Share News

వాహనాలకు మాత్రమే..

ABN , Publish Date - May 19 , 2024 | 01:18 AM

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆదివారం నుంచి వచ్చేనెల 10వతేదీ వరకు వాహనాలకు మాత్రమే అవసరమైన మేరకు పెట్రోలు, డీజిల్‌ను నింపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు.

వాహనాలకు మాత్రమే..

సీసాలు, డ్రమ్ములకు డీజిల్‌, పెట్రోల్‌ కొడితే చర్యలు

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ హెచ్చరిక

ఒంగోలు (కలెక్టరేట్‌), మే 18 : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆదివారం నుంచి వచ్చేనెల 10వతేదీ వరకు వాహనాలకు మాత్రమే అవసరమైన మేరకు పెట్రోలు, డీజిల్‌ను నింపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఉత్తర్వులను తప్పనిసరిగా పెట్రోలు బంకుల యజమానులు పాటించాలన్నారు. ఆ మేరకు కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. బంకుల నుంచి పెట్రోలు, డీజల్‌ కంటైనర్లకు, బాటిల్స్‌కు, డ్రమ్ములు, ఇతర పాత్రలకు సరఫరా చేస్తే సంబంధిత యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందుకోసం జిల్లా వ్యాప్తంగా ప్లైయింగ్‌ స్క్వాడ్స్‌తో నిఘాను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్‌ను పెట్రోలు బంకుల వారు ఉల్లంఘిస్తే లైసెన్స్‌ రద్దుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - May 19 , 2024 | 01:18 AM