతని భార్యపై కేసులు ఉన్నాయని, బెయిల్‌పై ఇరువురు బయట తిరుగుతున్నారని ఏదో ఒకరోజు జైలుకి పోవడం తప్పదంటూ చెబుతున్నారు.

ప్రజల్లో చర్చోపచర్చ

మంత్రి చెబుతున్న హామీలను, ఆ హామీలకు ఎమ్మెల్యే స్వామి వేస్తున్న కౌంటర్లు, చేస్తున్న విమర్శలపై నియోజకవర్గ ప్రజల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొండపి నియోజకవర్గంలో స్వామి చేసిన అభివృద్ధిని, వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏమి అభివృద్ధి జరిగిందో ప్రజలు బేరీజు వేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ పోటీ చేస్తున్న సురేష్‌ వైపాలెంలో ఏమీ అభివృద్ధి చేశారు.. ఆయన నైజంపై కూడా ఓటర్లు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఆయన స్థానికేతరుడు, ప్రజలకు అందుబాటులో ఉండరని స్వామి చేస్తున్న ఆరోపణలపై కూడా నియోజకవర్గ ప్రజల్లో చర్చ నడుస్తోంది.

Updated Date - Apr 24 , 2024 | 11:54 PM