ఆ రెండు మున్సిపాలిటీలకు ట్యాంకర్లతో నీళ్లివ్వండి
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:31 AM
ఒంగోలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ నిధులతో మార్కాపురం, పొదిలి పట్టణా ల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు.

మార్కాపురం, జూలై 4: ఒంగోలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ నిధులతో మార్కాపురం, పొదిలి పట్టణా ల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రెండు పట్టణాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి తీవ్రతపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘మార్కాపురానికి పొంచి ఉన్న నీటి ముప్పు’ కథనానికి స్పందించి స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి విషయాన్ని మంత్రి పొంగూరు నారాయణకు తెలిపారు. ప్రతి సంవత్సరం జూలై నెలలో సాగర్ ద్వారా తాగునీటి అవసరాలకు విడుదల చేస్తారని, కానీ ఈసారి ముందు గానే సమస్య తలెత్తినట్లు ఎమ్మెల్యే కందుల మంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి నారాయణ గురువారం సచివాలయం రెండో బ్లాకులోని తన ఛాంబర్ లో జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మార్కాపురం, పొదిలి మున్సిపల్ అధికారులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా వాస్తవ పరిస్థితిని అధికారులు వివరించారు. రెండు మున్సిపాలిటీల్లో డీప్‌బోర్లు ఉన్న ప్పటికీ ఆ నీరు తాగడానికి పనికిరాదని తెలిపారు. ఇతర అవసరాలకు మాత్రమే ఆ నీటిని వినియోగించాల్సి ఉంద న్నారు. దీంతో మంత్రి నారాయణ తాగునీటికి ఎద్దడిని తీర్చేందుకు రెండు మున్సిపాలిటీల్లో అవసరమైనన్ని ట్యాంకర్లను వినియోగించాలని సూచించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిధులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ సంద ర్భంగా జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయు డు నాగార్జున సాగర్ ఇంజనీరింగ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సాగర్‌లో ప్రస్తుతం నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకున్నట్లు అధికారులు మంత్రి రామా నాయుడుకు వివరించారు. తాగునీటి సరఫరాకు నీటిని వదిలేందుకు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీ లించాలని మంత్రి సూచించారు. ఇప్పటివరకు తాగునీటి సరఫరాకు నీటిని విడుదల చేసిన వివరాలు పూర్తిస్థాయి లో అందించాలని ఆదేశించారు.