Share News

తాత్కాలిక భవనాల్లోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ABN , Publish Date - Jul 15 , 2024 | 09:52 PM

ఏళ్ల తరబడి దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తాత్కాలిక భవనంలో నడుస్తోంది. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేకపోవటంతో ఇప్పటికీ విద్యార్థులు అరకొరగానే చేరుతున్నారు. శాశ్వత భవనాల ఏర్పా టుకు రెండు సంవత్సరాల క్రితమే స్థలం మంజూరైనప్పటికీ వైసీపీ పాల కుల నిర్లక్ష్యంతో కార్యరూపం దాల్చలేదు. దర్శి పట్టణంలో 2021లో మం జూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లోని భవనాల్లో ప్రారంభించారు. కళాశాలలో నాలుగు కోర్సులను ప్రవేశపె ట్టారు. బీఎస్సీ(జియాలజీ)), బీఎస్సీ(కంప్యూటర్స్‌ సైన్స్‌), బీకాం(కంప్యూట ర్స్‌ అప్లికేషన్‌), బీఏ(హిస్టరీ) కోర్సులు నడుస్తున్నాయి.

తాత్కాలిక భవనాల్లోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల
తాత్కాలిక భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల

- స్థలం మంజూరైనా వైసీపీ పాలకుల నిర్లక్ష్యం

- కార్యరూపం దాల్చని శాశ్వత నిర్మాణాలు

- పూర్తిస్థాయిలో కోర్సులు అందుబాటులో లేక

విద్యార్థుల ఇబ్బందులు

దర్శి, జూలై 15: ఏళ్ల తరబడి దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తాత్కాలిక భవనంలో నడుస్తోంది. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేకపోవటంతో ఇప్పటికీ విద్యార్థులు అరకొరగానే చేరుతున్నారు. శాశ్వత భవనాల ఏర్పా టుకు రెండు సంవత్సరాల క్రితమే స్థలం మంజూరైనప్పటికీ వైసీపీ పాల కుల నిర్లక్ష్యంతో కార్యరూపం దాల్చలేదు. దర్శి పట్టణంలో 2021లో మం జూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లోని భవనాల్లో ప్రారంభించారు. కళాశాలలో నాలుగు కోర్సులను ప్రవేశపె ట్టారు. బీఎస్సీ(జియాలజీ)), బీఎస్సీ(కంప్యూటర్స్‌ సైన్స్‌), బీకాం(కంప్యూట ర్స్‌ అప్లికేషన్‌), బీఏ(హిస్టరీ) కోర్సులు నడుస్తున్నాయి. బీఎస్సీ(కెమిస్టీ) కో ర్సు ఏర్పాటుచేయాల్సిఉండగా ఇప్పటివరకు ప్రారంభించలేదు. ఇంకా అద నంగా బ్యాచిలర్‌ బిజినెస్‌ అడ్మినిస్ర్టేషన్‌ కోర్సు కూడా ఏర్పాటు చేయవ చ్చు. శాశ్వత భవనాలు లేక చాలినన్నీ తరగతి గదులు అందుబాటులో లేక ఉన్న భవనాల్లో నడుపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల ఎంతోకాలంగా నడుస్తోంది.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకావటంతో ఎక్కడా భవనాలు అం దుబాటులో లేక తాత్కాలికంగా ఇక్కడ ప్రారంభించారు. రెండు సంవత్స రాల్లో శాశ్వత భవనాలు నిర్మిస్తామని ఆసందర్భంగా వైసీపీ పాలకులు చె ప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. దర్శి - కురిచేడు రోడ్డులో రెండేళ్ళ క్రితమే కళాశాల భవనాల కోసం ఆరు ఎకరాల భూమిని అధికారులు కే టాయించారు. భవనాల నిర్మాణానికి నిధులు విడుదల కాకపోవటంతో ఇ ప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం కళాశాలలో నాలుగు కోర్సుల్లో కేవలం 300 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మొత్తం 540 మంది వరకు చేరే అవకాశం ఉన్నప్పటికీ వనరులు లేకపోవటంతో పూర్తిస్థాయిలో విద్యార్థులు చేరటంలేదు. కీలకమైన బీఎస్సీ(కెమిస్టీ) కోర్సు అందుబాటులో లేకపోవటంతో అనేకమంది విద్యార్థులు ఇతర ప్రాంతాల కు వెళ్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో శా శ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుడతారని దర్శి ప్రాంత ప్రజలు ఎం తో ఆశతో ఎదురుచూస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్‌ బాధ్య తలు నిర్వహిస్తున్నందున త్వరలో ఖచ్చితంగా నిధులు విడుదల అవుతా యనే విశ్వాసంతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.

4

Updated Date - Jul 15 , 2024 | 09:53 PM