Share News

బెట్టింగులతో నిండా మునిగారు..

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:28 AM

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభిమానులు ఈసారి పందేలు కాసి భారీగా నష్టపోయారు. మొదటి నుంచి ఫలితాలపై అనుమా నంగానే ఉన్నప్పటికీ పోలింగ్‌ అనంతరం జగన్‌ ప్రకటనలు, ఆరా మస్తాన్‌ సర్వేతో పెద్దమొత్తంలో పందేలు కాశారు. ఇప్పుడు వీరంతా నిండా మునిగి లబోదిబోమంటున్నారు.

బెట్టింగులతో నిండా మునిగారు..

భారీగా కోల్పోయిన వైసీపీ అభిమానులు

తొలుత పందేలకు వెనుకంజ

జగన్‌ ప్రకటన, ఆరా సర్వే అనంతరం ముందుకు..

ఫలితాల ప్రకటన తర్వాత లబోదిబో

కొండపి, జూన్‌ 6 : సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభిమానులు ఈసారి పందేలు కాసి భారీగా నష్టపోయారు. మొదటి నుంచి ఫలితాలపై అనుమా నంగానే ఉన్నప్పటికీ పోలింగ్‌ అనంతరం జగన్‌ ప్రకటనలు, ఆరా మస్తాన్‌ సర్వేతో పెద్దమొత్తంలో పందేలు కాశారు. ఇప్పుడు వీరంతా నిండా మునిగి లబోదిబోమంటున్నారు. టీడీపీ కూటమి వైపు వివిధ రకాలు పందేలు వేసి న వారంతా గెలిచారు. గ్రామాల వారీగా వేసిన పందేలు కూడా కూటమి అభిమానులకే వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి టీడీపీ కూటమి వస్తుం దని, ఒంగోలు ఎంపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటుందని, కొండపి ఎమ్మెల్యేగా స్వామి మెజారిటీ 5వేలకు మించదన్న విషయమై బెట్టింగ్‌లు నడిచాయి. వీటన్నింటినీ టీడీపీ అభిమానులు గెలుచుకున్నారు. కోట్ల రూ పాయల్లో వైసీపీ అభిమానులు పందేల రూపంలో పోగొట్టుకున్నారు. కొండ పి మండలంలో వైసీపీకి తలకాయగా ఉండే గ్రామంలో అభిమానులైన మహిళలు వైసీపీ అధికారంలోకి వస్తుందని దాదాపు రూ.2 కోట్లకుపైగా పందేలను తమ భర్తలను ప్రోత్సహించి వేయించినట్లు తెలిసింది. ఈగ్రా మంలో పందేలు వేసిన వారంతా నిండా మునిగారు. మండలంలోని కొం డపి, పెట్లూరు, అనకర్లపూడి, పెరిదేపి, ముప్పవరం, వెన్నూరు, కట్టుబడి వారిపాలెం గ్రామ పంచాయతీల్లో బూత్‌లు, గ్రామ పంచాయతీల వారీగా మెజారిటీలపై వైసీపీ అభిమానులు వేసిన అన్ని పందేలను టీడీపీ అభి మానులు గెలుచుకున్నారు. మండలాల వారీగా మెజారిటీపై బెట్టింగ్‌లు కా చిన వైసీపీ అభిమానులు అన్ని చోట్లా పందేలు కోల్పోయారు.

Updated Date - Jun 07 , 2024 | 12:28 AM