Share News

ఐదో సారి గొట్టిపాటి విజయదుందుభి

ABN , Publish Date - Jun 05 , 2024 | 10:35 PM

గత ఐదు సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే ప్రత్యర్థి ఎవరైనా, పార్టీ ఏదైనా విజయం మాత్రం గొట్టిపాటి రవికుమార్‌దేగా మారింది. 2004లో రాజకీయ ప్రవేశం చేసిన గొట్టిపాటి రవికుమార్‌ ఇప్పటికి ఐదు సార్లు పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించారు. రెండు సార్లు కాంగ్రెస్‌ పార్టీ తరపున, ఒక సారి వైసీపీ తరపున, రెండుసార్లు టీడీపీ తరపున పోటీ చేసి వి జయం సాధించారు. 2004లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున తొలిసారి పోటీ చేసి పెద్దనాన్న గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు నర్సయ్యపై 13,806 ఓట్ల మెజార్టీతో తొలివిజయం సాధించారు.

ఐదో సారి గొట్టిపాటి విజయదుందుభి
ఎమ్మెల్యే గొట్టిపాటికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న మున్సిపల్‌ కౌన్సిలర్‌ రజని

అద్దంకిని అడ్డాగా మార్చుకున్న రవికుమార్‌

అద్దంకి, జూన్‌ 5 : గత ఐదు సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే ప్రత్యర్థి ఎవరైనా, పార్టీ ఏదైనా విజయం మాత్రం గొట్టిపాటి రవికుమార్‌దేగా మారింది. 2004లో రాజకీయ ప్రవేశం చేసిన గొట్టిపాటి రవికుమార్‌ ఇప్పటికి ఐదు సార్లు పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించారు. రెండు సార్లు కాంగ్రెస్‌ పార్టీ తరపున, ఒక సారి వైసీపీ తరపున, రెండుసార్లు టీడీపీ తరపున పోటీ చేసి వి జయం సాధించారు. 2004లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున తొలిసారి పోటీ చేసి పెద్దనాన్న గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు నర్సయ్యపై 13,806 ఓట్ల మెజార్టీతో తొలివిజయం సాధించారు. 2009 నాటికి మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో కాంగ్రెస్‌ పార్టీ తరపున అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కర ణం బలరామకృష్ణమూర్తిపై 15,764 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో వైసీపీ తరపున గొట్టిపాటి పోటీచేసి టీడీపీ తరపున పోటీ చేసిన కరణం వెంక టేష్‌పై 4,235 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2015లో వైసీపీకి రాజీనామా చేసి అప్పటి అధికారపార్టీగా ఉన్న టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్‌ వైసీపీ తరపున పోటీ చేసిన బాచిన చెంచుగరటయ్యపై 12,991 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గొట్టిపాటి రవికుమార్‌ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టినా బెదరకుండా నిలబడ్డారు. 2024లో టీడీపీ తరపున రెండవ సారి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి పై భారీ మెజార్టీ తో విజయాన్ని కైవసం చేసుకున్నారు.

గత ఐదు సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే ఐదుసార్లు కొత్త అభ్యర్థులతో తలపడడం విశేషం. 2004లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి వరుసకు సోదరుడైన గొట్టిపాటి నర్సయ్య, 2009లో అ ద్దంకి నియోజకవర్గం నుంచి అప్పటి టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై, 2014లో వెంకటే్‌షపై, 2019లో వైసీపీ తరపున పోటీ చేసిన బాచిన గరటయ్యపై విజయం సాధించారు. 2024లో పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వచ్చి పోటీ చేసిన పాణెం చినహనిమిరెడ్డిపై విజయం సాధించారు. ఇలా పోటీ చేసి గెలిచిన ఐదు సార్లు ప్రత్యర్థులు మాత్రం వేర్వేరుగా ఉన్నారు.

24,890 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన గొట్టిపాటి

అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ 24,890 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా గొట్టిపాటి పోస్టల్‌ ఓట్లతో కలిపి 1,16,418 ఓట్లు సాధించగా, వైసీపీ అభ్యర్థి పాణెం చినహనిమిరెడ్డి 91,528 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి అడుసుమల్లి కిషోర్‌ 4072 ఓట్లు సాధించారు.

పంచాయతీల వారీగా పరిశీలిస్తే మైలవరంలో టీడీపీకి 20, వెంపరాల లో 432, చక్రాయపాలెం 72, గోవాడలో 207, చినకొత్తపల్లిలో 192, కలవకూరులో 179, బొమ్మనంపాడులో 673, గోపాలపురంలో 110, జార్లపాలెంలో 47, నాగులపాడులో 498, వేలమూరిపాడులో సమానం, కొంగపాడులో 135, తిమ్మాయపాలెంలో 367, కొటికలపూడిలో 249, కుంకుపాడులో 66, పేరాయపాలెంలో 143, ధేనువకొండ (రెండు పునరావాస కాలనీలతో కలపి) 851 ఓట్ల మెజార్టీ సాధించింది. ఇక వైసీపీ మోదేపల్లిలో 7, రామాయపాలెంలో 104, విప్పర్లవారిపాలెంలో 98, మణికేశ్వరంలో 376, వెంకటాపురంలో 421, శింగరకొండ పాలెంలో 142, శంఖవరప్పాడులో 678, ధర్మవరంలో 118, ఉప్పలపాడులో 126 ఆధిక్యం సాధించింది.

పార్టీ ఏదైనా గెలుపు గొట్టిపాటిదే

గొట్టిపాటి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గత ఐదు సార్లూ ఆయననే వరించింది. ఐదు సార్లులో రెండు సార్లు కాంగ్రెస్‌, ఒక సారి వైసీపీ, రెండు సార్లు టీడీపీ తరపున విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున 2004లో మార్టూరు నుంచి పోటీ చేసి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్‌, మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నుంచి 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరపునే పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి అద్దంకి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకంగా ఒక వర్గంను తయారు చేసుకున్న గొట్టిపాటికి ఎదురు లేకుండా పోయింది. నియోజకవర్గం మొత్తం మీద అన్ని గ్రామాలలో తనకంటూ వ్యక్తిగతం గా ఓ వర్గం ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2014లో వైసీపీ తరపున పోటీ చేసినా, 2019లో టీడీపీ తరపున పోటీ చేసినా, 2024లో రెండవసారి టీడీపీ తరపున పోటీ చేసినా విజయం సాధించరని చెప్పవచ్చు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు తనవర్గానికి చెందిన నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుండటంతో గొట్టిపాటి వ రుస విజయాలను సులువుగా సొంతం చేసుకునే విధంగా దోహదపడిందన్న అభిప్రాయం నెలకొంది.

పట్టణంలో ఆధిక్యం

అద్దంకి పట్టణ ఓటర్లు టీడీపీకి భారీ ఆధిక్యం అందించారు. మొత్తం 31 పోలింగ్‌ బూత్‌లు ఉండగా మూడు పోలింగ్‌ బూత్‌లలో మాత్రమే వైసీపీకి స్వల్ప ఆధిక్యం వచ్చింది. మిగిలిన 28 పోలింగ్‌ బూత్‌లలో టీడీపీకి ఆధిక్యం వచ్చింది. అద్దంకి పట్టణంలో5,957 ఓట్లు ఆధిక్యం వచ్చింది. అత్యఽధికంగా 163 పోలింగ్‌ బూత్‌లో టీడీపీకి 467 ఓట్లు ఆధిక్యం వచ్చింది. వైసీపీ కి 151 పోలింగ్‌ బూత్‌లో69, 160లో 16,173లో 70 ఓట్లు ఆదిక్యం వచ్చింది. ఇక మిగిలిన అన్ని బూత్‌లలో టీడీపీకి ఆధిక్యం వచ్చింది. 146 పోలింగ్‌ బూత్‌లో 170, 147లో 196, 148లో 220, 149లో 35, 150లో 245, 152లో 190, 153లో 205, 154లో 262, 155లో 194, 156లో 43, 157లో 13, 158లో 369, 159లో 28, 161లో 128, 162లో 204, 153లో 467, 164లో 325, 165లో 58, 166లో 432, 167లో 255, 168లో 308, 169లో 383, 170లో 216, 171లో 253, 172లో 428, 174లో 80, 175లో 192, 176 పోలింగ్‌ బూత్‌లో 213 ఓట్లు టీడీపీకి ఆధిక్యం వచ్చాయి. దీంతో అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో 5,957 ఓట్లు ఆధిక ్యం వచ్చింది.

బల్లికురవ మండలంలో బారీ మెజారిటీ

మండలంలో టీడీపీ పార్టీకి ఈ ఎన్నికలలో భారీ మెజారిటీ వచ్చింది. ఈసారి 21 పంచాతీలలో 19 పంచాయతీలలో టీడీపీ నాలుగు వేల పైచిలుకు మెజారిటీ సాధించింది. గత 2019 ఎన్నిలలో టీడీపీ కేవలం 539 ఓట్లు మెజారిటీ సాధించగా ఈసారి మాత్రం ఎమ్మేల్యే రవికుమార్‌కు అత్యధిక శాతం మంది ఓటర్లు ఓట్లు వేశారు. గతంలో ఎన్నడు లేని భారీ మెజారిటీ వచ్చిందని టీడీపీ శ్రేణులు తెలిపారు. గ్రామాలవారీగా టీడీపీ వచ్చిన మెజారిటీలు ఇలా ఉన్నాయి. కొప్పెరపాలెం, 91, ఉప్పుమాగులూరు, 347, వేమవరం, 282, కె.రాజుపాలెం, 568, కొణిదెన, 254, మల్లాయపాలెం, 253, కొండాయాలెం, 170, బల్లికురవ, 42, చెన్నుపల్లి, 170, నక్కబొక్కలపాడు, 346, గుంటుపల్లి, 452, ముక్తేశ్వరం, 128, ఎస్‌ఎల్‌ గుడిపాడు, 138, వైదన,341, కొప్పెరపాడు, 27, గొర్రెపాడు, 371, వెలమవారిపాలెం, 20, కొత్తూరు, 141, కొమ్మినేనివారిపా లెం, 227, అంబడిపూడి, 156 ఓట్ల మెజారిటీలు వచ్చాయి. వైసీపీకి వల్లాపల్లిలో 74, కూకట్లపల్లిలో 213 ఓట్ల మెజారిటీ వచ్చింది. మండలంలో టీడీపీకి మెజారిటీలు వచ్చిన గ్రామాలలో మెదటిగా కె. రాజుపాలెం, రెండోదిగా గుంటుపల్లి గ్రామాలు నిలిచాయి. ఉహించని విధంగా టీడీపీకి 19 గ్రామాలలో మెజారిటీలు రావటంతో టీడీపీ వ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలలో వైసీపీకి మెజారిటీలు వచ్చిన గ్రామాలలో ఈసారి టీడీపీకి భారీ మెజారిటీలు రావటం విశేషం.

మేదరమెట్ల : కొరిశపాడు మండలంలో మూడు మేజర పంచాయతీలు ఉన్నాయి. అందులో మేదరమెట్ల, రావినూతల, పమిడిపాడు ఉన్నాయి. రావినూతల పమిడిపాడులో ఎప్పుడు టీడీపీకే మెజార్టీ లహాస్తుంది. గత రెండు ఎన్నికలల్లో వైసీపీకి స్వల్ప మెజార్టీ వచ్చింది.

మేదరమెట్ల మేజర్‌ పంచాయతీలోనే టీడీపీకి 700కి పైగా మెజార్టీ వ చ్చింది. దీనికి తోడు 800కి పైగా వైసీపీకి మెజార్టీ వస్తుందని అనుకున్న కొరిశపాడులో 307 ఓట్ల మెజార్టికే పరిమితమైంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గాలితో సంబంధం లేకపోయినా స్థానికంగా ఉన్న కారణాలవల్లే మెజార్టీ తగ్గినట్లు భావిస్తున్నారు. ఎర్రం చిన్న పోలిరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పనులు అడుగు ముందుకు పడలేదు. దీనిని వైవీ సుబ్బారెడ్డి పట్టించుకోలేదనే మిగతా మేజర్‌ పంచాయతీలు రావినూతల, పమిడిపాడులో గతంలో కన్నా మెజార్టీ పెరిగింది. మొత్తం మీద కొరిశపాడు మండలంలో అనుకున్నదానికన్న ఎక్కువ మెజార్టి వచ్చినట్లు తెలుస్తుంది.

గొట్టిపాటికి శుభాకాంక్షల వెల్లువ

అద్దంకి, జూన్‌ 5 : వరుసగా ఐదోసారి విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్‌ను నియోజకవర్గానికి టీడీపీ శ్రేణులు, గొట్టిపాటి అభిమానులు బుధవారం చిలకలూరిపేటలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గొట్టిపాటి రవికుమార్‌ 2004లో రాజకీయరంగ ప్రవేశం చేసి మార్టూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో 2009 నుంచి అద్దంకి నియోజకవర్గ బరిలో నిలిచి వరుసగా విజయం సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో నాయకత్వంతో సంబంధం లేకుండా నేరుగా సామాన్య కార్యకర్తలకు చనువు ఉంది. దీంతో 5వసారి విజయం సాధించిన గొట్టిపాటిని బుధవారం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో బుధవారం ఉదయం నుంచే చిలకలూరిపేటలో గొట్టిపాటి నివాసం టీడీపీ క్యాడర్‌తో కిటికిటలాడింది. తనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన శ్రేణులు, అభిమానులను ఎమ్మెల్యే రవికుమార్‌ అప్యాయంగా పలకరించడంతో పాటు ఎన్నికలలో కష్టపడి పనిచేసిన వారిని అభినందించారు.

గొట్టిపాటికి మంత్రి పదవి?

క్యాడర్‌లో జోరుగా చర్చ

అద్దంకి, జూన్‌ 5 : వరుసగా 5 సార్లు విజయం సాధించిన నేతగా గొట్టిపాటికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో గొట్టిపాటికి మంత్రి మండలిలో బెర్త్‌ ఖాయమనే అభిప్రాయం శ్రేణులలో చర్చ కొనసాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గొట్టిపాటిని టార్గెట్‌ చేసి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టారు. అంతటితో ఆగకుండా గ్రానైట్‌ క్వారీలు, ఫ్యాక్టరీలను మూసివేయించి ఐదేళ్లుగా వేధించారు. వీటన్నింటినీ తట్టుకొని నిలబడిన గొట్టిపాటి టీడీపీ క్యాడర్‌కు, ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేతలను సమన్వయ పరిచి ముందుకు నడిపిచండంలో కూడా గొట్టిపాటి కీలకంగా వ్యవహరించారు. అధినేత చంద్రబాబు, లోకేష్‌ వద్ద గొట్టిపాటికి ప్రత్యేక గుర్తింపు ఉన్నదృష్ట్యా ఈసారి మంత్రి పదవి వస్తుందని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - Jun 05 , 2024 | 10:35 PM