పశుపోషకులకు ప్రయోజనకరం గోకులం షెడ్లు
ABN , Publish Date - Dec 05 , 2024 | 11:52 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో గోకులం షెడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో నిర్మాణాలు జరుగుతున్న మినీ గోకులం షెడ్లు పశుపోషకులకు ఎంతో ప్రయోజనకరంగా రూపొందుతుండటంతో గ్రామా ల్లో మినీ గోకులం షెడ్ల నిర్మాణాల పట్ల పాడిరైతుల్లో ఆశక్తి పెరిగింది. దీంతో అర్హులైన పాడిరైతులు షెడ్ల నిర్మాణాల మంజూరు కోసం అధికారులు, పాలకుల చుట్టూ తిరుగుతున్నారు.
ఉపాధి నిధులతో చేపట్టేలా ప్రభుత్వం చర్యలు
ముమ్మరంగా నిర్మాణాలు
ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులు
దొనకొండ, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో గోకులం షెడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో నిర్మాణాలు జరుగుతున్న మినీ గోకులం షెడ్లు పశుపోషకులకు ఎంతో ప్రయోజనకరంగా రూపొందుతుండటంతో గ్రామా ల్లో మినీ గోకులం షెడ్ల నిర్మాణాల పట్ల పాడిరైతుల్లో ఆశక్తి పెరిగింది. దీంతో అర్హులైన పాడిరైతులు షెడ్ల నిర్మాణాల మంజూరు కోసం అధికారులు, పాలకుల చుట్టూ తిరుగుతున్నారు.
దొనకొండ మండలానికి 28 గోకులం షెడ్లు మం జూరయ్యాయి. వీటికోసం 48 మంది పాడి రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. జాబ్ కార్డు కలిగి సొంత స్థలం ఉన్న చిన్న, సన్న కారు రైతులైన 28మందిని అధికారులు ఎంపిక చేశారు. షెడ్డుకు రూ. 2.30 లక్షల నిర్మాణ వ్యయం కాగా లబ్ధిదారుడు తమ వంతు పది శాతం వాటా చెల్లిస్తే ఉపాధి హమీ నిధులతో నిర్మాణాలు చేపట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మండలంలో 25 గోకులం షెడ్ల నిర్మాణాలు ముమ్మరంగా జరుగుతుండగా మూడు పూర్తి దశకు చేరాయి.
2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో పాడి రైతుల శ్రేయస్సును గుర్తించి గోకులం షెడ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గోకులం షెడ్ల నిర్మాణాల పట్ల నిర్లక్ష్యధోరణిగా వ్యవహరించి పశుపోషకుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో గోకులం షెడ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టింది. గ్రామాల్లో పశుపోషణ, గొర్రెలు, మేకలు పెంపకానికి, పాడిపరిశ్రమకు ఎంతగానే దోహదపడేలా మెరుగైన వసతితో మినీ గోకులం పేరట షెడ్ల నిర్మాణాలు శ్రీకారం చుట్టింది.
టీడీపీ కూటమి ప్రభుత్వం పాడిపరిశ్రమను ప్రోత్స హించేలా గోకులం షెడ్ల నిర్మాణాలు చేపట్టి పశుపో షకుల్లో ఆనందం నింపిందని పలువురు పశుపోషకులు తెలుపుతున్నారు.
పాడి పరిశ్రమకు పోత్సాహం
- పోతిపోగు చెన్నయ్య, లబ్ధిదారుడు, ఎర్రబాలెం
టీడీపీ కూటమి ప్రభుత్వం తమకు మంజూరు చేసిన గోకులం షెడ్డు తమ పశువుల సంరక్షణకు ఎంతో ప్రయోజన కరంగా ఉంది. గ్రామాల్లో పాడిపరిశ్రమ ను ప్రోత్సహించేలా టీడీపీ ప్రభుత్వం చేపట్టిన గోకులం షెడ్ల నిర్మాణాల చేపట్టింది. తద్వార పశుపోషకుల్లో ఆనందం నింపింది.
నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు
- తగరం దేవయ్య, ఏపీవో
దొనకొండ మండలానికి మంజూరైన గోకులంషెడ్ల నిర్మాణాలు డిసెంబరు నె లాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలు పా టిస్తూ త్వరితగతిన నిర్మాణాలు చేస్తున్నాం.