Share News

హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలు

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:09 AM

హత్యాయత్నం కేసులో దోషికి ఐదేళ్లు శిక్ష విధిస్తూ, మార్కాపురం అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు న్యాయాధికారి దేవేంద్రరెడ్డి గురువారం తీర్పుచెప్పారు.

హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలు

కొమరోలు, ఫిబ్రవరి 29: హత్యాయత్నం కేసులో దోషికి ఐదేళ్లు శిక్ష విధిస్తూ, మార్కాపురం అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు న్యాయాధికారి దేవేంద్రరెడ్డి గురువారం తీర్పుచెప్పారు. స్ధానిక ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.., మండలంలోని పోట్టిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రోద్దుటూరి శివ, ఆయన తల్లి కాశమ్మలపై అదే గ్రామానికి చచెందిన జి.చిన్నబాదరయ్య హత్యాయత్నం చేశారు. కుటుంబ తగాదాలు మనసులో పెట్టుకొని, 2018 మార్చి 17న వారిని కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై అప్పటి ఎస్సై అబ్ధుల్‌ రెహమాన్‌ కేసు నమోదుచేశారు. ఈ మేరకు కేసును విచారించిన మార్కాపురం అసిస్టెంట్‌ సెషెన్ప్‌ కోర్టు న్యాయాధికారి బి.దేవేంద్రరెడ్డి గురువారం 5పంవత్పరాలు జైలు శిక్ష, రూ.500 జరిమానను విధించినట్లు ఎసై్ౖస తెలిపారు. నిందితుడిని నెల్లూరు జైలుకు తరలించారు.

Updated Date - Mar 01 , 2024 | 12:09 AM