Share News

శోభాయమానంగా చెన్నయ్య అలంకరణలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:36 AM

మార్కాపురంలో వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి వాహనసేవ వైభవంగా నిర్వహిం చారు.

శోభాయమానంగా చెన్నయ్య అలంకరణలు

మార్కాపురం వన్‌టౌన్‌, ఫిబ్రవరి 16: మార్కాపురంలో వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి వాహనసేవ వైభవంగా నిర్వహిం చారు. ఉదయం సూర్యప్రభ, శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష వాహనాలపై స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి వెండిరథంపై అంగరంగ వైభవంగా నగరోత్సవం నిర్వహిం చారు. మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు వాహన సేవలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున వివిధ వాహన సేవల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి రథసప్తమి ఉత్సవ సేవా సంఘం అధ్యక్షులు యక్కలి కాశీవిశ్వనాథం, ఆలయ మాజీ ఛైర్మన్‌ పెనుగొండ కేశవరావు, కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ అన్నా కృష్ణ చైతన్య, ప్రముఖులు పాల్గొన్నారు. డీఎస్పీ బాలసుందరరావు ఆధ్వర్యంలో సీఐ వెంకటేశ్వర్లు, పోలీసులు సబ్‌ డివిజన్‌లోని ఎస్‌ఐలు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయంలో శ్రీచక్ర స్నానం నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు ప్రధాన ఆయుధమైన శ్రీచక్రానికి అర్చకులు అప్పనాచా ర్యులు, రంగాచార్యులు, సాయి కుమారాచా ర్యులు శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు.

30 చోట్ల అన్నప్రసాద వితరణ

మార్కాపురం వన్‌టౌన్‌ : రథసప్తమిని పురస్కరించుకొని పట్టణంలోని 30 ప్రాంతాల్లో అల్పాహారం, మధ్యాహ్నాం అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌ జంకె వెంకటరెడ్డి అన్నదాన కార్యక్రమంలో పాల్గొ న్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో నుంచి సాయంత్రం అల్పాహారం, నీరు, మజ్జిగ పంపిణీ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ డి.రవీంద్ర ఆధ్వర్యంలో రథసప్తమి సందర్భంగా శుక్రవారం ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వ హించి భక్తుల ప్రశంసలు అందుకున్నారు. నాలుగు మాఢవీధులను శుభ్రపరిచారు.

Updated Date - Feb 17 , 2024 | 12:36 AM