Share News

సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:43 PM

యద్దనపూడి మండలం యనమదల గ్రామ పంచాయతీపరిధిలో రూ.2 కోట్ల 80లక్షల వ్యయంతో నిర్మించనున్న 33బై 11కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి శనివారం విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అద్దంకి డీఈ మస్తానరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గంలో లోవోల్టేజీ సమస్య, కూలేందుకు సిద్ధంగా ఉన్న కరెంట్‌ స్తంభాలు, వేలాడుతున్న తీగలు తదితర సమస్యలను ఎమ్మెల్యే ఏలూరి తనదృష్టికి తెచ్చారన్నారు.

సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి, కలెక్టర్‌ వెంకటమురళి

45వేల విద్యుత్‌ కనెక్షన్ల

మంజూరు లక్ష్యం : మంత్రి గొట్టిపాటి

యద్దనపూడి, (మార్టూరు) సెప్టెంబరు 21 : యద్దనపూడి మండలం యనమదల గ్రామ పంచాయతీపరిధిలో రూ.2 కోట్ల 80లక్షల వ్యయంతో నిర్మించనున్న 33బై 11కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి శనివారం విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అద్దంకి డీఈ మస్తానరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గంలో లోవోల్టేజీ సమస్య, కూలేందుకు సిద్ధంగా ఉన్న కరెంట్‌ స్తంభాలు, వేలాడుతున్న తీగలు తదితర సమస్యలను ఎమ్మెల్యే ఏలూరి తనదృష్టికి తెచ్చారన్నారు. అందులో భాగంగా సబ్‌ స్టేషన్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రెండు నెల్లో పూర్తిచేసి రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలందిస్తామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 45వేల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ల మంజూరు లక్ష్యంగా నిర్ణయించామని గొట్టిపాటి పేర్కొన్నారు. ఇప్పటికే 12 నుంచి 13 వేల దాకా కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. మరో రెండు నెలల్లో మిగిలిన కనెక్షన్లు ఇస్తామన్నారు. ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుతో లోవోల్టేజీ సమస్య తీరనుందన్నారు. సబ్‌ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో మరో రెండు చోట్ల సబ్‌ స్టేషన్ల నిర్మాణం అవసరమని, మంత్రి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకటమురళి, ఆర్‌డీవో గంధం రవీందర్‌, విద్యుత్‌ ఎస్‌ఈ సత్యన్నారాయణ, ఏడీఈ సురేంద్రబాబు, ఏఈ సురేష్‌ బాబు, నాయకులు రంగయ్య చౌదరి,,గుదే తారకరామారావు, దండా వీరాంజనేయులు,సాదినేని సుధీర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:43 PM