వైసీపీ యువనేత అనుచరుడు అరెస్టు
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:16 PM
వైసీపీ యువనేత అనుచరుడు, ఇటీవల ఒంగోలులోని మసాజ్ సెంటర్‌లో పోలీసులకు పట్టుబడి తప్పించుకున్న మార్టూరి ప్రతా్‌పరెడ్డిపై రౌడీషీట్ తెరిచారు. ఈమేరకు తాలూకా ఇన్‌చార్జి సీఐ ఖాజావలి వెల్లడించారు. ఆయన్ను అరెస్టు చేసినట్లు చెప్పారు.

ప్రతా్‌పరెడ్డిపై రౌడీషీట్
వివరాలు వెల్లడించిన ఒంగోలు తాలూకా ఇన్‌చార్జి సీఐ ఖాజావలి
ఒంగోలు (క్రైం), జూలై 28 : వైసీపీ యువనేత అనుచరుడు, ఇటీవల ఒంగోలులోని మసాజ్ సెంటర్‌లో పోలీసులకు పట్టుబడి తప్పించుకున్న మార్టూరి ప్రతా్‌పరెడ్డిపై రౌడీషీట్ తెరిచారు. ఈమేరకు తాలూకా ఇన్‌చార్జి సీఐ ఖాజావలి వెల్లడించారు. ఆయన్ను అరెస్టు చేసినట్లు చెప్పారు. వివరాలను ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఈనెల 20న స్థానిక పాత గుంటూరు రోడ్డులో గుప్తాస్ మిడివిన్‌లోని సార స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో స్పా సెంటర్ నిర్వాహకుడు కిమిడి పవన్‌కుమార్‌కు కొత్తపట్నం మండలం రాజుపాలేనికి చెందిన మార్టూరి ప్రతా్‌పరెడ్డి ఎక్కువ మొత్తంలో నగదు చెల్లించి అమ్మాయిలతో శృంగారం కోసం వేచి ఉన్నాడు. దీంతో పోలీసులు ప్రతా్‌పరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌ను నెట్టివేసి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రతా్‌పరెడ్డిని అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై విజయకుమార్, క్రైం పార్టీ సిబ్బంది కె.రామకృష్ణ, ఆర్.రాంబాబు, కె.రవికుమార్ ఉన్నారు.