Share News

ఘనంగా ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

ABN , Publish Date - Feb 06 , 2024 | 10:28 PM

దొనకొండలోని ఒబ్బాపురం ఎస్సీ కాలనీలో తెలుగు యువత నాయకులు కుందుర్తి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో తెలుగు యువత ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని మంగళవారం రాత్రి ఘనంగా ఆవిష్కరించారు.

ఘనంగా ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ
విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న కొండయ్య, బ్రహ్మంచౌది

దొనకొండ, ఫిబ్రవరి 6 : దొనకొండలోని ఒబ్బాపురం ఎస్సీ కాలనీలో తెలుగు యువత నాయకులు కుందుర్తి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో తెలుగు యువత ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని మంగళవారం రాత్రి ఘనంగా ఆవిష్కరించారు. టీడీపీ చీరాల ఇన్‌చార్జి ఎంఎం కొండయ్యయాదవ్‌, దర్శి నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు నాదెండ్ల బ్రహ్మంచౌదరి, దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒబ్బాపురం ఎస్సీ కాలనీలో తెలుగు యువత నేతృత్వంలో మహనీయుడు ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటు ఎంతో అభినందనీయమని నిర్వాహకులైన యువతను వారు అభినందించారు. ఎన్టీఆర్‌ గొప్పతనాన్ని, తెలుగు ప్ర జలకు ఆయన చేసిన సేవలను, సినీ, రాజకీయ రంగాలలో ఆయన సాధించిన గొప్ప విజయాలను ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లపునేని వెంకటస్వామి, శ్రుంగారపు నాగసుబ్బారెడ్డి, కొ మ్మతోటి సుబ్బారావు, నిమ్మకాయల సుబ్బారెడ్డి, షేక్‌ తోహీద్‌, విప్పర్ల లక్ష్మీరావు, పత్తి వెంకటేశ్వర్లు, యరగొర్ల బసవయ్య, మన్నెం గాలెయ్య, కమ్మా వెంకటనారాయణ, దుగ్గెంపూడి చెంచయ్య, పెమ్మసాని లక్ష్మీనారాయణ, యగ్గోని యల్లారెడ్డి, బండ్లా వెంకటనారాయణ, నల్లూరి శ్రీనివాసరావు, పోతిపోగు చెన్నయ్య, బూ రగ అశోక్‌, కొమ్మతోటి మహేష్‌ పలు గ్రమాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఒబ్బాపురం ఎన్టీఆర్‌ అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించేలా ఏర్పాటు చేశారు.

Updated Date - Feb 06 , 2024 | 10:28 PM